January 2025

ఐసీసీ ప్రకటించిన టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో 126 రేటింగ్ పాయింట్స్‌తో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా సౌతాఫ్రికా(112) రెండో స్థానంలో నిలిచింది. టీమిండియా 109 రేటింగ్‌ పాయింట్స్‌తో మూడో స్థానంలో కొనసాగుతోంది. 9 ఏళ్ల తర్వాత ఐసీసీ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. చివరిగా 2016లో ఈ స్థానంలో నిలిచింది. భారత్‌పై ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం ఆసీస్‌కు కలిసి రాగా.. పాకిస్థాన్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో భారత్‌ను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే సౌతాఫ్రికా, ఆసీస్ డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్(106), న్యూజిలాండ్(96), శ్రీలంక(87), పాకిస్థాన్(83), వెస్టిండీస్(75), బంగ్లాదేశ్(65), ఐర్లాండ్(26) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించడంతో పాటు టోల్ వసూలును రెగ్యులేట్ చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్యాగ్ అమలును తప్పనిసరి చేసింది. అయితే, ఇప్పటికీ కొందరు వెహికల్ ఓనర్స్ ఫాస్ట్ ట్యాగ్‌ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఈ విషయంపై ఆయా రాష్ట్రాలు ఫోకస్ చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాహనాలకు తప్పనిసరిగా ఫాస్ట్ ట్యాగ్ ఉండాలని ప్రకటించింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి మహారాష్ట్రలోని అన్ని వాహనాలు తప్పనిసరిగా ఫాస్ట్ ట్యాగ్ మెయింటెన్ చేయాలి. రాష్ట్రంలో టోల్ వసూలును స్ట్రీమ్‌లైన్ చేసి ట్రాఫిక్ సమస్యను తగ్గించాలన్న లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమలు తేదీని కూడా ప్రకటించడంతో ఎలాంటి ప్రభావం ఉండనుందోనన్న ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా, ఫోర్ వీలర్ వెహికల్ ఓనర్లు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారనేది వేచిచూడాలి. రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పనితీరును మరింత ప్రభావవంతంగా మార్చాలన్న సంకల్పంతో 2014లో రూపొందించిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పాలసీకి సవరణలు చేయాలని మహారాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పరిపాలన పారదర్శకంగా, సిటిజన్ సెంట్రిక్‌గా ఉండేలా అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ అప్డేట్స్‌లో రీఫార్మ్స్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

వృద్ధాప్యంలో కళ్ల కింద వలయాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ కళ్ళ కింద వలయాలు వయసును మరింత పెంచేస్తాయి. ఇంట్లో పాటించే చిన్న చిన్న టిప్స్ తో వీటిని మాయం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి రసంలో ఉప్పు కలిపి కళ్ళ కింద ఉన్న క్యారీ బ్యాగులకు పూసినట్లయితే వాపు తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని పూసి మరుసటి రోజు పొద్దున్నే చల్లటి నీటితో కడుక్కునట్లయితే ఉల్లిపాయల రసంలో ఉండే కెమికల్స్ కళ్ల చుట్టూ కొవ్వు పేరుకు పోవడాన్ని ఆపుతాయి. అయితే వీటిని పూసుకునే సందర్భంలో కళ్ళకు తగలనీయకండి. అంతే కాదు వెల్లుల్లిని దంచి పేస్ట్ గా చేసి ఐ బ్యాగ్స్ పైన అప్లై చేసి, ఓ అరగంట పాటు ఉంచి చల్లటి నీళ్లతో కడుక్కుంటే మంచిది. ఇది కళ్ల క్రింద పైన పేరుకుపోయిన కొవ్వుల స్థాయిని తగ్గిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో ముంచి కంటి కింద అప్లై చేస్తే ఇది కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆహారంలో ఉప్పు తగ్గించడం ద్వారా, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం ద్వారా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ విటమిన్ లను అధికంగా తీసుకోవడం ద్వారా కూడా కళ్ళ కింద క్యారీ బ్యాగులను తగ్గించవచ్చు. అధికంగా నీరు తాగడం ద్వారా కూడా కళ్ళ వాపులను, కళ్ళకింద నల్ల వలయాలను, క్యారీ బ్యాగులను తగ్గించుకోవచ్చు. కళ్లకు కోల్డ్ కంప్రెస్ ట్రీట్మెంట్ ద్వారా కూడా కళ్ళలో వచ్చే ఈ ఫ్లూయిడ్ అసమతుల్యతలను తగ్గించుకోవచ్చు. 

దుబాయ్ వేదికగా జరగనున్న దుబాయ్ 24 అవర్స్ రేసింగ్ లో పాల్గొనడం కోసం కోలీవుడ్ హీరో అజిత్ వెళ్లారు. దుబాయ్ వెళ్లే ముందు ఎయిర్ పోర్టులో బార్య శాలిని, కుమారుడు అద్విక్... ఇద్దరికీ అజిత్ సెండ్ ఆఫ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దుబాయ్ వెళ్లిన ఆయన రేసింగ్ కోసం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. అందులో అజిత్ కారు ఘోర ప్రమాదానికి గురైంది. అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైన విషయాన్ని ఆయన రేసింగ్ టీం సోషల్ మీడియాలో తెలియజేసింది. ''ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అజిత్ కుమార్ కారు మాసివ్ క్రాష్ అయింది. అయితే ఆయనకు ఒక్క గీత కూడా పడలేదు. ఎటువంటి గాయాలు లేకుండా బయటకు నడుచుకుంటూ వచ్చారు. రేసింగ్ అంటే అంతే'' అని అజిత్ కుమార్ రేసింగ్ సోషల్ మీడియా అకౌంట్ పేర్కొంది. ''రేసింగ్ ప్రాక్టీస్ సెషన్ వీడియో బయటకు వచ్చింది. అజిత్ గారు సురక్షితంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'' అని అజిత్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

కర్ణాటక రాష్ట్రంలోని రంగపుర గ్రామంలో ఐదు రోజులుగా చిరుత గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. చిరుతని చూసిన గ్రామస్థులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి వచ్చిన అధికారులు చిరుతపులిని పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బోనులో చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ చిరుత తప్పించుకోవాలని చూసింది. ఈ తరుణంలో అదే గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడు చిరుత పులి తోకను పట్టుకుని, అది పారిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు. దీంతో అధికారులు వల సాయంతో చిరుతను బంధించారు. ఈ క్రమంలో చిరుతను బోనులో వేసి అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో తన సాహసోపేతమైన చర్యతో చిరుతను పట్టుకోవడానికి సహకరించిన ఆ యువకుడిని గ్రామస్థులు, అధికారులు అభినందించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఫార్ములా ఈ కేసుకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఎత్తివేయడంతో ఏ క్షణమైనా కేటీఆర్‌ అరెస్ట్ పక్కా అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటామని అన్నారు. అబద్దాలు తనను దెబ్బతీయలేవన్నారు. కుట్రలతో తన నోరు మూయించలేరని.. ఇవాల్టి అడ్డంకులే రేపటి విజయానికి సోపానాలు అని ట్వీట్ చేశారు కేటీఆర్. న్యాయం కోసం పోరాటం సాగిస్తామని.. త్వరలోనే ప్రపంచానికి వాస్తవాలు తెలుస్తాయని మాజీ మంత్రి అన్నారు. ''నా పునరాగమనం ఎదురుదెబ్బ కంటే బలంగా ఉంటోంది. అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయవు. నీ మాటలు నన్ను తగ్గించవు. మీ చర్యలు నా దృష్టిని మరుగుపరచవు. కోపోద్రిక్తత నన్ను నిశ్శబ్దం చేయదు! నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయి.. సత్యం కాలంతో పాటు ప్రకాశిస్తుంది! నాకు మన న్యాయవ్యవస్థపై గౌరవం ఉంది. న్యాయం గెలుస్తుందని నా అచంచలమైన నమ్మకం. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది, త్వరలో ప్రపంచం కూడా దానికి సాక్ష్యమివ్వనుంది'' అంటూ ఎక్స్‌లో కేటీఆర్ పోస్టు చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. 

