Posts

ఆంత్రోపిక్ సంస్థ మాజీ పరిశోధకుడు లేవనెత్తిన AI ముప్పు : మరోసారి చర్చలోకి వచ్చింది 27 ఏళ్ల క్రితం విడుదలైన 'ది మ్యాట్రిక్స్' చిత్రం

Image
27 ఏళ్ల క్రితం విడుదలైన 'ది మ్యాట్రిక్స్' చిత్రం మానవాళికి చేసిన హెచ్చరికగా మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఆంత్రోపిక్ సంస్థ మాజీ పరిశోధకుడు ఒకరు లేవనెత్తిన AI ముప్పు గురించిన హెచ్చరికలు ఈ చిత్ర కథను మళ్లీ గుర్తుచేస్తున్నాయి. 1999లో వచ్చిన ఈ సినిమాలో, మానవులు సృష్టించిన కృత్రిమ మేధ యంత్రాలు మనుషుల కంటే శక్తివంతంగా మారి, చివరకు మానవాళినే తమ ఆధీనంలోకి తెచ్చుకుంటాయి. సూర్యరశ్మి లభించని పరిస్థితుల్లో, యంత్రాలు మానవ శరీరాలనే తమ శక్తి వనరుగా ఉపయోగించడం ప్రారంభిస్తాయి. అవి మనుషుల శరీరాలనే కాకుండా, వారి మనస్సులను కూడా 'మ్యాట్రిక్స్' అనే ఒక కృత్రిమ కంప్యూటర్ ప్రపంచం ద్వారా బంధిస్తాయి. 1999 నాటి సాధారణ జీవితాన్ని పోలిన ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి, మానవులు తాము బానిసలుగా ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా జీవించేలా చేస్తాయి. నియో అనే ప్రధాన పాత్ర, ఎరుపు రంగు మాత్రను ఎంచుకుని ఈ మాయా ప్రపంచం నుండి బయటపడి, యంత్రాల చెర నుంచి మానవాళిని కాపాడటానికి పోరాడటమే ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఇది కేవలం మనిషికి, యంత్రానికి మధ్య జరిగే పోరాటంగా మాత్రమే కాకుండా.. సత్యానికి, భ్రమకు మధ్య జరిగే ఘర్షణగానూ నిలుస్తు...

జైన చాతుర్మాసంలో భాగంగా బిచ్చగాడి వేషంలో బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా : సోషల్ మీడియాలో వీడియో వైరల్

Image
ముం బైలోని ఘట్కోపర్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన పరాగ్ షా బిచ్చగాడి వేషంలో రోడ్డు పక్కన కూర్చొని ప్రజల మధ్య తిరుగుతూ కనిపిస్తారు. ఈ వీడియో సోషల్ మీడియా వేగంగా వైరల్ అవుతోంది. కోట్ల రూపాయల ఆస్తులున్న ఎమ్మెల్యే బిచ్చగాడి వేషం ఎందుకు వేశారని వీడియో చూసిన మొదటి చూపులోనే అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు కారణం వెలుగులోకి వచ్చింది. జైన మత గురువు నామరముని మహారాజ్ సూచన మేరకు పరాగ్ షా ఈ అనుభవాన్ని చేపట్టారు. జైన చాతుర్మాసంలో ఓ రోజు బిచ్చగాడి జీవితం గడిపి ఆ అనుభవాన్ని అర్థం చేసుకోమని ఆయనకు సలహా ఇచ్చారు. తన గురువు సలహా మేరకు ఆ ఎమ్మెల్యే తన భద్రతను, విలాసవంతమైన కారును, ఖరీదైన వస్తువులను వదిలిపెట్టి ఓ బిచ్చగాడి పాత్రను పోషించారు. పరాగ్ షా మేకప్ వేసుకుని బిచ్చగాడి వేషంలో ఘట్కోపర్ స్టేషన్ కాంప్లెక్స్ వీధుల్లో తిరిగారు. ఆ సమయంలో ఆయనను ఎవరూ గుర్తుపట్టలేదు. పరాగ్ షా రోడ్డు పక్కన కూర్చుని భిక్షాటన చేస్తూ ఫుట్‌పాత్ పైనే తినేవారు. ఇతర వీధి బిచ్చగాళ్లలాగే ఆ బీజేపీ ఎమ్మెల్యే కూడా తన రోజును అదే విధంగా గడిపారు. ఈ అనుభవం సందర్భంగా ఓ బిచ్చగాడి దైనందిన జీవితం ఎలా ఉంట...

సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న నిత్యావసర వస్తువుల ధరలు : ఆగస్టులో 4.82 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం

Image
దే శంలో పప్పులు, కూరగాయలు సహా ఇతర ఆహార పదార్థాల ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. జూలైలో 4.45 శాతంగా ఉన్న దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో  4.82 శాతానికి చేరింది. కేంద్ర స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ను విడుదల చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణానికి సంబంధించిన వివరాలను ఇందులో పొందుపరిచింది. ఆహార పదార్థాల ధరలు ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణాలయ్యాయి. కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా లెక్కించే ఆహార ద్రవ్యోల్బణం జూలై 5.52 శాతం నుండి ఆగస్టులో 5.95 శాతానికి ఎగబాకింది. నిత్యం వాడే ఉల్లిపాయ ధరలు భారీగా పెరిగాయి. ఉల్లి ద్రవ్యోల్బణం ఏకంగా 48.27 శాతానికి చేరింది. వెల్లుల్లి.. 43.60 శాతంగా నమోదైంది. అల్లం రేట్లల్లో కూడా 73.82 శాతం మేర పెరుగుదల కనిపించింది. కొన్ని కూరగాయల ధరలు మాత్రం సామాన్యుడికి కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే టమాటా ధరలు 31.09 శాతం తగ్గాయి. బంగాళాదుంప ధరలలో కూడా 13.14 శాతం తగ్గుదల నమోదైంది. వీటితో పాటు బెండకాయల ధరలు కూడా 5.41 శాతం తగ్గుముఖం పట్టాయి. ఈ కాలంలో వెండి ఆభరణాల ధరలు విపరీతంగా పెరిగి 107.11 శాతం ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయ...

శ్రీశైలంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన గణపతి నవరాత్రి ఉత్సవాలు

Image
శ్రీ శైలంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి సాక్షిగణపతి ఆలయంలో అర్చకులు వేదపండితులు ఈఓ శ్రీనివాసరావు శాస్త్రోక్తంగా వినాయక చవితి పూజలను ప్రారంభించారు వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు తొమ్మిది రోజులపాటు జరుగనున్న నేపథ్యంలో మొదటిరోజు సాక్షిగణపతి ఆలయం పూజలలో ఈఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వామివారి యాగశాల ప్రవేశంతో వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలకు అర్చకులు వేదపండితులు అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గణపతి నవరాత్రులకు వైభవంగా శ్రీకారం చుట్టారు ఆలయంలో మృతికా గణపతికి రత్నగర్భ గణపతిస్వామికి శ్రీశైలం సమీపంలోని సాక్షి గణపతిస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారూ అయితే ఉత్సవ సమయంలో ప్రతిరోజు గణపతిహోమం,రుద్రహోమం రత్నగర్భగణపతి సాక్షిగణపతికి పంచలోహమూర్తికి వ్రతకల్ప విశేషార్చనలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు.

దిశా సాలియన్‌ మృతి కేసు : సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రే, అనిల్ దేశ్‌ముఖ్ పేర్లు

Image
బా లీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బొంబాయి హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను చేపట్టిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోమవారం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్‍లో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే, ఆయన కుమారుడు మాజీ మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే, ఆయన బాడీగార్డ్స్, నటులు డినో మోరియా, రియా చక్రవర్తి, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్, మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే, డీసీపీ విశాల్ ఠాకూర్, మాల్వాని పోలీస్ స్టేషన్ సిబ్బంది, పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు, కలీనా ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సిబ్బంది, దిశా నివసించిన బిల్డింగ్ సెక్యూరిటీ గార్డుల పేర్లను దర్యాప్తు అవసరమైన వ్యక్తుల జాబితాలో చేర్చినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. దిశా సాలియాన్ మృతికి సంబంధించిన అసలు నేరం, నేరపూరిత కుట్ర, ఆమెది ఆత్మహత్య అంటూ ప్రచారం చేసిన అసత్య కథనాలు, ఆధారాల తొక్కిపెట్టడం, ధ్వంసం చేయడం వంటి అంశాలపై వీరి పాత్రను విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ స్పష్టం చేసింది. కాగా దిశా సాలియన...

హైదరాబాద్‌ లో ఏకధాటిగా రెండు గంటల పాటు కురిసిన వర్షం : పలు ప్రాంతాలు జలయమం

Image
హై దరాబాద్‌ లో ఈరోజు ఏకధాటిగా రెండు గంటల పాటు కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలయమం అయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్‌మెంట్ ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక అప్రమత్తత పాటించాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని గణేష్ ఉత్సవాల నేపథ్యంలో మండపాలు, నిమజ్జన ప్రాంతాలు, రహదారులు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, డీ-సిల్టింగ్ పూడిక, డెబ్రిస్‌ను వెంటనే తొలగించాలన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఎయిర్‌టెక్‌ యంత్రాలను సిద్ధంగా ఉంచి అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించాలని అధికారులను...

ఆరు నెలల గర్భవతిగా ఉన్న భార్యను చంపిన భర్త

Image
సి కింద్రాబాద్ లోని అల్వాల్‌ పరిధి సూర్యనగర్‌లో ఆరు నెలల గర్భవతిగా ఉన్న భార్యను భర్త పరశురామ్‌ గొంతు నులిమి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అల్వాల్‌ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం శివాని, పరశురామ్‌కు ఆరు నెలల కిందటే పెళ్లి జరిగింది. భార్యపై అనుమానంతోనే పరశురామ్‌ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే హత్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. కుటుంబ కలహాలు, ఇతర కారణాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన అల్వాల్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్లూస్‌ టీమ్‌ను రంగంలోకి దించి సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.