తెలంగాణ EAPCET (Bi.P.C)-2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తె లంగాణ ఉన్నత విద్యామండలి EAPCET (Bi.P.C)-2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. Bi.P.C స్ట్రీమ్ అభ్యర్థులకు B.Pharmacy, Pharm-D, బయో-టెక్నాలజీ, బయో-మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, హెల్ప్‌లైన్ సెంటర్-సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ ప్రక్రియను సెప్టెంబర్ 12 నుంచి 16 వరకు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు జరుగుతుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆప్షన్ల నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు చేపట్టి, సెప్టెంబర్ 18న ఆప్షన్లను ఫ్రీజింగ్ చేస్తారు. తొలి దశ సీట్ల ప్రొవిజనల్ అలాట్‌మెంట్‌ను సెప్టెంబర్ 21లోపు ప్రకటిస్తారు. సీటు పొందిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు చెల్లింపుతో పాటు వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను సెప్టెంబర్ 21 నుంచి 22 మధ్య పూర్తి చేయాల్సి ఉంటుంది. తొలి దశకు హాజరు కాని అభ్యర్థుల కోసం ఫై...