Posts

Showing posts with the label 'Invest Telangana Global Summit' in December

డిసెంబర్‌లో 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్' : సత్వర ఏర్పాట్లకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశం

Image
డి సెంబర్‌లో నిర్వహించ తలపెట్టిన 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'కు సత్వరమే అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమ్మిట్ సన్నద్ధతపై సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణను అంతర్జాతీయ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రదర్శించేలా ఈ సమ్మిట్ ఏర్పాట్లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. వివిధ వ్యాపార, పారిశ్రామిక సెక్టార్లలో విశేష గుర్తింపు పొందిన ప్రముఖులను ఈ గ్లోబల్ సమ్మిట్‌లో సన్మానించేలా ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా గత ఏడాది నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వివరాలు, ఒప్పందాల పురోగతిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువైన నూతన ప్రణాళికలను సద్ధం చేయాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు...