12 సంవత్సరాల తర్వాత ధోనిని కలిసిన జోగిందర్ శర్మ !
భా రత క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ జోగీందర్ శర్మ ఎంఎస్ ధోనితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2007 టి20 వరల్డ్ కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై చివరి ఓవర్‌ని బౌల్ చేసి 13 పరుగుల డిఫెండ్‌తో టీమ్ ఇండియా టైటిల్‌ను గెలవడంలో జోగిందర్ శర్మ కీలక పాత్ర పోషించాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు టీ20 ప్రపంచకప్ హీరో ఎంఎస్ ధోనీతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. ధోని 2007 టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఉండగా, పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌లో జోగిందర్ శర్మను చివరి ఓవర్‌లో బౌలింగ్ చేయమని పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. దాంతో ధోని నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయాన్ని అందించాడు. ప్రస్తుతం జోంగిదర్ శర్మ హర్యానా పోలీస్ శాఖలో డీఎస్పీగా పని చేస్తున్నారు. ధోనితో తన సమావేశానికి సంబంధించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియా ద్వారా జోగిందర్ శర్మ పంచుకున్నారు. ఈ చిత్రాలపై ఆయన 'ఏ యార్ సున్ యారీ తేరీ…' పాటను ఉపయోగించారు. అంతేకాకుండా., చాలా కాలం తర్వాత MS ధోనిని కలవడం చాలా ఆనందంగా ఉంది. 12 సంవత్సరాల తర్వాత ఈ రోజు మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందంటూ రాసుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరఫున హీరోగా మారిన జోగీందర...