క్వాల్కామ్ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 52 వేల మంది పనిచేస్తున్నారు. 7 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని వల్ల 3600 మంది ఉద్యోగాలు పోతాయి. భారత్‌లో బెంగళూర్, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై రీజినల్ ఆఫీసుల్లో పనిచేసేవారు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. భారత్‌లో వెయ్యి మంది తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది. క్వాల్కామ్లో లేఆఫ్‌కు గురైన కొందరు ఉద్యోగులు తమకు అందించే సెవరెన్స్ ప్యాకేజ్ గురించి చర్చించుకుంటున్నారు. మూడు నెలల జీతంతో పాటు సంస్థలో పనిచేసిన ప్రతీ ఏడాదికి అదనంగా ఒక నెల జీతం చెల్లించే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో తొలగింపు పత్రాలపై సంతకాలు చేసి సమర్పిస్తే మరో నెల జీతం అదనంగా ఇస్తామని సంస్థ చెప్పినట్లు ఉద్యోగులు తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపుకు వ్యక్తిగత పనితీరు కారణం కాదని, వ్యాపార అవసరాల ఆధారంగానే లేఆఫ్ ప్రకటిస్తున్నట్లు కంపెనీ నిర్ణయం తీసుకుందని రెడ్డిట్‌లో ఓ ఉద్యోగి చెప్పారు. ఏఐపై పెట్టుబడులు, ఖర్చుల తగ్గింపులో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చని మరో ఉద్యోగి అనుమానిస్తున్నారు. క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో అమోన్ గత నెలలో ఉద్యోగులకు పంపిన మెమోలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పనితీరు ఆధారంగా తొలగింపులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మరోవైపు, డేటా సెంటర్లు, ఏఐ, కనెక్టెడ్ డివైజెస్ వంటి కొత్త రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. Layoffs.fyi ట్రాకర్ ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు 350 టెక్ కంపెనీల్లో 1.42 లక్షలకు పైగా ఉద్యోగాలు పోయాయి.
3
Beranda › Posts filed under 000 employees
Showing posts with label 000 employees. Show all posts
Showing posts with label 000 employees. Show all posts
వెయ్యి మంది ఉద్యోగులను తొలగించిన పెప్సీకో
ఉత్తర అమెరికా మార్కెట్లో క్రమంగా తగ్గుతున్న అమ్మకాలు, పెరిగిపోతున్న ఉత్పత్తి వ్యయం పెప్సీకో కంపెనీ లాభాలను దెబ్బతీయడంతో ఖర్చులు తగ్గించుకునే చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా ఉత్తర అమెరికా విభాగానికి చెందిన ఫుడ్ అండ్ బెవరేజెస్ విభాగంలో దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మారుతున్న మార్కెట్ వేగానికి అనుగుణంగా సంస్థను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని యాజమాన్యం వెల్లడించింది. పెప్సీకో ఉత్తర అమెరికా విభాగం సీఈఓ రామ్ కృష్ణన్ సిబ్బందికి రాసిన లేఖ ద్వారా ఈ ఉద్యోగ కోతల విషయాన్ని స్పష్టం చేశారు. కంపెనీ నిర్ణయాలు మరింత వేగంగా జరగడానికి, వ్యాపార విభాగాల మధ్య మెరుగైన సమన్వయం సాధించడానికే సంస్థాగత పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే వారంలోనే ఈ తొలగింపుల ప్రక్రియ పూర్తి కానుంది. పెప్సీకో వ్యాపారంలో ఎక్కువ భాగం అమెరికాలోనే సాగుతున్న నేపథ్యంలో, ఈ లేఆఫ్ వార్తలు కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అమెరికా మార్కెట్లలో కొనుగోలు శక్తి తగ్గడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. నిత్యావసరాల ధరలు పెరగడంతో వినియోగదారులు కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ స్నాక్స్ కొనడం తగ్గించేశారు. ఇటీవల ముగిసిన సెప్టెంబరు త్రైమాసికంలో ఉత్తర అమెరికాలో కూల్ డ్రింక్స్ అమ్మకాల పరిమాణం 2 శాతం మేర పడిపోగా, ఫుడ్ సేల్స్ ఏమాత్రం వృద్ధి చెందలేదు. కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఉత్పత్తుల ధరలు తగ్గించినా, భారీగా ప్రకటనలు గుప్పించినా ఫలితం దక్కలేదు. దీంతో కంపెనీ తన వార్షిక లాభాల అంచనాలను కూడా తగ్గించుకోవాల్సి వచ్చింది. కంపెనీలో లాభదాయకత పెంచాలని యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ ఫండ్ 'ఎలియట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్' సుమారు 4 బిలియన్ డాలర్ల మేర వాటాలు కొనుగోలు చేసి యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. కంపెనీ నష్టాలను తగ్గించుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పెప్సీకోలో సుమారు 3,06,000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తుండగా, ఒక్క అమెరికాలోనే 1.25 లక్షల మంది పనిచేస్తున్నారు. మొత్తం ఉద్యోగులతో పోలిస్తే వేటు పడిన వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ, రాబోయే రోజుల్లో మిగిలిన విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందా అన్న ఆందోళన ఉద్యోగుల్లో మొదలైంది.
లక్ష మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్న ఫోక్స్ వ్యాగన్ గ్రూప్
ఐరోపా కార్ల తయారీ దిగ్గజం 'ఫోక్స్ వ్యాగన్ గ్రూప్' ఏకంగా లక్ష మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందన్న వార్త ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. మొదట జర్మనీలో 50 వేల మందిని తొలగిస్తామని ప్రకటించిన ఈ సంస్థ, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ సంఖ్యను ఏకంగా లక్షకు పెంచింది. ఈ సంక్షోభ ప్రభావం కేవలం ఫోక్స్ వ్యాగన్పైనే కాకుండా, దాని అనుబంధ లగ్జరీ బ్రాండ్ ‘ఆడీ’పై కూడా పడింది. వ్యయాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా జర్మనీలోని మూడు ఫోక్స్ వ్యాగన్ ప్లాంట్లతో పాటు, ఒక ఆడీ ఫ్యాక్టరీని కూడా పూర్తిగా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ భారీ లేఆఫ్స్ మరియు ఫ్యాక్టరీల మూసివేతకు అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న సమీకరణాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా విధించిన సుంకాలు మరియు చైనాకు చెందిన చౌకైన ఎలక్ట్రిక్ వాహన కంపెనీల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీని తట్టుకోలేక ఫోక్స్ వ్యాగన్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ సంక్షోభం నుండి గట్టెక్కడానికి గ్రూప్ ఒక సంచలన వ్యూహాన్ని కూడా పరిశీలిస్తోంది. ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ నుండి ‘VW’ను పూర్తిగా వేరు చేసి, ఒక స్వతంత్ర బ్రాండ్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
21,000 మంది ఉద్యోగులను తొలగించిన ఒరాకిల్
భవిష్యత్తులో ఐటీ పరిశ్రమను శాసించబోయే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టే క్రమంలో ఒరాకిల్ మరోసారి లేఆఫ్స్ కు తెరతీసింది. ఏఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కల్పన కోసం పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుకునే వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా లేఆఫ్స్ చేపట్టింది. సంస్థ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ ఆధారిత మార్పుల వల్ల రానున్న రోజుల్లో మరింత మందిని తొలగించే అవకాశం ఉందని స్పష్టం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఒరాకిల్‌లో చోటు చేసుకున్న తాజా పునర్వ్యవస్థీకరణ వల్ల కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 13 శాతం తగ్గిపోయింది. గత ఏడాది 1,62,000 గా ఉన్న సిబ్బంది సంఖ్య ఈ ఏడాది మే 31 నాటికి 1,41,000 కు పడిపోయిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ రంగాల్లో అగ్రగామిగా నిలవడానికి కంపెనీ తీసుకుంటున్న వ్యూహాత్మక మార్పుల వల్లే ఈ భారీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని యాజమాన్యం వెల్లడించింది. వ్యాపార నిర్వహణ అంతటా ఏఐ టెక్నాలజీ ప్రవేశపెట్టడం వల్లే ఉద్యోగులను తగ్గించాల్సి వచ్చిందని ఒరాకిల్ అధికారికంగా ప్రకటించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకంతో పాటు మేనేజ్మెంట్ విధానపరమైన నిర్ణయాలు, ఉత్పత్తుల పునర్వ్యవస్థీకరణ, వ్యూహాత్మక మార్పులు, వివిధ కంపెనీల టేకోవర్ ప్రక్రియ కూడా ఈ లేఆఫ్స్‌కు కారణాలు అయ్యాయి. ఏఐ విస్తరణతో భవిష్యత్తులోనూ ఇదే తరహా సిబ్బంది తగ్గింపు చర్యలు కొనసాగే అవకాశం ఉందని