'నాయిస్' స్మార్ట్ గ్లాసెస్ !
దేశీయ ఆడియో, వేరబుల్ తయారీ సంస్థ నాయిస్ కూడా ఐ-గ్లాసెస్ రంగంలోకి దిగింది. ఈ కంపెనీ భారతదేశంలో తన తొలి స్మార్ట్ గ్లాసెస్ ఐ1ను తాజాగా విడుదల చేసింది. నాయిస్ ల్యాబ్స్‌లో అభివృద్ధి చేసిన ఈ స్మార్ట్ గ్లాసెస్ ప్రత్యేకమైన ఆడియో ఎక్స్‌పీరియన్‌ను అందజేస్తుందని కంపెనీ చెబుతోంది. నాయిస్ ఐ1 స్మార్ట్ గ్లాసెస్ రూ.5,999కి సొంతం చేసుకోవచ్చు.gonoise.com వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ లిమిటెడ్ ఎడిషన్‌గా మాత్రమే. నాయిస్ i1 స్మార్ట్ గ్లాసెస్ మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపెన్సేషన్, కాలింగ్ కోసం మైక్రోఫోన్, మాగ్నెటిక్ ఛార్జింగ్, హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్ వంటి హైటెక్ ఫీచర్లతో లాంచ్ అయింది. ఇందులో ఆఫర్ చేసిన గైడెడ్ ఆడియో డిజైన్ అనేది చెవులలోకి మ్యూజిక్ సరిగ్గా వెళ్లేలా చేస్తుంది. ఈ గ్లాసెస్ చుట్టుపక్కల వస్తున్న అన్ని లౌడ్-సౌండ్స్‌ని బ్లాక్ చేసి, అద్భుతమైన ఆడియో ఎక్స్‌పీరియన్‌ను అందిస్తుంది. నాయిస్ i1 బ్లూటూత్ వెర్షన్ 5.1కి సపోర్ట్ చేస్తుంది కనుక ఓపెన్ చేయగానే మొబైల్ ఫోన్‌కి మిల్లి సెకన్లలో కనెక్ట్ అవుతుంది. యూజర్లు సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 9 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను పొందవచ్చు...