Posts

Showing posts with the label director Sandeep Reddy Vanga

లాల్ దర్వాజా ఆలయాన్ని సందర్శించిన విజయ్ దేవరకొండ : బంగారు బోనం సమర్పించిన నటి నిహారిక కొణిదెల

Image
హై దరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆశీర్వాదం కోసం బోనం సమర్పించడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే తరలిరావడంతో నగరంలోని పలు ఆలయాల వద్ద భారీ జనసందోహం కనిపిస్తోంది. సినీ నటి నిహారిక కొణిదెల బంగారు బోనం సమర్పించిన తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ , ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హైదరాబాద్‌లోని ప్రసిద్ధ లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి  ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. విజయ్ దేవరకొండ లాల్ దర్వాజ ఆలయానికి వచ్చారని తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో అభిమానులు, భక్తులు అక్కడికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన విజయ్ దేవరకొండతో ఫోటోలు, వీడియోలు దిగేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహం చూపించారు. అనంతరం జనసమూహాన్ని ఉద్దేశించి మాట్లాడిన విజయ్ దేవరకొండ.. తాను లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. తన భార్య రష్మిక మందన్న కోలుకోవాలని, ఆమె క్షేమంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ఆయన ప్రత్యేక పూజలు కూడా చేశారు ."మేము మొదటిసారి మహంకాళి అమ్మవారిని దర్శించ...