ఒరాకిల్ స్పష్టం చేసింది. ఒకప్పుడు డేటాబేస్ సాఫ్ట్వేర్ సంస్థగా ఉన్న ఒరాకిల్ ఇప్పుడు నూతన రూపాన్ని సంతరించుకుంది. క్లౌడ్, ఏఐ రంగాల్లో ఓ ప్రధాన శక్తిగా మారడానికి ప్రయత్నిస్తోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజాలతో పోటీ పడేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఏఐ డేటా సెంటర్లను ఒరాకిల్ నిర్మిస్తోంది. ఓపెన్ ఏఐ వంటి గ్లోబల్ క్లయింట్ల కోసం అత్యాధునిక మౌలిక వసతులను కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. భారీ డేటా సెంటర్ల నిర్మాణం కోసం ఒరాకిల్ బిలియన్ల కొద్దీ నిధులను ఖర్చు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఒరాకిల్ అంచనా వేస్తోంది. ఈ నిధుల సేకరణ కోసం అప్పులు చేయడంతో పాటు బాండ్ల ద్వారా సుమారు 40 బిలియన్ డాలర్లను సమకూర్చుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసింది.
మైక్రోసాఫ్ట్, మెటాలో 23,000 ఉద్యోగాల కోత
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఉద్యోగుల కొంపముంచుతోంది. ఈ క్రమంలోనే భారీ పెట్టుబడులు, పెరిగిన వ్యయాలు మైక్రోసాఫ్ట్, మెటా సంస్థలను కఠిన నిర్ణయాల దిశగా నడిపించాయి. ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ రెండు దిగ్గజ సంస్థలు సుమారు 23,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపే ప్రణాళికలను రూపొందించాయి. మెటా తన అంతర్గత మెమోలో ఈ ప్రకటన చేసింది. సంస్థలోని మొత్తం సిబ్బందిలో 10 శాతం అంటే సుమారు 8,000 మందిని తొలగించనున్నట్లు పేర్కొంది. మే 20 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియతో పాటు, సంస్థలోని 6,000 ఖాళీలను కూడా భర్తీ చేయకూడదని నిర్ణయించుకుంది. కంపెనీని మరింత సమర్థవంతంగా, చురుకుగా మార్చే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మెటా స్పష్టం చేసింది. మరోవైపు, మైక్రోసాఫ్ట్ తన అమెరికా ఉద్యోగుల కోసం భారీ స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. అమెరికాలోని 1.25 లక్షల మంది ఉద్యోగులలో దాదాపు 7 శాతం మంది, అంటే 8,750 మంది ఈ ఆఫర్‌కు అర్హులుగా తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద బైఅవుట్ కార్యక్రమంగా నిలవనుంది. ప్రస్తుతం టెక్ రంగం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రం జపిస్తోంది. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా కొత్త డేటా సెంటర్ల నిర్మాణంతో పాటు జపాన్, ఆస్ట్రేలియాల్లో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెడుతోంది. మెటా సైతం ఏఐ భాగస్వామ్యాల కోసం రికార్డు స్థాయి వ్యయం చేస్తోంది. AI ద్వారా పెట్టుబడుల భారం తగ్గించుకోవాలని దిగ్గజ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కృత్రిమ మేధ కోసం చేస్తున్న భారీ ఖర్చులను సమతుల్యం చేయడం కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అలాగే తక్కువ మానవ వనరులతో సాంకేతికత ద్వారా ఎక్కువ ఫలితాలను సాధించాలని సాఫ్ట్వేర్ సంస్థలు భావిస్తున్నాయి. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సంస్థలను పునర్నిర్మించాలనుకుంటున్నాయి. టెక్ రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం, కంపెనీలు ఇప్పుడు మనుషుల కంటే మెషీన్ లెర్నింగ్, ఏఐ మౌలిక సదుపాయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి.