హైదరాబాద్‌లో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల దాడిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దుర్మార్గ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన కాంగ్రెస్‌ పార్టీ తీరు మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. పోలీసులను వెంట తీసుకొచ్చి భాజపా కార్యాలయంపై రాళ్లు విసిరారని, పోలీసులు ఇలా వ్యవహరించడం ఎంత వరకు సమంజమని హైదరాబాద్‌ సీపీని ప్రశ్నించారు. భాజపా తలచుకుంటే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రోడ్లమీద తిరగలేరని హెచ్చరించారు. రోజు రోజుకూ కనుమరుగవుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. నిరాశతో భౌతిక దాడులకు దిగడాన్ని ప్రజలు క్షమించరన్నారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు, భౌతిక దాడులకు తావు లేదన్నారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ఎక్కడ ఉందని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించారు. దాడిపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అమెజాన్‌ జనవరి 13 నుంచి గ్రేట్‌ రిపబ్లిక్‌ సేల్‌ ప్రారంభం కానుంది. యూజర్లకు ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి, ప్రైమ్‌ మెంబర్లకు 12 గంటల ముందుగానే.. అంటే అర్ధరాత్రి నుంచే ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 19 వరకు ఈ సేల్‌ కొనసాగే అవకాశం ఉంది. అమెజాన్‌ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులతో కొనుగోళ్లు, ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. సేల్‌కు సంబంధించి అమెజాన్‌ ఇప్పటికే మైక్రోసైట్‌ను సిద్ధం చేసింది. ఇందులో కొన్ని ఆఫర్లను ప్రదర్శించింది. మరికొన్నింటిని టీజ్‌ చేస్తోంది. స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి యాపిల్‌, ఐకూ, వన్‌ప్లస్‌, శాంసంగ్‌, రియల్‌మీ, రెడ్‌మీ మొబైల్స్‌పై డీల్స్‌ ఉండబోతున్నాయి. ముఖ్యంగా వన్‌ప్లస్‌ నార్డ్‌4, సీఈ 4, నార్డ్‌ సీఈ4 లైట్‌ ఫోన్లపై ఆఫర్లు ఉండబోతున్నట్లు అమెజాన్‌ చెబుతోంది. ఎంతమేర డిస్కౌంట్ ఇచ్చేది వెల్లడించలేదు. అలాగే, నేడు లాంచ్‌ అవుతున్న వన్‌ప్లస్‌ 13, 13ఆర్‌ ఫోన్లు కూడా ఈ సేల్‌లోనే విక్రయానికి రానున్నాయి. అమెజాన్‌ అలెక్సా, ఫైర్‌టీవీ డివైజులపైనా ఈ సేల్‌లో డిస్కౌంట్లు లభించబోతున్నాయి. ఫైర్‌టీవీ స్టిక్‌ లైట్‌ను రూ.2599, ఎకో పాప్‌ రూ.3,949, ఎకో ఫోర్త్‌ జనరేషన్‌ రూ.7,549కి విక్రయించనున్నారు. ఇక స్మార్ట్‌ టీవీలు, ప్రొజెక్టర్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మొబైల్‌ యాక్సెసరీస్‌, హోమ్‌ అప్లయెన్సెస్‌పైనా ఆఫర్లు ఉంటాయని అమెజాన్‌ చెబుతోంది. సేల్‌కు కొద్ది రోజుల ముందు ఆఫర్ల వివరాలు వెల్లడికానున్నాయి.

ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశ్రయించారు. బీఆర్ఎస్ న్యాయవాదుల బృందం కేసును సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. బుధవారం లేదా గురువారం కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు.

ఐటెల్ A80 స్మార్ట్‌ఫోన్‌తో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో విప్లవాత్మకంగా మారేందుకు సిద్ధమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేటుతో, IP54 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్, అద్భుతమైన విజువల్స్, స్పష్టమైన డిస్‌ప్లే నాణ్యత, మన్నికను అందిస్తుంది. A80 సిరీస్, ఈ బ్రాండ్‌కు పెద్ద సంచలనం తీసుకురావడమే కాక, వినియోగదారులకు ఉత్తమ అనుభవాన్ని అందిస్తుంది. ఐటెల్ A80 6.67 అంగుళాల పెద్ద పంచ్-హోల్ డిస్‌ప్లేతో వచ్చింది. ఇది డైనమిక్ బార్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. 8GB RAM (4GB + 4GB*), 128GB ROM తో ఇది మల్టీటాస్కింగ్‌కి పూర్తి మద్దతు ఇస్తుంది. దీంతో వినియోగదారులు లాగ్-ఫ్రీ అనుభవాన్ని పొందుతారు. ఈ అద్భుతమైన ఫీచర్లతో కూడిన A80 స్మార్ట్‌ఫోన్ రూ. 6999 ధరతో అందుబాటులో ఉంటుంది. A80 50MP సూపర్ HDR కెమెరాతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్, తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన ఫోటోలు తీసే సామర్థ్యం కలిగి ఉంది. వినూత్న రింగ్ లైట్ నోటిఫికేషన్, 6.67 అంగుళాల పంచ్-హోల్ డిస్‌ప్లే వినియోగదారుడి అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. IP54 రేటింగ్తో A80 దుమ్ము, నీటిని నిరోధించడంలో ఉపయోపడుతుంది. ఇది Android 14 Go OS, Unisoc T603 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. జస్ట్ మీ రోజువారీ పనుల కోసం సున్నితమైన పనితీరు అందిస్తుంది. ఐటెల్ A80 కొనుగోలు చేసిన 100 రోజులలోపు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ అందించబడుతుంది. ఇది సాండ్‌స్టోన్ బ్లాక్, గ్లేసియర్ వైట్, వేవ్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది, ఇవి చక్కదనం మరియు ప్రాక్టికాలిటీని కలిపి ఆకట్టుకునేలా తయారయ్యాయి.

