Posts

Showing posts with the label 100 mm of rainfall in just 16 hours

గుజరాత్ లో కుంభవృష్టి : పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

Image
గు జరాత్‌ వ్యాప్తంగా కురుస్తున్న కుంభవృష్టితో పలు ప్రాంతాలు తీవ్ర జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా వల్సాద్ జిల్లాలోని ఉంబెర్గావ్ తాలూకాలో కేవలం 16 గంటల వ్యవధిలోనే ఏకంగా 1,100 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. అనేక తాలూకాల్లో 600 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వాపి మరియు దాని పరిసర ప్రాంతాల్లో దాదాపు 200కు పైగా కార్లు, వేలాది ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి విషమించడంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని విద్యాసంస్థలకు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సూరత్, నవ్సారీ, డాంగ్స్, తాపి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వర్షపు నీరు భారీగా చేరడంతో మౌలిక వసతులు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నాయి. సహాయక బృందాలు రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగం హెచ్చరిం...