30 వేల మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ లు ఇచ్చిన ఒరాకిల్ !
ప్రపంచ వ్యాప్తంగా ఒరాకిల్ కంపెనీకి కార్యాలయాలు ఉన్నాయి. కరోనా సమయంలో ఈ కంపెనీ భారీగా లాభాలను ఆర్జించింది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ లే ఆఫ్ పేరుతో ఉద్యోగులను తొలగించింది. మూకుమ్మడిగా పింక్ స్లిప్ లు ఇచ్చింది. మంగళవారం పొద్దున్నే తొలగించిన 30 వేల మంది ఉద్యోగులకు మెయిల్స్ పంపించింది. భవిష్యత్తులో ఇంకా చాలా తొలగింపులు ఉంటాయని ఒరాకిల్ పేర్కొంది. వాస్తవానికి ఇటీవల త్రైమాసికల్లో భారీగా లాభాలను ఆర్జించినప్పటికీ ఒరాకిల్ కంపెనీ ఇలా చేయడం టెక్ ఉద్యోగులకు మింగుడు పడడం లేదు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ లో పెట్టుబడుల కోసం ఈ కంపెనీ ఉద్యోగుల మెడ మీద కత్తిపెట్టినట్టు తెలుస్తోంది. అమెరికా, మెక్సికో, కెనడా, భారత్ లాంటి దేశాలలో పని చేస్తున్న 1.62 లక్షల మంది సిబ్బందిలో 18 శాతం మందిని తొలగిస్తున్నట్టు ఒరాకిల్ వెల్లడించింది. అమెరికా, కెనడా ప్రాంతాలలో తొలగించిన ఉద్యోగులలో భారతీయులు పెద్ద మొత్తంలో ఉన్నట్టు తెలుస్తోంది. తొలగింపునకు గురైన ఉద్యోగులలో ఎక్కువమంది మేనేజింగ్ స్థాయిలో ఉన్న వారే కావడం విశేషం. తొలగించిన ఉద్యోగులకు నెల వేతనంతో పాటు, మరో మూడు నెలల జీతం కూడా ఇవ్వనుంది. కంపెనీలో ఉన్న సర్వీస్ ఆధారంగా 15 రోజులు జీతాన్ని అదనంగా ఇస్తుంది. మార్చి 31 వరకు మిగిలి ఉన్న అన్ని సెలవులను క్యాష్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. లేబర్ చట్టాల ఆధారంగా గ్రాట్యుటీ కూడా చెల్లిస్తూ ఉంటుంది. కంపెనీ నిర్దేశించిన గడువు లోగా రాజీనామా చేసిన వారికి మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయని తెలుస్తోంది. తొలగించిన ఉద్యోగుల కంపెనీ లాప్టాప్ లకు ఈ యాక్సెస్ కూడా నిలిపివేసింది. ఉద్యోగులు ఉదయం లేవగానే తొలగింపు మెయిల్స్ రావడంతో చాలామంది ఆవేదన చెందారు. ఈ తొలగింపును ఒరాకిల్ చరిత్రలోనే అతి పెద్దదని భావిస్తున్నారు.
ఉచిత ప్రయాణం వెసులుబాటును దుర్వినియోగం చేసిన ఎయిర్ ఇండియా సిబ్బంది !