జనవరి 17న హ్యుందాయ్ క్రెటాని భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో లాంచ్ చేయనుంది. క్రెటా EV మార్కెట్‌లో ఉన్న మారుతి సుజుకి eవిటారా, మహీంద్రా BE 6, టాటా కర్వ్, ఎంజీ జెడ్ EV, టయోటా అర్బన్ క్రూయిజర్ EVలకు పోటీ ఇవ్వనుంది. తాజాగా హ్యుందాయ్ క్రెటా EV టెక్ ఫీచర్లను, సేఫ్టీ ఫీచర్లను వెల్లడించింది. డ్రైవర్లు నేరుగా కార్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ద్వారా ఈవీ ఛార్జింగ్ కోసం చెల్లింపులు చేయవ్చు. ఇది ఛార్జింగ్ స్టేషన్ల యాక్సెస్‌ని సులభతరం చేసింది. డిజిటల్ కీ ఫీచర్ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌లను ఉపయోగించి కారుని అన్ లాక్ చేయవచ్చు. స్టార్ చేయడం, కంట్రోల్ చేయడం ఈ ఫీచర్ ద్వారా చేయవచ్చు. సింగిల్ పెడల్ డ్రైవింగ్ సిస్టమ్ కేవలం ఒక పెడల్ ఉపయోగించి యాక్సిలరేషన్ పెంచడం, తగ్గించడం చేయడంతో పాటు పూర్తిగా స్టాప్ చేసేందుకు సహకరిస్తుంది.క్రెటా ఈవీ కారు లోపల, వెలుపల గాడ్జెట్స్, ఇతర పరికరాలకు ఛార్జింగ్ చేసేందుకు వెహికిల్-టూ-లోడ్(V2L) సహకరిస్తుంది. క్రెటా EV గేర్ నియంత్రణను సులభతరం చేయడానికి, ఎలాంటి అవాంతరాలు లేని డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు షిఫ్ట్ బై వైర్(SBW) సిస్టమ్‌ని అందిస్తోంది.  వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. హెచ్‌డీ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ క్లస్టర్‌తో 10.25 అంగుళాల డ్యూయర్ కర్విలినియర్ స్క్రీన్ కలిగి ఉంటుంది. క్రెటా ఈవీ మొత్తం 75కు పైగా అధునాతన భద్రతా ఫీచర్లతో రానుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లు, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ , ISOFIX చైల్డ్ సీట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్. లేన్-కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో సహా 19 టెక్-ఎనేబుల్డ్ సేఫ్టీ ఫంక్షన్‌లతో క్రెటా EV లెవెల్ 2 ADASని కలిగి ఉంటుంది. బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి ఫీచర్‌లు కలిగి ఉంది. క్రెటా ఈవీ బిల్ట్ క్వాలిటీ విషయాని వస్తే, హాట్ స్టాంపింగ్‌తో బలోపేతం చేయబడిన అధునాతన హై-స్ట్రెంగ్త్ స్టీల్‌ని వాడారు. క్రెటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ప్యాక్స్‌ని కలిగి ఉంది. 51.4kWh ప్యాక్, 42kWh ప్యాక్‌లతో 475 కి.మీ, 390 కి.మీ రేంజ్ ఇస్తుంది. లాంగ్ రేంజ్ బ్యాటరీ 125 kW శక్తిని, 171 పీఎస్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 42 kWh బ్యాటరీ వేరియంట్ 99 kW (135 PS) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 58 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. కారులోని అవసరమైన భాగాలను చల్లబరిచేందుకు మెరుగైన ఏరోడైనమిక్స్‌, శక్తి సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఎయిర్ ఫ్లాప్స్‌తో వస్తోంది. చల్లని వాతావరణ పరిస్థితుల్లో ఛార్జింగ్ తీరును మెరుగుపరచడానికి బ్యాటరీ హీటర్ కూడా ఉంటుంది.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఈ నెల 13న మకర సంక్రాంతిని పురస్కరించుకుని మహా కుంభ మేళాను ప్రారంభిస్తున్నారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ మహా కుంభ మేళాను యోగి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంచి నీళ్ల ప్రాయంగా నిధులు ఖర్చు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా హిందువులను ఆకర్షించి, ఆహ్వానించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్ణయించింది. కానీ, ఇంతలోనే చైనా నుంచి హ్యూమన్ మెటా న్యుమో వైరస్‌ (హెచ్ ఎంపీవీ) దేశంలోకి కూడా ప్రవేశించిం ది. ప్రస్తుతానికి ఈ వైరస్‌తో ప్రాణాపాయం లేకున్నా, తమ్ములు, దగ్గు, ఒళ్లు నొప్పులు, వికారం, గొంతునొప్పి, జ్వరం లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న వారు పెరుగుతున్నారు. పైగా హెచ్ ఎంపీవీ అనేది అంటు వ్యాధి. సెకనుల వేగంతో ఇది వ్యాపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ కంటికి కనిపించని శత్రువు మహా కుంభ మేళాపై ఏమేరకు ప్రభావం చూపుతుందనేది పెద్ద చిక్కుగా మారింది. అయితే మహా కుంభమేళాను వాయిదా వేసే పరిస్థితి లేదు. కానీ, హెచ్ ఎంపీవీ వైరస్ కనుక తగ్గుముఖం పట్టకపోతే.. భక్తులను కూడా అనుమతించే పరిస్థితి ఉండదు. సో.. ఇదే జరిగితే.. ఇప్పటి వరకు చేసిన 7500 కోట్ల రూపాయల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా మారనుంది. ఈ విషయంపైనే.. ఇప్పు డు కేంద్ర, యూపీ ప్రభుత్వాలు తర్జన భర్జన పడుతున్నాయి.

దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ నెమ్మదిగా విస్తరిస్తోంది. నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా 6 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇవాళ మహారాష్ట్రలోని నాగపూర్ లో ఇద్దరు చిన్నారులు వైరస్ బారిన పడ్డారు. పాజిటివ్ వచ్చిన 7, 13 ఏళ్ల చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతాలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఫార్ములా ఈ కార్ రేసు కేసు సంబంధించి కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ కేసులో ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు గానే ఆశ్రయించింది. ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. అరెస్ట్ చేయొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులును కూడా హైకోర్టు ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని కేటీఆర్ తరపు న్యాయవాదికి హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించింది. అందరికి 'రూల్ ఆఫ్ లా' వర్తిస్తుందని కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు గుర్తుచేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసింది. ఏసీబీకి కూడా మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది. ఏసీబీ రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఫార్ములా ఈ రేస్‌ కోసం జరిగిన బ్యాంక్ లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది. హెచ్ఎండీఏ నుంచి ట్రాన్స్‌ఫర్ అయిన నిధులు.. ఏ అకౌంట్స్లోకి చేరాయనేది కూడా గుర్తించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు తేల్చింది. ఈసీ నుంచి అనుమతులు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించారని తేలింది. 2023 అక్టోబర్‌ 3, 11వ తేదీల్లో హెచ్‌ఎండీఏ బోర్డు అకౌంట్‌ నుంచి రూ.45.71 కోట్లు లండన్‌లోని ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌కు తరలించారు. ఇందుకు గాను ఆర్బీఐ రూల్స్ పాటించనందున హెచ్‌ఎండీఏ రూ.8 కోట్లను ఐటీ శాఖకు పెనాల్టీగా చెల్లించాల్సి వచ్చింది. ఫెడరేషన్ ఆఫ్‌ స్పోర్ట్స్‌ క్లబ్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఐఏ)కు రూ.1.10 కోట్లు చెల్లించారు. ఇలా మొత్తం రూ.54.89 కోట్లు మున్సిపల్ నిధులను అప్పటి మంత్రి కేటీఆర్‌ దుర్వియోగం చేశారని ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.. మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ డిల్లీ అసెంబ్లీ ఎన్నికల వివరాలను వెల్లడించారు. ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే దశలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఢిల్లీలో ఎన్నికల కోడ్‌ వెంటనే అమల్లోకి వచ్చినట్టు ఈసీ ప్రకటించింది. ఈనెల 10వ తేదీన ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. ఫిభ్రవరి 17వ తేదీ వరకు నామినేషన్ల గడువు విధించారు. ఈనెల 20వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఢిల్లీలో ప్రస్తుతం 1 కోటి 55 లక్షల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 83 లక్షలకు పైగా పురుష ఓటర్లు ఉండగా, 71.74 లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఈసారి ఢిల్లీలో భారీ ఎత్తున ఓటింగ్ జరిగే అవకాశం ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఇదే తొలి ఎన్నికలని.. యువత ప్రజాస్వామ్యంలో తమ వంతు పాత్ర పోషించాలంటూ కోరారు. ఫిబ్రవరి 15తో ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియనుంది.

ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటంటే, ప్రీమియం చెల్లింపు కాలం పరిమితంగా ఉండగా, ప్రయోజనాలు జీవితాంతం అందేలా రూపొందించబడింది. ఈ పాలసీ ద్వారా జీవితాంతం గ్యారెంటీ రిటర్న్స్ పొందవచ్చు. ముందుగా నిర్ణయించిన కాలానికి ప్రీమియం చెల్లించి, జీవితాంతం ప్రతి సంవత్సరం పెట్టుబడిలో 10% పెన్షన్ రూపంలో పొందవచ్చు. దీనికి వయసు పరిమితి కనీస వయసు 90 రోజులు కాగా, గరిష్ఠంగా 65 ఏళ్లు ఉంది. కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలు. అంటే, మీరు చెల్లించే ప్రీమియం మొత్తానికి ఆరు ప్రకారం పాలసీ గడువు ముగిసే నాటికి రూ. 5 లక్షలు సమ్ అష్యూర్డ్ ఉండాలి. ప్రీమియం చెల్లింపుల కాలం 5 నుంచి 16 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రీమియం చెల్లింపు కాలం పూర్తైన తర్వాత, డిఫర్డ్ పీరియడ్ (వేచి ఉండే సమయం) ముగిసిన వెంటనే, ప్రతి సంవత్సరం సమ్ అష్యూర్డ్‌లో 10% చొప్పున జీవితాంతం పొందవచ్చు. పాలసీదారుడు 100 సంవత్సరాలు జీవించి ఉంటే, ఆ కాలం వరకూ ఈ రిటర్న్స్ కొనసాగుతాయి. ఒక సంవత్సరం  రూ. 50,000 పొందాలనుకుంటే, కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్  రూ. 5 లక్షలు ఉండాలి. ఈ పాలసీకి 5 ఏళ్ల ప్రీమియం చెల్లింపును ఎంచుకున్నట్లయితే, ప్రతి సంవత్సరం దాదాపు  రూ. 1.16 లక్షలు (జీఎస్టీతో కలిపి) ప్రీమియం చెల్లించాలి. ప్రీమియం చెల్లింపు 5 సంవత్సరాల తరువాత 5 సంవత్సరాల డిఫర్డ్ పీరియడ్ ఉంటుంది. 11వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం  రూ. 50,000 చొప్పున రాబడి పొందవచ్చు. పాలసీదారుడు అకాల మరణం చెందితే రూ. 5 లక్షలు ఇన్సూరెన్స్ రూపంలో కుటుంబానికి అందుతుంది. ఇది సహజ మరణాలకు మాత్రమే వర్తిస్తుంది. యాక్సిడెంట్ బెనిఫిట్, డిసేబిలిటీ బెనిఫిట్స్ కోసం యాడ్ ఆన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాలసీ తీసుకునే సమయంలో, ప్రీమియం టర్మ్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం ముఖ్యం, ఎందుకంటే డిఫర్డ్ టైమ్ ఆయా టర్మ్‌ల ప్రకారం మారుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈనెల  20కి ధర్మాసనం వాయిదా వేసింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్‌ బియ్యం అమ్ముకున్న ఘటనలో ఏ6గా పేర్నినాని ఉండగా, ఏ1గా పేర్నినాని సతీమణి జయసుధ ఉన్నారు. గోడౌన్ మొత్తం కూడా జయసుధ పేరుమీద ఉండటంతో మొదటి నుంచి ఈ కేసులో జయసుధ ఉన్నారు. అయితే ఏ6గా పేర్నినాని చేర్చారు పోలీసులు. ఈ విషయం తెలిసిన వెంటనే పేర్నినాని హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. నిన్న ఈ కేసుపై విచారణ జరుగగా.. నేటికి వాయిదా వేసింది హైకోర్టు. ఈరోజు మరోసారి పేర్నినాని పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. జనవరి 20 వరకు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో కీలకంగా ఉన్న ఏ2 మానస్ తేజ్ , ఏ4, ఏ5 లారీ డ్రైవర్, రైసు మిల్లు యజమానిని ఒక రోజు పోలీస్ కస్టడీ ఇస్తూ మచిలీపట్నం జిల్లా కోర్టు ఆదేశించింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు వీరు ముగ్గురిని విచారించాలని కోర్టు ఆదేశించింది. దీంతో A2 మానస్‌ తేజ్, A4 మంగారావు, A5 ఆంజనేయులును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈరోజు ఉదయం సబ్ జైలు నుంచి నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో బియ్యం మాయం నిందితులను సీఐ ఏసుబాబు బృందం విచారిస్తోంది. వారి నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. బియ్యం మాయం ఘటన వెనక ఎవరెవరు ఉన్నారు అని నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పేర్నినాని ఆదేశాలతోనే చేశామని ఇప్పటి వరకు జరిగిన విచారణలో నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎంతమంది ఉన్నారు.. బియ్యం మొత్తాన్ని ఎక్కడకు తరలించారు అనే అంశాలపై పోలీసులు మరింత ఆరా తీస్తున్నారు. వారిచ్చే సమాచారం మేరకు పేర్నినానిపై అదనపు సెక్షన్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మపై సురేష్ అనుచరులు దాడి చేశారు. తనకు వస్తున్న పెన్షన్‌ను నిలిపివేశారని, ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిను మరియమ్మ ధూషించింది. మరియమ్మ ఇంటిపై దాడి చేసి ఆమెను నందిగం సురేష్ అనుచరులు హతమార్చారు. ఈ విషయంపై అప్పట్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. 2020 నుంచి పోలీసులు విచారణ జరపకపోవడంతో దర్యాప్తు ముందుకు కదల్లేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి నారా లోకేష్‌ను మరియమ్మ కుమారుడు కలిసి తనకు న్యాయం చేయాలని కోరాడు. మరియమ్మ మృతి గురించిన వివరాలను, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును మరియమ్మ కుమారుడు తెలిపాడు. ఈ హత్య కేసులో సురేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆయన ఆశ్రయించాడు. కేసు తీవ్రత నేపథ్యంలో సురేష్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో నందిగం సురేష్ సవాల్‌ చేశాడు. నందిగం సురేష్ బెయిల్ పిటీషన్‌పై ఈరోజు జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సురేష్ తన పాత కేసుల వివరాలను ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నిచింది. ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయకపోవడంతో తాము కూడా జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో చార్జిషీటు కూడా దాఖలైనందున బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నందిగం సురేష్ బెయిల్ పిటీషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.

