3

త్వరలో వివో వీ80 ఎఫ్ఈ విడుదల ?

దేశంలో త్వరలోనే లాంచ్ కానుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ కొత్త మోడల్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ 'గీక్‌బెంచ్'లో దర్శనమిచ్చింది. ఈ లిస్టింగ్ ప్రకారం... V2624 మోడల్ నంబర్‌తో వస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్, 8GB RAMతో రానుంది. ఇందులో మీడియాటెక్ MT6878 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీన్ని డైమెన్సిటీ 7400-టర్బో అని భావిస్తున్నారు. 2026 నవంబర్ 6న ఈ ఫలితాలు అప్‌లోడ్ అయ్యాయి. ఇటీవల ఇదే V2624 మోడల్ భారత BIS సర్టిఫికేషన్ కూడా పొందింది. సాధారణంగా BIS లిస్టింగ్ పూర్తయిందంటే, ఫోన్ సేల్స్‌కు సిద్ధమవుతోందని అర్థం. గీక్‌బెంచ్ 7లో ఈ ఫోన్ సింగిల్-కోర్‌లో 907 స్కోర్, మల్టీ-కోర్‌లో 3096 స్కోర్ సాధించింది. ఇవి మిడ్-రేంజ్ విభాగంలో చాలా మంచి స్కోర్లుగా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వాడకం, చదువుకు సంబంధించిన యాప్స్, ఫోటో ఎడిటింగ్, మోస్తరు సెటింగ్స్‌లో గేమింగ్ చేయడానికి ఈ స్కోర్లు లీడ్ ఇస్తున్నాయి. ఫోన్ లాంచ్ అయ్యేలోపు కంపెనీలు థర్మల్ డిజైన్, సాఫ్ట్‌వేర్‌ను మరింత మెరుగుపరుస్తాయి కాబట్టి లాంగ్ రన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. మొత్తానికి రోజువారీ వాడకానికి ఈ ఫోన్ చాలా లీడ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందని బెంచ్‌మార్క్ అంకెలు చెప్తున్నాయి. ఫోన్ పూర్తి ఫీచర్లను వివో ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, స్మూత్ స్క్రోలింగ్, బెస్ట్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 120Hz AMOLED డిస్‌ప్లేతో రానుందని అంచనా. కనీసం 8GB RAMతో విభిన్న స్టోరేజ్ వేరియంట్లు, ఆకర్షణీయమైన కలర్లలో రానుంది. త్వరలోనే ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో 'నోటిఫై మీ' (Notify Me) పేజీలు ప్రత్యక్షమయ్యే అవకాశముంది. ఇప్పటికే BIS సర్టిఫికేషన్ రావడం వల్ల మార్కెటింగ్ ప్లాన్స్ మొదలైనట్లే. అయితే చివరి నిమిషంలో పేర్లు, కాన్ఫిగరేషన్ మారే అవకాశం కూడా ఉంది. గీక్‌బెంచ్‌లో ఈ చిప్‌సెట్‌ను MT6878 అని పేర్కొన్నారు. ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం ఇది 'డైమెన్సిటీ 7400-టర్బో' కావచ్చు. కానీ కొన్ని డేటాబేస్‌లలో MT6878ని డైమెన్సిటీ 7300 సిరీస్‌గా కూడా చూపిస్తున్నారు. వివో అధికారికంగా ప్రకటించే వరకు ఈ "టర్బో" ట్యాగ్‌ను ఒక లీక్‌గానే చూడాలి. ఇక ఇందులో ఆండ్రాయిడ్ 17 లేటెస్ట్ వెర్షన్ ఉండటం వల్ల వినియోగదారులకు కొత్త ఫీచర్లు, ఎక్కువ కాలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు లభించే అవకాశం

Related Post

Previous
Next Post »