తెలంగాణాలో బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్
తె లంగాణలో 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు వయసు ఉన్న బాలికల కోసం కేంద్రంతో కలిసి ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా బాలికలు ఎవరూ క్యాన్సర్ బారిన పడకూడదని భావించిన ప్రభుత్వం, రాష్ట్రంలో సుమారు 4.60 లక్షల మంది బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పించాలని నిర్ణయించింది. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రారంభానికి ముందు మైక్రో ప్లానింగ్ సర్వే నిర్వహిస్తారు. దీని ద్వారా పాఠశాలల బయట ఉన్న బాలికల వివరాలను సేకరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ కేసులను కట్టడి చేయడం కోసం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా 15 సంవత్సరాల బాలికలకు హెచ్పివి టీకాలను వేయించనున్నారు. సర్వైకల్ క్యాన్సర్ ప్రారంభ దశలో లక్షణాలు కల్పించకపోవడం వల్ల దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు. వ్యాధి ముదిరే కొద్ది లక్షణాలు బయటపడి, అది తీవ్ర దశకు చేరుకుంటుంది. అప్పుడు చికిత్స చేయడం, ప్రాణాలు కాపాడడం కూడా కష్టతరమవుతుంది. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం 15 ఏళ్ల యుక్త వయసులో ఉన్న బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వడం సర్వైకల్ క్యాన్సర్...