ఆస్కార్ 2025 వేడుక మార్చి 2న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ ఏడాది ఆస్కార్‌కు అర్హత సాధించిన 323 చలన చిత్రాల జాబితాను వెల్లడించింది. వీటిలో 207 చిత్రాలు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచాయి. పోటీలో నిలిచిన వాటిలో ఆరు భారతీయ చిత్రాలు కూడా ఉన్నాయి. 97వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్లకు అర్హత సాధించిన సినిమాల జాబితాను అకాడమీ సంస్థ జనవరి 7న విడుదల చేసింది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ఆడు జీవితం (మళయాలం), కంగువా, సంతోష్ (హిందీ), స్వతంత్ర్య వీర సావర్కర్ (హిందీ), ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్‌ (హిందీ) సినిమాలు నిలిచాయి. కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన లాపతా లేడీస్ కూడా ఆస్కార్ 2025 రేసులో నిలిచింది. కానీ అది షార్ట్ లిస్ట్ మాత్రం అవ్వలేకపోయింది. సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు ఆస్కార్ అవార్డ్ గెలవడం మాత్రమే కాదు ఆస్కార్ బరిలో నిలవడం కూడా గొప్ప విషయమే.  నామినేషన్ల కోసం ఓటింగ్ జనవరి 8న ప్రారంభమవుతుంది. జనవరి 12న ముగుస్తుంది. అకాడమీ తుది నామినేషన్‌లను జనవరి 17న ప్రకటించనుంది. దీంతో ఈ ఐదు సినిమాల్లో ఏదైనా ఒకదానికైనా నామినేషన్ దక్కుతుందా అని భారతీయ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లైమ్ స్టోన్ లీజుల విషయంలో పున సమీక్షిస్తోంది. అందులో భాగంగా మై హోమ్ గ్రూపునకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని భావిస్తోంది. వైసిపి ప్రభుత్వం అనంతపురం తో పాటు చాలాచోట్ల లైమ్ స్టోన్ లీజులను 50 ఏళ్ల వరకు మై హోమ్ గ్రూపునకు కేటాయించింది. వీటిని రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.  మై హోమ్ గ్రూపునకు చెందినదే టీవీ 9. గత ఐదేళ్లుగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించింది ఈ మీడియా. మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు, ఆయన కుమారుడు టీవీ9 మీడియాను వైసీపీకి అప్పగించినట్లు విమర్శ ఉంది. దాని ప్రతిఫలంగా రాష్ట్రవ్యాప్తంగా అడ్డగోలు లీజులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా టీవీ9 తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుంది. చంద్రబాబుతో పాటు లోకేష్ కు వ్యతిరేకంగా కథనాలు వెలువరించింది. గ్రూప్ చైర్మన్ రామేశ్వరం తో పాటు ఆయన కుమారుడు చంద్రబాబును కలిసి లీజులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన రాలేనట్లు సమాచారం. గతం మాదిరిగా చంద్రబాబు ఉదాసీనంగా వ్యవహరించే అవకాశం లేదు. ఈ విషయంలో పార్టీ యువ నాయకత్వం ఆలోచన మరోలా ఉంది. ఇటువంటి వారి విషయంలో ఎంతవరకైనా ముందుకెళ్లాలని యువ నాయకత్వం భావిస్తోంది. అందుకే గనుల లీజు విషయంలో మై హోమ్ గ్రూపునకు డోర్ క్లోజ్ అయినట్లు సమాచారం.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఆయన్ను ఎన్నికలకు ముందే తప్పుకోవాలన్న ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ట్రూడో నిన్న తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు లిబరల్ పార్టీ సిద్దమవుతోంది. ఈ రేసులో భారతీయ మూలాలున్న లాయర్, ప్రస్తుత కేబినెట్ మంత్రి అనితా ఆనంద్ ముందున్నారు. తొమ్మిదేళ్ల పదవీకాలం తర్వాత రాజీనామాకు సిద్దమైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో  తాను పదవీవిరమణ చేస్తానని, అయితే లిబరల్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని తాజాగా ప్రకటించారు. దీంతో కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ప్రధానమంత్రి, పార్టీ నాయకుడిగా కొనసాగుతారు. మార్చి 24 వరకు సస్పెండ్ చేసిన పార్లమెంట్ ఏదైనా విశ్వాస ఓట్లు లేదా ఎన్నికల పిలుపులు జరగడానికి ముందు తప్పనిసరిగా పునఃప్రారం భించాల్సి ఉంది. అలాగే తదుపరి ఎన్నికలు మే కంటే ముందుగా జరగవు. అక్టోబర్‌లో షెడ్యూల్ తేదీగా ఉంటుంది. దీంతో ట్రూడో నాయకత్వంలో ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండటానికి నాయకత్వ పోటీని వేగవంతం చేయడం లిబరల్ పార్టీ నేతల లక్ష్యంగా ఉంది. అలాగే ప్రధానిగా భారతీయ మూలాలున్న అనితా ఆనంద్ తో పాటు మెలానీ జోలీ, మార్క్ కార్నీ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో భారతీయ మూలాలున్న అనితా ఆనంద్ పేరు తెరపైకి వస్తోంది. ఓక్‌విల్లే పార్లమెంటు సభ్యురాలు అయిన అనితా ఆనంద్ లిబరల్ పార్టీలో కీలక నేత. ప్రస్తుతం ఆమె రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రిగా కూడా ఉన్నారు. గతంలో రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గుంటూరు, విజయవాడకు అనుసంధానం చేస్తూ కొత్తగా నిర్మించే రైల్వే లైను పనులకు కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్ల కిందటే పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు ఈ లైను నిర్మిస్తారు. నంబూరు నుంచి గుంటూరువైపు వెళ్లే రైళ్లు, విజయవాడవైపు వెళ్లే రైళ్లు చీలిపోతాయి. నంబూరు రైల్వే జంక్షన్ గుంటూరుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న స్టేషన్. గుంటూరు వెళ్లే అవసరం లేకుండా న్యూ గుంటూరు, తెనాలి, గూడూరు మీదుగా చెన్నై, తిరుపతి కూడా వెళ్లవచ్చు. వైకుంఠపురం దగ్గర కృష్ణానది నుంచి నంబూరు వరకు నిర్మించే రైల్వే మార్గానికి సంబంధించి సర్వేను ప్రారంభించారు. దారిలో అడ్డంగా ఉండే విద్యుత్తు లైన్లు తొలగించేందుకు, రైల్వే విద్యుత్తు లైన్లకు సంబంధించి సర్వే జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు భూమిని సేకరించాల్సి ఉంది. దీనికి నోటిఫికేషన్ జారీచేశారు. స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అమరావతిని నిర్మించేందుకు 29 గ్రామాల పరిధిలో భూ సమీకరణ విధానంలో ఎలా అయితే భూములను తీసుకున్నారో తమ భూములను కూడా అలాగే తీసుకోవాలని అక్కడి రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో భూసేకరణ జరుగుతోంది. దీనికి ముందు ఇబ్రహీంపట్నంతోపాటు పరిసర గ్రామాల్లో భూసేకరణ జరిగింది. రైల్వేలో తమ కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగాలివ్వాలని రైతులు  కోరుతున్నారు. అలాగే కొన్ని గ్రామాలకు రోడ్లు మరమ్మతులు నిర్వహించడంతోపాటు కొత్త రహదారులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని అధికారులు రైతులకు హామీ ఇస్తున్నారు. ఈ కొత్త రైలు మార్గం కోసం ఖమ్మం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 450 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఎర్రుపాలెం వద్ద మొదలయ్యే ఈ రైల్వే మార్గంలో 'పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టిముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరుకు కొత్తగా స్టేషన్లు వస్తాయి. అమరావతి, పెద్దాపురం, కొప్పురావూరు స్టేషన్లు పెద్దవిగా నిర్మిస్తారు. కృష్ణా జిల్లా పరిటాల వద్ద గూడ్స్ రైళ్లు నిలిపే సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో కొత్తపేట-వడ్డమాను మధ్య కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర వంతెన నిర్మిస్తారు.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యూనల్ (ఐసీటీ) సోమవారం మరో వారెంట్ జారీ చేసింది. ఆమెతోపాటు మరో 12 మంది పేర్లనుకూడా దీనిలో చేర్చింది. దేశంలో పలువురి అదృశ్యాలు, హత్యలకు సంబంధించిన ఈ వారెంట్ జారీ అయింది. వారిని కోర్టు ఎదుట ప్రవేశపెట్టడానికి ఫిబ్రవరి 12వ తేదీ వరకు గడువు విధించింది. హసీనా రక్షణ సలహాదారు మేజర్ జనరల్ (రిటైర్డ్) తారిక్ అహ్మద్ సిద్ధిఖీ, మాజీ ఐజీ బెనజీర్ అహ్మద్, మాజీ నేషనల్ టెలికమ్యూనికేషన్ మానిటరింగ్ సెంటర్ డీజీ జియావుల్ అహ్సాన్ వీరిలో ఉన్నారు. హసీనా భారత్కు వెళ్లిపోయిన నాటి నుంచి ఆమెపై జారీ అయినా రెండో వారెంట్ ఇది. తాజాగా వారెంట్ జారీ చేసిన ఐసీటీ అనంతరం ఇంటర్పోల్ సాయం కూడా కోరింది. హసీనాపై తొలి వారెంట్ గతేడాది అక్టోబర్లో జారీ అయింది. దీనిలో ఆమెతోపాటు 45 మందిని నిందితులుగా చేర్చారు. నాడు నవంబర్ 18 నాటికి తమ ఎదుట హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ, అవి అమలు కాలేదు. విద్యార్థి ఉద్యమం ముగిసిన తర్వాత కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఓ హామీ ఇచ్చింది. ఉద్యమంలో ఆందోళనకారుల ప్రాణాలు తీసిన వారిని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యూనల్ ఎదుట హాజరుపరుస్తామని పేర్కొంది. హసీనా దేశం వీడిన తర్వాత హింస చెలరేగడంతో బంగ్లాదేశ్లో దాదాపు 230 మంది ప్రాణాలు కోల్పోయారు. జులై మధ్యలో విద్యార్థి ఉద్యమం ప్రారంభం నుంచి చూస్తే దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయారు.

హైద్రాబాద్ లో ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి నేడు  రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు ఎంఐఎం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. పీవీ ఎక్స్ ప్రెస్ వే తర్వాత నగరంలో రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ ఇదే.

జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్‌కు పాట్నా సివిల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీనికి ముందు కోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ ష్యూరిటీ బాండ్ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఆయనను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌పై పీకీ చేపట్టిన నిరాహార దీక్షను పాట్నా పోలీసులు సోమవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైనందున అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.

హైదరాబాద్ నగర శివారు ప్రాంతం ఘట్‌కేసర్‌లో ప్రయాణిస్తున్న కారులో ప్రమాదవశాత్తూ ముగ్గురు సజీవ దహనం అయ్యారు. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురూ చిక్కుకుపోయారు. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో సజీవ దహనం అయ్యారు. కారు నుంచి మంటలు రావడంతో స్థానికులు భారీగా గుమిగూడారు. కారులోని వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో వాహనం వద్దకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కారులోని వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 