ఎయిర్ ఇండియా సంస్థ తన ఉద్యోగులకు ఇచ్చే ఉచిత ప్రయాణ వెసులుబాటును వేలాది మంది సిబ్బంది అడ్డదారిలో దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఈ అక్రమాలకు పాల్పడిన సుమారు 4,000 మంది ఉద్యోగులపై యాజమాన్యం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఎయిర్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగికి ఏడాదికి 14 ఉచిత రిటర్న్ టిక్కెట్లు లభిస్తాయి. వీటిని కేవలం సదరు ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యులు (తల్లిదండ్రులు, భార్యాపిల్లలు) మాత్రమే ఉపయోగించుకోవాలి. అయితే కంపెనీ నిర్వహించిన అంతర్గత దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వేలాది మంది ఉద్యోగులు తమకు ఏమాత్రం రక్తసంబంధం లేని వ్యక్తులను 'బంధువులు'గా చూపి ఉచితంగా టిక్కెట్లు పొందినట్లు వెల్లడైంది. అలాగే మరికొందరు ఏకంగా తమకు వచ్చిన ఉచిత టిక్కెట్లను బయటి వ్యక్తులకు భారీ ధరలకు అమ్ముకుని అక్రమంగా సొమ్ము చేసుకున్నట్లు తేలింది. మొత్తం 24,000 మంది సిబ్బందిలో దాదాపు 16 శాతం మంది ఈ అక్రమాల్లో భాగస్వాములైనట్లు నివేదికలు చెబుతున్నాయి. విచిత్రమేమిటంటే, ఈ స్కామ్‌లో దొరికిపోయిన వారిలో ఎక్కువ మంది ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత (టాటా గ్రూప్ బాధ్యతలు చేపట్టాక) చేరిన వారే కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టాటా యాజమాన్యం తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మోసపూరితంగా పొందిన టిక్కెట్ల విలువను సదరు ఉద్యోగుల జీతాల నుంచి నేరుగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భవిష్యత్తులో ఉచిత టిక్కెట్ల సౌకర్యం లేకుండా బ్యాన్ విధిస్తున్నారు. అలాగే ఇకపై ఎవరైనా నామినీని చేర్చుకోవాలంటే కచ్చితమైన చట్టపరమైన ఆధారాలు, రక్తసంబంధ నిరూపణ పత్రాలు సమర్పించడం తప్పనిసరి చేశారు.
మొహాలీ డెవలప్మెంట్ సెంటర్‌ని విస్తరించిన ఇన్ఫోసిస్ !
ఇన్ఫోసిస్ మొహాలీ డెవలప్మెంట్ సెంటర్‌ని విస్తరించింది. 3,50,000 చ.అ. విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ని ప్రారంభించింది. ఇది సుమారు 3,000 మంది ఉద్యోగులకు సరిపోతుందని కంపెనీ తెలిపింది. బ్యాంకింగ్, హెల్త్‌కేర్, రిటైల్ తదితర రంగాల్లో గ్లోబల్ క్లయింట్లకు ఏఐ ఆధారిత సొల్యూషన్స్, క్లౌడ్ సర్వీసులు అందించేందుకు ఇందులోని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బ్లాక్ ఉపయోగపడుతుందని వివరించింది. కృత్రిమ మేధ సర్వీసులను పటిష్టం చేసుకోవాలన్న తమ వ్యూహంలో ఇదొక కీలక మైలురాయని ఇన్ఫీ సీఎఫ్‌వో జయేష్ సంఘ్రాజ్కా తెలిపారు. స్థానికంగా మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించి, ప్రాంతీయంగా టెక్నాలజీ వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా రాష్ట్ర వృద్ధికి ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం మొహాలీ సెంటర్లో ఇన్ఫికి వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నారు.
ఆర్థిక సేవల సంస్థ బ్లాక్ లో దాదాపు 4 వేల మంది ఉద్యోగుల తొలగింపు
