పసుపు నీళ్లతో శుద్ధి ఘటనపై భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం
తె లంగాణాలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన చావు డబ్బు కార్యక్రమంలో భాగంగా వరదరాజుపల్లి నుంచి ఆందోళనకారులు బయల్దేరిన ప్రాంతాన్ని బీఆర్ఎస్ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు నీటితో శుద్ధి చేసి దళితులను అవమానిచడమే కాకుండా మళ్లీ సభకు వచ్చి బీఆర్ఎస్ సభ్యులు న్యాయం కావాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి శుద్ధీకరణ ఘటనపై ఇవాళ సభలో మాట్లాడిన భట్టి, విపక్ష నేతల ఆగడాలు, అవమానాలను ప్రభుత్వం సంయమనంతో భరిస్తోందన్నారు. సభాపతికి చేయాల్సిన అవమానాలన్నీ బీఆర్‌ఎస్ నేతలు చేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. అవమానాలను కొనసాగించే పరిస్థితి మానుకోవాలని, సభాపతి సూచన చేస్తే వాదన పెట్టుకోకుండా సజావుగా నడిచేలా చూడాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. దళిత సమాజం పై బీఆర్ఎస్ పార్టీ వివక్ష చూపుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనపై మంత్రి సభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు వెళ్లారని పసుపు నీళ్లతో శుద్ధి చేశారని, దళితులు అడుగు పెడితే ఊరు మైల పడ్డదా? అని ప్రశ్నించారు. పసుపు నీళ్...