దేశంలో సిప్లా ఉబ్బసం (ఆస్తమా) స్క్రీనింగ్‌ కోసం మొబైల్‌ అప్లికేషన్‌ సిప్లా ఎయిర్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ యాప్‌ వినియోగదారులకు ఉబ్బసం వచ్చే అవకాశాలను ముందే గుర్తించడం ద్వారా వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే నిర్ధారిస్తుంది. సిప్లా ఎయిర్ స్క్రీన్‌పై ఉన్న వర్చువల్‌ క్యాండిల్‌ను ఆర్పివేసే క్రమంలో దృష్టి కేంద్రీకరించేటప్పుడు వినియోగదారులు మూడు ఉచ్చ్వాసాలను నిర్వహించాలి. ఈ యాప్‌ పరీక్ష ఉచ్చ్వాసాల నాణ్యతపై తన అభిప్రాయాన్ని అందిస్తుంది. ఉబ్బసాన్ని సూచించే ధ్వని నమూనాలను గుర్తించడానికి ఉచ్చ్వాస శబ్దాలను విశ్లేషిస్తుంది. ఫలితాలు రెడ్‌, ఎల్లో, గ్రీన్‌ జోన్లుగా డిస్‌ప్లే అవుతాయి. ఈ పరీక్ష, వినియోగదారులకు ఈ వ్యాధికి సంబంధించి ముందస్తు రోగనిర్ధారణను సులభతరం చేస్తుంది. ఉబ్బసం ఉన్న వ్యక్తులకు వారి పరిస్థితిని తెలియజేయడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు వెళ్లేలా తగు సూచనలు ఇస్తుందని సిప్లా తెలిపింది. గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ నివేదిక ప్రకారం భారత్‌లో 3.43 కోట్ల మంది ఆస్తమా వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ఉబ్బస సంబంధిత మరణాల రేటు మూడు రెట్లు ఎక్కువ ఉండడంతో పాటు దీనివల్ల వైకల్య భారం ప్రపంచ సగటు కంటే రెండింతలు ఎక్కువ ఉంది. ప్రస్తుతం సిప్లా ఎయిర్ ఆండ్రాయిడ్ లో అందుబాటులో ఉంది, త్వరలో iOS పరికరాల్లో అందుబాటులోకి వస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. సిప్లా డిజిటల్‌ హెల్త్‌ లిమిటెడ్‌ బ్రీత్‌ఫ్రీ మొబైల్‌ అప్లికేషన్‌ను కూడా ప్రారంభించింది. శ్వాస వ్యాయామాలు, లైవ్‌ యోగా సెషన్లు, డైట్‌ ప్లాన్లు, మెడిసిన్‌ రిమైండర్లు, ఇన్‌హేలర్‌ ట్రాకింగ్‌తో సహా శ్వాసకోశ సంరక్షణ కోసం అనేక సేవలను అందించే వేదికలా ఈ అప్లికేషన్‌ పనిచేస్తుంది.

తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తంగా 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,66,41,489 మంది పురుషులు, 1,68,67,735 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు  5,45,026, 85 సంవత్సరాలు దాటిన సీనియర్ ఓటర్లు  2,22,091, ఎన్ఆర్‌ఐ ఓటర్లు - 3,591, ప్రత్యేక ప్రతిభావంతులు ఓటర్లు - 5,26,993, శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది, అత్యల్పంగా భద్రాచలంలో 1,54,134 ఓటర్లు ఉన్నారు

అసెంబ్లీ సంప్రదాయాలను ఉల్లంఘించడం తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి ఆనవాయితీగా మారింది. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగించడం సంప్రదాయం. సోమవారం సంప్రదాయ ప్రసంగాన్ని చేయకుండానే అసెంబ్లీ నుంచి ఆయన వెళ్లిపోయారు. గవర్నర్‌ చర్యను ఆ రాష్ట్ర సిఎం ఎం.కె స్టాలిన్‌ తప్పుపట్టారు. గవర్నర్‌ చర్యను చిన్నపిల్లల చేష్టగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు స్టాలిన్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. 'అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం చేయడం సంప్రదాయంలో భాగం. అయితే ఆ పద్ధతిని ఉల్లంఘించడం గవర్నర్‌కు అలవాటుగా మారింది. గతంలో సిద్ధం చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలను చేర్చి, కొన్నింటిని తొలగించి చదివారు. అయితే ఈసారి మాత్రం ప్రసంగాన్ని చదవకూడదనే నిర్ణయించుకున్నారు. గవర్నర్‌ చర్య చిన్నపిల్లల చేష్టగా ఉంది. తమిళనాడు ప్రజల్ని, ప్రభుత్వాన్ని అవమానించేలా గవర్నర్‌ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చర్యలు గవర్నర్‌ పదవికి తగనివి. ఆ పదవికి గౌరవాన్ని ఇవ్వవు' అని స్టాలిన్‌ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించడానికి ఇష్టపడకపోతే గవర్నర్‌ తన పదవిలో ఎందుకుండాలనేదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న అని స్టాలిన్‌ అన్నారు. కాగా, నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గర్నర్‌ సంప్రదాయ ప్రసంగం ముందు రాష్ట్ర గీతం 'తమిళ్‌ థారు వజ్తు' గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించలేదు. దీంతో గవర్నర్‌ తన ప్రసంగం ముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఎంపీవీ ఇప్పటికే వ్యాప్తిలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మిగతా శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. దేశంలో ఇన్‌ఫ్లుయెంజా మాదిరి వ్యాధులు లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు అసాధారణ రీతిలో ఏమీ లేవని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ''ఇతర శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే హెచ్‌ఎంపీవీ ఉంటుంది. సాధారణ జలుబు, ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నారుల్లో, వృద్ధుల్లో ఈ ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా కనిపిస్తుంది'' అని కేంద్ర ఆరోగ్యసేవల డైరెక్టర్‌ జనరల్‌  డాక్టర్‌ అతుల్‌ గోయల్‌ పేర్కొన్నారు. సీజనల్‌ శ్వాసకోశ సంబంధింత కేసులను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సామగ్రి, పడకలు, ఇతర వసతులతో భారత్‌లోని ఆసుపత్రులు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. శీతాకాలంలో అవసరమైన జాగ్రత్తలు వహించడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు జన్యు పరివర్తన జరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనడం మినహాయించి హెచ్‌ఎంపీవీ వైరస్‌ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్‌ మాజీ శాస్త్రవేత్త డాక్టర్‌ రామన్‌ గంగాఖేడ్కర్‌ ఓ మీడియా సంస్థతో చెప్పారు. ప్రస్తుత రకం వైరస్‌తో ఎటువంటి ఆందోళన అవసరం లేదన్నారు. హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ అనేది ఇదివరకే తెలిసిన వైరస్‌. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో సంభవించే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లలో 12శాతం వరకు ఇదే కారణమవుతోందని అంచనా. రెస్పిరేటరీ సిన్సిటియల్‌ వైరస్‌ని పోలి ఉండే ఈ వైరస్‌.. ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల మాదిరిగానే కనిపిస్తుంది. తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన వాళ్లలోనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆసుపత్రిలో చికిత్స అవసరం అవుతుంది. సాధారణంగా 11ఏళ్ల చిన్నారుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. తొలిసారిగా దీనిని 2001లో నెదర్లాండ్స్‌లో 28 మంది చిన్నారుల్లో గుర్తించారు.

బెంగళూరు నగరంలో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ వైరస్‌ సోకడంతో అక్కడి కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్‌ కొవిడ్‌లా వ్యాప్తి చెందేది కాదని, అందువల్ల ఎవరూ భయపడొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అడ్వైజరీని విడుదల చేసింది. రద్దీగా ఉండే  ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని కోరింది. ఈ శ్వాసకోశ సంబంధిత వైరస్‌ ప్రాథమికంగా పిల్లలపై ప్రభావం చూపిస్తుందని, వారిలో సాధారణంగా జలుబు వంటి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని డైరెక్టరేట్‌ ఆఫ్ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అడ్వైజరీలో పేర్కొంది. ఇన్‌ఫ్లూయెంజాలాంటి అనారోగ్యం, తీవ్రమైన ఆక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ల వంటి కేసులను రిపోర్టు చేయాలని రాష్ట్రంలోని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు సూచనలు చేసింది. ఎవరైనా దగ్గు, తుమ్మిన సమయంలో నోరు, ముక్కును కప్పి ఉంచుకోవాలని, తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని డీఎంఈ సూచించింది. ఈ వైరస్‌ లక్షణాలు ఉన్నవారు, రోగులకు సన్నిహితంగా ఉన్నవారు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. వాడిన టిష్యూ పేపర్లు తిరిగి ఉపయోగించొద్దని.. రుమాలు, తువ్వాలును షేర్‌ చేసుకోవద్దని కోరింది. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయొద్దని ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. డీఎంఈ తెలిపిన వివరాల ప్రకారం హెచ్‌ఎంపీవీ సోకితే దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి ఫ్లూలాంటి లక్షణాలు కనబడతాయి. మరింత తీవ్రమైన కేసుల్లో అయితే ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి లేనివారిలో ఇది బ్రాంకైటిస్‌, నిమోనియాకు దారితీయొచ్చని తెలిపింది. హెచ్‌ఎంపీవీకి నిర్దిష్టమైన యాంటీ వైరల్‌ చికిత్స, టీకాలు అందుబాటులో లేవన్న డీఎంఈ తగిన విశ్రాంతి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వంటి చర్యలు కొంత ఉపశమనం కలిగిస్తాయని తెలిపింది. తీవ్రమైన కేసుల్లో అయితే, ఆస్పత్రిలో చేరి ఆక్సిజన్‌ థెరపీ, ఐవీఫ్లూయిడ్స్‌ అవసరమవుతాయని పేర్కొంది.

