2027 వన్డే ప్రపంచకప్ కౌంట్‌డౌన్ గురువారం అధికారికంగా మొదలుకానుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి కేప్‌టౌన్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. జియోహాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆఫ్రికా గడ్డపై 23 ఏళ్ల తరువాత జరుగుతున్న అతిపెద్ద క్రికెట్ ఈవెంట్‌కు ఈ ప్రకటనతో అధికారికంగా వేడి పెరగనుంది. 14 జట్లతో జరిగే టోర్నీ 2027 అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లో సాగనుంది. మొత్తం 12 వేదికల్లో 57 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకటనతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు టికెట్ల కోసం గ్లోబల్ బాలెట్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఒక మ్యాచ్‌కు గరిష్ఠంగా నాలుగు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. డిమాండ్ స్టేడియం సామర్థ్యాన్ని మించిన సందర్భాల్లో ర్యాండమైజ్డ్ డ్రా విధానంలో టికెట్లు కేటాయిస్తారు. టికెట్ బాలెట్ అక్టోబర్ 1, 2026 నుంచి నవంబర్ 21, 2026 వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం 14 జట్లలో 10 జట్లు తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆటోమేటిక్‌గా అర్హత సాధించాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ కూడా నేరుగా ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. మిగిలిన నాలుగు స్థానాల కోసం వచ్చే ఏడాది ఆరంభంలో గ్లోబల్ క్వాలిఫయర్ జరగనుంది. రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ఈ క్వాలిఫయర్‌లో పాల్గొని మెగా టోర్నీ బెర్త్ కోసం పోటీ పడనుంది. భారత క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయానికి వస్తే 2027 ప్రపంచకప్ ప్రత్యేక ప్రాధాన్యం కలిగినదిగా నిలవనుంది. రోహిత్ 2024 టీ20 ప్రపంచకప్ విజయాన్ని గుర్తుచేసుకుంటూ, 50 ఓవర్ల ఫార్మాట్‌లో కూడా ప్రపంచకప్ గెలిచిన అనుభూతిని మరోసారి పొందాలనే కోరిక ఉందని చెప్పాడు. కోహ్లీకి కూడా ఈ ప్రపంచకప్ భారత్ తరపున చివరి ప్రపంచకప్ ప్రదర్శన కానుంది. 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఉన్న కోహ్లీ, మరోసారి ట్రోఫీ సాధించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. 2027 ప్రపంచకప్‌కు ఏడాది ముందు షెడ్యూల్ విడుదల కావడంతో జట్ల ప్రణాళికలకు స్పష్టత రానుంది. గురువారం జరిగే కార్యక్రమం ద్వారా మ్యాచ్‌ల పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.