రెండేళ్లలో రూ.41,000 కోట్లు తగ్గిన ఫ్లిప్‌కార్ట్ విలువ !
రెం డేళ్లలో ఫ్లిప్‌కార్ట్ విలువ రూ.41,000 కోట్లు కుంగింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న దాని మాతృసంస్థ వాల్‌మార్ట్ ఈక్విటీ లావాదేవీలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. 2022 జనవరిలో కంపెనీ విలువ 40 బిలియన్ డాలర్లుగా ఉండగా.. అది ఈ ఏడాది తొలి నెల నాటికి 35 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది. ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే వేరుపడడం వల్లే ఫ్లిప్‌కార్ట్ విలువ తగ్గిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. 2022లో ఫ్లిప్‌కార్ట్ విలువను 40 బిలియన్ డాలర్లుగా అంచనా వేసిన వాల్‌మార్ట్ 3.2 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎనిమిది శాతం ఈక్విటీ వాటాలను విక్రయించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 3.5 బిలియన్ డాలర్లు చెల్లించి సంస్థలో మరో 10 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో దాని వాటా 85 శాతానికి చేరింది. ఫలితంగా ఈ - కామర్స్ సంస్థ విలువ 35 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయితే, వాల్‌మార్ట్ అంచనాలను ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తప్పుబట్టింది. 2023లోనే ఫోన్‌పే వేర్పాటు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు పెరిగిన విలువను వాల్‌మార్ట్ తమ సమాచారంలో అప్‌డేట్ చేయలేదని పేర్కొంది. చివరిసారి తమ కంపెనీ విలువను 2021లో అంచనా ...