Posts

Showing posts with the label 8GB RAM కెపాసిటీ మరియు 128GB | 256GB రెండు స్టోరేజీ

వి25 సిరీస్ మొబైల్స్‌ ఆగస్టులో విడుదల ?

Image
ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వివో, వివో వి25 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ల విడుదలకు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. లాంచ్‌కు సంబంధించి ఇప్పటి వరకైతే కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ ఈ హ్యాండ్‌సెట్ గ్రీక్ బెంచ్ మార్కింగ్ సైట్‌లో కనిపించడం విశేషం. ఈ తాజా పరిణామం ప్రకారం చూస్తుంటే.. కొత్త  వి సిరీస్ ఫోన్ త్వరలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలియజేస్తోంది. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల విషయాన్ని పక్కన పెడితే.. లాంచ్‌కు ముందే ఇది పలు ప్లాట్‌ఫాంలలో ఇప్పటికే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలె ఆ Vivo V25 ప్రో స్మార్ట్‌ఫోన్ కు సంబంధించి భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ ఫొటో విడుదల చేయడంతో అది వైరల్‌గా మారింది. దీంతో ఆయన అభిమానులు, టెక్ ప్రియులు కూడా ఆ మొబైల్ లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ Vivo V25 స్మార్ట్‌ఫోన్ 8GB RAMతో పాటు ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 900 SoC ప్రాసెసర్‌తో వస్తుందని తెలుస్తోంది. Geekbench లిస్టింగ్‌లో తెలిసిన వివరాల ప్రకారం.. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుందని సమాచారం. గీక్‌బెంచ్‌లో సింగిల్-కోర్ టెస్టింగ్‌లో ఈ హ్యాండ్‌సెట...