చండీగఢ్‌లోని ప్రధాన మార్కెట్‌ ప్రాంతమైన సెక్టార్ 17లోని బహుళ అంతస్తుల భవనం సోమవారం ఉదయం  7 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. ఇది చూసి అక్కడున్న జనం షాకయ్యారు. కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. కూలిన బిల్డింగ్‌ శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. శిథిలాల్లో ఎవరైనా చిక్కుకున్నారా? ప్రాణ నష్టం జరిగిందా? అన్నది ఇంకా తెలియలేదు. అయితే బహుళ అంతస్తుల బిల్డింగ్‌ కూలడాన్ని రోడ్డుపై వెళ్లే ఒక వ్యక్తి మొబైల్‌లో రికార్డ్‌ చేశాడు. షాక్‌కు గురి చేసేలా ఉన్న ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

రిలయన్స్ జియో తాజాగా రూ.1234 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా కాలింగ్‌, డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకొనే యూజర్లకు ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు జియో యాప్‌లను కూడా ఉచితంగా వినియోగించుకోవచ్చు. జియో రూ.1234 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా 336 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌ లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 500MB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతి 28 రోజులకు 300 SMS లను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా 11 నెలలపాటు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్‌ కేవలం జియోభారత్‌ ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని జియో తెలిపింది. కేవలం కాలింగ్ అవసరాలు ఉన్న యూజర్లకు ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది. దీంతోపాటు జియోసినిమా, jiosavaan వంటి యాప్‌లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోభారత్‌ ఫోన్‌ యూజర్ల కోసం రూ.234 ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా 56 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 0.5GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు ప్రతి 28 రోజులకు 300 SMS లను పొందవచ్చు. జియోశవన్‌, జియో సినిమా, జియోటీవీ యాప్‌లను పొందవచ్చు.

ఆంధ్రప్రదెశ్ కి ముఖ్యమంత్రిని అయినా కుప్పానికి ఎమ్మెల్యేనే అని, ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కుప్పం అభివృద్ధి అన్ స్టాపబుల్ అని, అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకే స్వర్ణ కుప్పం విజన్ 2029 నిర్ధేశించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించారు. 2024 ఎన్నికల తర్వాత నేను రెండవ సారి కుప్పం వచ్చాను. కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఆఫీసర్ గా యువ ఐఏఎస్ కు బాధ్యతలు అప్పగించా. కుప్పంలో దాదాపు 65 వేల కుటుంబాల వరకూ ఉన్నాయి. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నాము. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేస్తాం. కుప్పం నియోజకవర్గంలో పేదరికం లేకుండా ఉండేందుకు ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తాం. పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి 15 వేల ఉద్యోగాల కల్పన,100 శాతం సోలరైజేషన్, రహదారుల నిర్మాణం, జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు, నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటు, కార్గో ఎయిర్ పోర్టు పూర్తిచేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, 100 శాతం మరుగుదొడ్లు నిర్మాణం, అర్హులకు పెన్షన్లు, దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ, సూపర్ స్పెషాలిటీ ఏరియా ఆస్పత్రి నిర్మాణం, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరు, ఎలక్ట్రికల్ సైకిళ్లు పంపిణీ, డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహకాలు అందించి కుప్పం నియోజకవర్గాన్ని మోడ్రన్, టూరిజం హబ్ గా తయారు చేయడం వంటి నిర్ధిష్ట ప్రణాళికతో స్వర్ణ కుప్పం విజన్ - 2029 రూపొందించామని అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంస పాలన జరిగింది. వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఎవరినీ స్వేచ్ఛగా మాట్లాడనివ్వలేదు. ప్రజలను అణిచివేశారు. వారికి మంచి చేయాలనే ఆలోచన లేదు . రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాట పట్టాలంటే వైసీపీని ఓడించాలని నేనూ, నరేంద్ర మోడీ, పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపుకు మీరు స్పందించి బ్రహ్మరథం పట్టారు. నేను సుధీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశాను. పదేళ్లు ప్రతిపక్షనేతగా పనిచేశాను. రాజకీయాలంటే ఆషామాషీగా తీసుకోకుండా పబ్లిక్ పాలసీ తీసుకొస్తే చరిత్ర తిరగరాయొచ్చుని భావించాను. అదే అమలు చేసి అద్భుత ఫలితాలు సాధించాను. ఒక సమర్థ నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించిన పార్టీ తెలుగుదేశమే. ద్రవిడ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ దే. దురదృష్టవశాత్తు దేవాలయం లాంటి యూనివర్సిటీలను కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా వైసీపీ వాడుకుంది. వర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాము. నేను నాడు విజన్-2020 అని నినాదం ఇస్తే కొంతమంది హేళన చేశారు. 1995లో నేను సీఎంగా ఉన్నప్పుడు సైబరాబాద్ ప్రాంతమంతా రాళ్లు, రప్పలు. అక్కడ ఐటీని అభివృద్ధి చేసేందుకు హై టెక్ సిటీ నిర్మించాను. ప్రపంచంలోనే ఐటీ సిటీగా హైదరాబాద్ తయారవుతుందని ఆనాడే చెప్పాను. నాడు టీడీపీ హయాంలో వేసిన పునాది కారణంగా తలసరి ఆదాయంలో నేడు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కష్టపడి పనిచేస్తే సాధించలేనిదేమీ లేదు. మనమంతా సమిష్టిగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. మహాత్ముడు స్వాతంత్ర్యం సాధించారు. పేద కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. మన తెలుగుబిడ్డ పీవీ. నరసింహారావు ప్రధానిగా దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తాము. రాష్ట్రంలో నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. జూన్ లోగా హంద్రినీవా జలాలను పాలారు వాగుకు తీసుకొస్తా. ఈ వాగుపై చెక్ డ్యామ్ కూడా నిర్మిస్తా. నీటి భద్రత, కరవు నివారణ కోసం గోదావరి నీళ్లను బనకచర్లకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించాం. టెక్నాలజీ సాయంతో వ్యవసాయం లాభసాటిగా మార్చడంతో పాటు ఖర్చు తగ్గించే విధానాలపై దృష్టి పెట్టాను. స్వచ్చాంధ్రప్రదేశ్ నినాదాన్ని ప్రజల్లోకి ఉధృతంగా తీసుకెళ్తున్నాము. భవిష్యత్ లో డీప్ టెక్నాలజీ దే హవా. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి 150 సేవలు అందించబోతున్నాము. దక్షిణ భారతదేశంలో సంవత్సరాల తరబడి జనాభా పెరుగుదల రేటు క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీ జనాభా గ్రోత్ రేట్ 1.5 % .దక్షణ కొరియా .5% గా ఉంది. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి' అని సీఎం చంద్రబాబు అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానమిచ్చి కుప్పం అభివృద్ధికి తీసుకుంటున్న ప్రణాళికలను వివరించారు.