ఆర్థిక సేవల సంస్థ బ్లాక్ లో దాదాపు 4 వేల మందిని తొలగిస్తున్నట్లు టెక్ రంగ ప్రముఖుడు జాక్ డోర్సీ ప్రకటించాడు. సంస్థ లాభాల్లో వున్నప్పటికీ కేవలం సామర్ధాన్ని పెంచుకోవడానికే ఈ కఠిన నిర్ణయం తీకున్నట్లు తెలిపాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తక్కువ మంది సిబ్బందితోనే ఎక్కువ పనిని పూర్తి చేయవచ్చని ఆయన బలంగా నమ్ముతున్నారు. ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి ఏఐ ప్రభావంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సాంకేతికత ధనికులను మరింత ధనవంతులుగా మారుస్తుందని, సామాన్య ఉద్యోగులు మాత్రం ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కంపెనీ యజమానులు ఖర్చు తగ్గించుకుని లాభాలు గడిస్తారని, కానీ శ్రమపడే వర్గానికి ఇది గడ్డుకాలమని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిట్రిని రీసెర్చ్ నివేదిక ప్రకారం 2028 నాటికి ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. వేగంగా మారుతున్న సాంకేతికత వల్ల చాలా రంగాల్లో మానవ అవసరం తగ్గిపోతుందని ఈ సంస్థ అంచనా వేసింది. భవిష్యత్తులో ఈ మార్పులు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనే ఆందోళన ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఆస్తి వివరాలు వెల్లడించని ఉద్యోగులు : 68,000 మంది జీతాలను నిలిపివేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
ఉత్తరప్రదేశ్ లో ఆస్తి వివరాలు వెల్లడించని ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 68,000 మందికి పైగా ఉద్యోగుల జీతాలు నిలిపివేసింది. జనవరి 31 గడువులోగా మానవ సంపద పోర్టల్‌లో చరాస్తులు, స్థిరాస్తుల వివరాలను సమర్పించడంలో విఫలమైన ప్రభుత్వ ఉద్యోగుల జనవరి నెల జీతాలు నిలిపివేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. తప్పనిసరిగా ఆస్తుల వివరాలను అప్లోడ్ చేసే వరకు జీతాల నిలిపివేత కొనసాగుతుందని చెప్పారు. ఈ నిబంధనలను పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం హెచ్చరించింది. కాగా, ప్రభుత్వ డేటా ప్రకారం 34,926 గ్రూప్ సీ ఉద్యోగులు, 22,624 గ్రూప్ డీ సిబ్బంది, 7,204 గ్రూప్ బీ అధికారులు, 2,628 గ్రూప్ ఏ అధికారులు నిర్దేశిత సమయంలోగా తమ ఆస్తుల వివరాలను సమర్పించడంలో విఫలమయ్యారు. మరోవైపు ప్రధాన కార్యదర్శి ఎస్పీ గోయల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు గడువులోగా తమ ఆస్తుల వివరాలు వెల్లడించలేదని ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో ఆయా ఉద్యోగులకు ఫిబ్రవరిలో కూడా జీతాలు అందుతాయన్న గ్యారెంటీ లేదన్నారు.
15 వేల మంది ఉద్యోగులకు మంగళం పాడనున్న వెరిజోన్
అమెరికాకు చెందిన ప్రముఖ టెలికాం దిగ్గజం వెరిజోన్ రాబోయే వారం ప్రారంభంలోనే దాదాపు 15 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు రాయిటర్స్‌కు సమాచారం అందింది. ఇది కంపెనీ మొత్తం శ్రామిక శక్తిలో 15 శాతం ఉండగా, వెరిజోన్ ఇప్పటి వరకు చేపట్టిన అతిపెద్ద ఉద్యోగ కోతలలో ఒకటిగా నిలవనుంది. అక్టోబర్ ప్రారంభంలోనే బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఈఓ డాన్ షుల్మన్, తీవ్రమైన పోటీ పరిస్థితుల్లో వెరిజోన్ను తిరిగి లాభదాయక మార్గంలో నడిపేందుకు పునర్వ్యవస్థీకరణ చర్యలను చేపడుతున్నారు. టెలికాం మార్కెట్లో వృద్ధి శాతం తగ్గిపోయిన సమయంలో కంపెనీ ఖర్చు తగ్గించుకుని వేగంగా దూసుకుపోగల సంస్థగా మారాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు. రాబోయే ఉద్యోగ కోతలు ముఖ్యంగా యూనియన్ కాని మేనేజ్ మెంట్, కార్పొరేట్ రోల్స్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతేకాక, వెరిజోన్ సంస్థకు చెందిన 180 రిటైల్ దుకాణాలను ఫ్రాంచైజీలకు అప్పజెప్పి నేరుగా నిర్వహించే దుకాణాల సంఖ్యను తగ్గించాలనే వ్యూహాన్ని కూడా అమలు చేయనుంది. ఈ చర్యతో ఆపరేషనల్ ఖర్చులు భారీగా తగ్గుతాయని కంపెనీ అంచనా. వెరిజోన్ ఇంత పెద్ద నిర్ణయం వెనుక కారణాలు చూసినట్లయితే.. అమెరికా టెలికాం మార్కెట్లో పోటీ తీవ్రంగా పెరిగింది. ఏటీ&టీ, టీ-మొబైల్ వంటి ప్రత్యర్థులు కొత్త ఐఫోన్ మోడళ్ల లాంచ్ సమయంలో చౌకైన డేటా ప్లాన్లు, ఉచిత అప్గ్రేడ్లు, భారీ డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. కంకాస్ట్, చార్టర్ వంటి కేబుల్ కంపెనీలు మొబైల్ + బ్రాడ్‌బ్యాండ్ బండిల్స్‌తో మార్కెట్లో గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వెరిజోన్ తన సేవల ధరలను దూకుడుగా తగ్గించకుండా వాటితో పోటీ పడటం కష్టమవుతోంది. మూడో త్రైమాసికంలో వెరిజోన్ కేవలం 44 వేల కొత్త నెలవారీ వైర్లెస్ కస్టమర్లను మాత్రమే యాడ్ చేసుకుంది. అదే సమయంలో టీ-మొబైల్ 10 లక్షలకు పైగా కొత్త వినియోగదారులను జోడించగా, ఏటీ&టీ కూడా స్థిరంగా ముందంజలో ఉంది. కస్టమర్లను నిలబెట్టుకునేందుకు వెరిజోన్ ఖరీదైన స్మార్ట్ఫోన్లపై భారీ సబ్సిడీలు ఇవ్వాల్సి వస్తోంది. ఈ వ్యయం తగ్గించేందుకు ఉద్యోగ కోతలను ఉపయోగించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో వెరిజోన్ భారీగా పెట్టుబడులు పెట్టింది. 2021లో 5G నెట్‌వర్క్‌కు కీలకమైన మిడ్-బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం 52 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. Frontier ఫ్రాంటియర్ కమ్యూనికేషన్స్ ను 20 బిలియన్ డాలర్లకు, ట్రాక్ ఫోనీను 6 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ పెట్టుబడుల ఫలితాలు రావడానికి సమయం పడుతుండటంతో కంపెనీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గత మూడు సంవత్సరాలలో వెరిజోన్ ఇప్పటికే 20 వేల ఉద్యోగాలను తగ్గించింది. 2023లో మాత్రమే 4,800 మంది ఉద్యోగులు స్వచ్ఛంద రిటైర్మెంట్ పథకం కింద వెళ్లిపోయారు. ఇది కంపెనీకి దాదాపు 2 బిలియన్ల ఖర్చును తీసుకొచ్చింది. కంపెనీని మరింత వేగంగా, సమర్థవంతంగా మార్చి, తిరిగి కస్టమర్లను ఆకర్షించే స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా సీఈఓ భావిస్తున్నారు. అయితే, ఈ భారీ ఉద్యోగ కోతలు వెరిజోన్ మార్కెట్ పనితీరును ఎంతవరకు మెరుగుపరుస్తాయో చూడాలి.
14,000 మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్
అమెజాన్ మరోసారి పెద్ద స్థాయిలో లేఆఫ్స్ చేపట్టింది. ఈసారి కంపెనీ దాదాపు 14,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనుంది. ఇందులో భారత్‌లో 800 నుండి 1,000 మంది వరకు ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఫైనాన్స్, మార్కెటింగ్, మానవ వనరులు, టెక్నాలజీ వంటి విభాగాల్లో ఈ తొలగింపులు జరిగే అవకాశముందని అంచనా. అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీలో ఉద్యోగాల కోతలు గణనీయంగా పెరిగాయి. జనరేటివ్ ఏఐ అభివృద్ధితో రాబోయే కాలంలో మానవ వనరుల అవసరం తగ్గవచ్చని ఆయన ముందే పేర్కొన్నారు. 2023లో అమెజాన్ రెండు విడతల్లో సుమారు 27,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది, అందులో భారత్‌లో 500 మంది ఉన్నారు. తాజా లేఆఫ్‌లో కూడా భారతీయ కార్పొరేట్ సిబ్బంది ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కంపెనీ తెలిపిన ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన వారికి సంస్థలోనే మరో అవకాశాన్ని వెతికేందుకు మూడు నెలల సమయం ఇస్తారు. కొత్త ఉద్యోగం దొరకకపోతే సెవరెన్స్ పే, అవుట్‌ప్లేస్‌మెంట్ సేవలు, ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు అందజేస్తారు. ప్రస్తుతం అమెజాన్ ఏఐ టెక్నాలజీల అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెట్టుతోంది. వ్యయాలను తగ్గించి లాభదాయకతను పెంచడం లక్ష్యంగా ఈ ఉద్యోగ కోతలు చేపడుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Subscribe to:
Posts (Atom)

