Posts

Showing posts with the label Adecco India

ఈ ఏడాది ఐటీలో 1.25 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు : అడెకో ఇండియా

Image
ఈ ఏడాది ఐటీ ఉద్యోగాలు 12 నుంచి 15 శాతం పెరిగే ఛాన్స్ ఉందని వర్క్ ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా తెలిపింది. శాశ్వత, తాత్కాలిక , కాంట్రాక్టు ఆధారంగా జరిగే ఈ నియామకాల ద్వారా దాదాపు 1.25 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. అనేక కంపెనీలు ఇప్పుడు తమ బిజినెస్ లో కూడా కీలక మార్పులు చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ లాంటి విభాగాలను తమ వ్యాపారాల్లో వినియోగిస్తున్నాయి. దీనివల్ల 2026లో టెక్ నియామకాలు పెరగనున్నట్లు అడెకో ఇండియా వివరించింది. దీని గురించి ఆ సంస్థ డైరెక్టర్, బిజినెస్ హెడ్ సంకేత్ మాట్లాడుతూ 2023-24 మధ్య నెలకొన్న అనిశ్చితి తర్వాత ఏఐ ఇంజినీరింగ్,సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్, డేటా ప్లాట్ ఫామ్స్ ఆధునికీకరణ లాంటి విభాగాల్లో డిమాండ్ పెరుగుతూ వచ్చిందని తెలిపారు. కంపెనీలు క్రమంగా పునరుద్ధరణ దిశగా సాగుతున్నాయని తెలిపారు. మళ్లీ కొత్త ఉద్యోగుల కోసం కావాల్సిన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా, సైబర్ సెక్యూరిటీ లాంటి సాంకేతికతలు కంపెనీలకు ప్రధాన అవసరాలుగా మారిపోయాయి. ఈ ...