ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీజీఎం ముత్యం వెంకటరమణ అరెస్ట్
తె లంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ ముత్యం వెంకటరమణను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ జరిపిన ప్రాథమిక అంచనాల ప్రకారం ఆయన వద్ద లభ్యమైన ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రూ.200 కోట్ల వరకు ఉంటుందని భావిస్తుండగా, ప్రభుత్వ రికార్డులు మరియు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం వాటి విలువ రూ.28 కోట్లుగా నమోదైంది. వెంకటరమణ నివాసంతో పాటు ఆయనకు చెందిన బంధువులు, సన్నిహితుల ఇళ్లపై దాదాపు 14 గంటల పాటు ఏసీబీ బృందాలు విస్తృత సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో హైదరాబాద్‌లోని మాదాపూర్, కూకట్‌పల్లి, శేర్లింగంపల్లి, మూసాపేట తదితర కీలక ప్రాంతాల్లో ఉన్న విలాసవంతమైన భవనాలు, ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్ ఫ్లాట్లకు సంబంధించిన స్థిరాస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.52 లక్షల నగదు, 2,094 గ్రాముల పసిడి ఆభరణాలు, రూ.30 లక్షల విలువైన అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు 19 విదేశీ మద్యం బాటిళ్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. వెంకటరమణపై గతంలో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన పూ...