దేశీయ మార్కెట్లో డెల్ గేమింగ్ ప్రియుల కోసం 'ఏలియన్‌వేర్ 15' గేమింగ్ ల్యాప్‌టాప్‌ను అధికారికంగా విడుదల చేసింది. గేమర్లకు అత్యుత్తమ, లీనమయ్యే గేమింగ్ అనుభవాన్ని అందించేలా ఈ ల్యాప్‌టాప్‌ను హై-ఎండ్ ఫీచర్లతో రూపొందించారు. ఇందులో శక్తివంతమైన ఏఎమ్‌డీ రైజెన్ ప్రాసెసర్లు, ఎన్విడియా జీఫోర్స్ గ్రాఫిక్స్ కార్డ్, 165Hz హై-రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో పాటు వేడిని నియంత్రించేందుకు వీలుగా ప్రత్యేక కూలింగ్ టెక్నాలజీని అందించారు. ఏలియన్‌వేర్ 15 ప్రారంభ ధరను రూ. 1,15,990 గా నిర్ణయించారు. ఆకర్షణీయమైన నోవా బ్లాక్ కలర్ ఆప్షన్‌లో లభించే ఈ ల్యాప్‌టాప్‌ను డెల్ అధికారిక వెబ్‌సైట్, డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంపెనీ ప్రత్యేక లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి గరిష్టంగా రూ. 10,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో 15.3-అంగుళాల WUXGA డిస్‌ప్లేను అందించారు, ఇది 1920×1200 పిక్సెల్స్ రెజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. గేమింగ్ ఆడేటప్పుడు విజువల్స్ ఎక్కడా లాగ్ అవ్వకుండా స్మూత్‌గా సాగడం కోసం దీనికి 165Hz రిఫ్రెష్ రేట్‌ను జోడించారు. అలాగే 300 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఫీచర్ ఉండటం వల్ల స్క్రీన్ కలర్స్ చాలా స్పష్టంగా, బ్రైట్‌గా కనిపిస్తాయి. ఏలియన్‌వేర్ 15 రెండు రకాల ఏఎమ్‌డీ ప్రాసెసర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో AMD Ryzen 5 220 లేదా AMD Ryzen 7 260 ప్రాసెసర్లను ఎంచుకోవచ్చు. హెవీ గ్రాఫిక్స్ గేమింగ్ కోసం దీనిలో NVIDIA GeForce RTX 3050 లేదా అధునాతన NVIDIA GeForce RTX 4050 లాప్‌టాప్ GPUలను అమర్చారు. అంతేకాకుండా, ఇంటెల్ ప్రియుల కోసం Intel Core 5 210H, Intel Core 7 240H ప్రాసెసర్ వేరియంట్లను సైతం ఈ నెలాఖరులోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది. భారీ గేమ్‌లు ఆడుతున్నప్పుడు ల్యాప్‌టాప్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉండేందుకు దీనిలో 'Alienware Cryo-Tech Cooling System'ను ప్రవేశపెట్టారు. ఇది ల్యాప్‌టాప్ లోపలి వేడిని త్వరగా బయటకు పంపేస్తుంది. దీనితో పాటు ఇందులో 'Stealth Mode' (స్టెల్త్ మోడ్) అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. దీని సహాయంతో యూజర్లు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ మోడ్ నుండి సైలెంట్ మోడ్‌కు మారవచ్చు, దీనివల్ల కూలింగ్ ఫ్యాన్ల నుంచి వచ్చే శబ్దం గణనీయంగా తగ్గి ప్రశాంతమైన వాతావరణంలో పనిచేసుకోవచ్చు. కస్టమర్లు ఎంచుకునే కాన్ఫిగరేషన్‌ను బట్టి ఈ ల్యాప్‌టాప్‌లో 54Wh లేదా 70Wh సామర్థ్యం గల బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. త్వరగా ఛార్జ్ అయ్యేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్ ఛార్జ్ (ExpressCharge), ఎక్స్‌ప్రెస్ ఛార్జ్ బూస్ట్ టెక్నాలజీలను అందించారు. కనెక్టివిటీ పరంగా వై-ఫై, బ్లూటూత్, హెచ్‌డీఎమ్‌ఐ (HDMI) పోర్ట్, ఒక USB Type-C పోర్ట్, రెండు USB Type-A పోర్టులు , 3.5mm హెడ్‌సెట్ జాక్ ఉన్నాయి. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ , వీడియో కాల్స్ కోసం 720p HD వెబ్‌క్యామ్, డ్యూయల్ మైక్రోఫోన్లు , మల్టీటచ్ టచ్‌ప్యాడ్ వంటి మరెన్నో లేటెస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సుమారు 2.25 కిలోల బరువుండే ఈ ల్యాప్‌టాప్ 349.5 × 250.3 × 20.7 మి.మీ కొలతలతో స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌ను కలిగి ఉంది.
0 Comments