Posts

Showing posts with the label 9th-Grade Student at Ashram School Found Pregnant

ఆశ్రమ పాఠశాలలో గర్భం దాల్చిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని : ప్రధానోపాధ్యాయురాలితో సహా ముగ్గురు పాఠశాల సిబ్బంది సస్పెండ్

Image
ఆం ధ్రప్రదేశ్‌లోని పోలవరం పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక గర్భవతిగా తేలడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించినందుకుగాను ప్రధానోపాధ్యాయురాలితో సహా ముగ్గురు పాఠశాల సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే సదరు విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం కాకినాడలోని ఆసుపత్రికి తరలించారు. సెప్టెంబర్ 10న వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆ బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న వంట మనిషి కే. మంగరాజు తనపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత బాలిక వెల్లడించింది. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐసీడీఎస్ అధికారులు కూడా ఈ ఘటనపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. మరోవైపు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల హెడ్ మిస్ట్రెస్ డి. శాంతిమతి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి. విజయకాంతం, 9వ తరగతి 'ఎ...