ఆన్‌లైన్ ఉచిత స్క్రీన్ రికార్డింగ్ సాధనాలను అందించే లూమ్ సహ వ్యవస్థాపకుడు వినయ్ హిరేమత్ 2023లో తన స్టార్టప్ లూమ్‌ను 975 మిలియన్ డాలర్లకు (రూ. 8368.59 కోట్లు) విక్రయించారు. అప్పటి నుంచి తనకు ఏం చేయాలో తోచడం లేదన్నారు. ఈ విషయాన్ని తన బ్లాగ్ పోస్ట్‌లో పంచుకున్నారు. ఇప్పుడు తన వద్ద చాలా డబ్బు ఉందని, కానీ తన జీవితంలో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కంపెనీని అమ్మిన తర్వాత డబ్బు సంపాదించాలన్నా, హోదా సాధించాలన్నా కోరిక లేకుండా పోయిందన్నారు. వినయ్ హిరేమత్ 1991లో జన్మించాడు. ఆయన యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్, ఉర్బానా-ఛాంపెయిన్‌లో చదువు ప్రారంభించాడు. కానీ రెండేళ్ల తర్వాత చదువు మానేశాడు. దీని తర్వాత ఆయన కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోకు వెళ్లాడు. స్టార్టప్‌లలో కెరీర్‌ను కొనసాగించాలని కలలు కన్నాడు. మొదట్లో వినయ్ సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ అయిన బ్యాక్‌ప్లేన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో ఇంటర్న్‌గా ఉన్న షాహెద్ ఖాన్‌ను కలుసుకున్నాడు. తరువాత అతనితో కలిసి లూమ్‌ను స్థాపించాడు. ప్రారంభ రోజులలో లూమ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. కేవలం రెండు వారాల్లో నిధులు ఖాళీ అయ్యాయి. ఈ కష్ట సమయాల్లో హిరేమత్ తన క్రెడిట్ కార్డును పూర్తిగా ఉపయోగించుకుని కంపెనీని కాపాడుకున్నాడు. లూమ్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీటీఓగా ఆయన $200 మిలియన్ల నిధిని సేకరించాడు.ఆ క్రమంలోనే ఆయన నాయకత్వంలో లూమ్ వినియోగదారుల సంఖ్య 3 కోట్లు దాటింది. ఆ తర్వాత 2023లో లూమ్‌ను విక్రయించారు. స్టార్టప్ అమ్మిన తర్వాత 'రెడ్ వుడ్స్ 'కి వెళ్లి మళ్లీ ఏదో ఒకటి చేయాలని ప్రయత్నించాడు. కానీ డజన్ల కొద్దీ పెట్టుబడిదారులు, రోబోటిక్ నిపుణులను రెండు వారాల పాటు కలుసుకున్నప్పటికీ, ఆయన వారిని ఆకర్షించడంలో విఫలమయ్యాడు. ఆ తరువాత అతను ఎటువంటి అనుభవం లేకుండా హిమాలయాలను అధిరోహించడానికి బయలుదేరాడు. చివరకు అనారోగ్యంతో తిరిగి వచ్చాడు. తర్వాత వినయ్ హవాయికి వెళ్లాడు. ఇప్పుడు ఫిజిక్స్ చదువుతున్నాడు. వాస్తవ ప్రపంచానికి సంబంధించిన విషయాలను సృష్టించే కంపెనీని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సంస్థ లూమ్ స్థాయికి చేరకపోయినా.. తనకు ఆత్మస్థైర్యాన్ని అందించాలని, ఇదే తన కోరిక అని అంటున్నారు.

తనపై బీజేపీ నేత రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ కన్నీరు పెట్టుకున్నారు. అతిశీ తన తండ్రిని మార్చేశారంటూ తాజాగా రమేశ్ బిధూరి వ్యాఖ్యానించారు. దీనిపై ఇవాళ అతిశీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాలు మరీ ఇంతగా దిగజారడమేంటని ప్రశ్నించారు. కల్కాజీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి రమేశ్ బిధురి పదేళ్లుగా ఎంపీగా ఉన్న సమయంలో ఆ ప్రాంతం కోసం ఏం చేశారో చూపించాలని అన్నారు. తన తండ్రి జీవితాంతం  ఉపాధ్యాయుడిగా పనిచేశారని తెలిపారు. పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వేలాది మంది పిల్లలకు ఆయన చదువు చెప్పారని అన్నారు. ఇప్పుడు తన తండ్రికి 80 ఏళ్లు అని, ఆరోగ్యం బాగోలేదని, ఆయన నడవలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. అటువంటి వ్యక్తి గురించి రమేశ్ బిధూరి దుర్భాషలాడారని అన్నారు. ఈ దేశంలో రాజకీయాలు ఇంత దిగజారిపోతాయని తాను ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్యానించారు. కాగా, బిధూరి తాజాగా మాట్లాడుతూ మర్లెనాగా ఉన్న అతిశీ ఇప్పుడు సింగ్ అని, ఆమె తన తండ్రిని కూడా మార్చారని అన్నారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ లక్షణాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. అంతేగాక, 2001లో పార్లమెంటుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు క్షమాబిక్ష కోసం ఆమె తల్లిదండ్రులు అప్పట్లో క్షమాభిక్ష పిటిషన్‌ను సమర్పించారని అన్నారు. భారత సైనికుల మరణానికి కారణమైన ఉగ్రవాది అఫ్జల్ గురు మరణశిక్షకు వ్యతిరేకంగా అతిశీ మర్లెనా తల్లిదండ్రులు క్షమాభిక్ష పిటిషన్‌ను సమర్పించారని విమర్శించారు. ఆ ఉగ్రవాది మరణానికి క్షమాపణ కోరిన వారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా అని ఢిల్లీ ప్రజలను అడిగారు.

తాలిబన్లు టార్గెట్‌గా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌పై వైమానిక దాడులు చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లోని ఆఫ్ఘనిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్సుపై ఈ దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులో పిల్లలు, మహిళలు అమాయకులు 40 మందికి పైగా మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు చెప్పారు. ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. దీనికి తగ్గట్లుగానే తాలిబన్లు రెండు దేశాలకు మధ్య ఉన్న సరిహద్దు రేఖ డ్యూరాండ్ లైన్‌ని దాటి పాకిస్తాన్‌పై దాడులు చేశారు. ఈ దాడులపై భారత్ స్పందించింది. ''అమాయక పౌరులపై ఏదైనా దాడిని నిస్సందేహంగా ఖండిస్తున్నాం'' అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ తన సొంత అంతర్గత వైఫల్యాలకు పొరుగువారిని నిందించే పాత పద్ధతని అవలంభిస్తోందని భారత్ చెప్పింది. ఆఫ్ఘన్ పౌరులపై పాకిస్తాన్ వైమానిక దాడులకు సంబంధించి మీడియా ప్రశ్నలకు ప్రతిస్పందనగా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ''మహిళలు మరియు పిల్లలతో సహా ఆఫ్ఘన్ పౌరులపై వైమానిక దాడులపై మీడియా నివేదికలను గమనించాము, ఇందులో అనేక విలువైన ప్రాణాలు కోల్పోయారు. అమాయక పౌరులపై దాడులను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము'' అని అన్నారు.

బాహుబలి రికార్డును పుష్ప 2 బద్దలు కొట్టింది. 32 రోజుల్లో 1831 కోట్లు వసూలు చేసిన పుష్ప బాహుబలిని క్రాస్ చేసింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 మొత్తం 1810 కోట్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బాహుబలి వసూళ్లు చూసి దీనిని దాటడం అసాధ్యం అని అనుకున్నారు అందరూ. కానీ అసలు తగ్గేదేలే అనే విధంగా డిసెంబర్ 5 విడుదల అయిన పుష్ప 2 చిత్రం సౌత్ కంటే నార్త్ లోనే ఎక్కువ కలెక్షన్ వసూలు చేసింది. 

ఉత్తరప్రదేశ్‌లోని  ప్రయాగరాజ్‌కు చెందిన అనూప్‌ కుమార్‌ ఉద్యోగరీత్యా భార్యపిల్లలతో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. అనూప్‌ భార్య రాఖీ గృహిణి. వీరికి అనుప్రియ (5), ప్రియాన్ష్‌ (2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనూప్‌ ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. సంతోషంగా జీవనం సాగిస్తున్న వీరి కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. సోమవారం ఉదయం పనిమనిషి వచ్చి తలుపుతట్టగా ఎంతకూ తీయలేదు. దాంతో ఆమె ఇరుగుపొరుగుకు సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. లోపల అనూప్‌, అతని భార్య రాఖీతోపాటు పిల్లలు విగతజీవులుగా పడివున్నారు. పిల్లలిద్దరి మృతదేహాలు బెడ్‌పై పడివుండగా, అనూప్‌, రాఖీల మృతదేహాలు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాయి. దాన్నిబట్టి అనూప్‌ దంపతులు ముందుగా పిల్లలిద్దరికి విషమిచ్చి చంపి, తర్వాత వాళ్లు ఉరేసుకున్నట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటనపై పనిమనిషిని ఆరా తీయగా ఆమె పలు విషయాలు వెల్లడించిందని పోలీసులు తెలిపారు. పనిమనిషి తెలిపిన వివరాల ప్రకారం అనూప్‌ ఇంట్లో మొత్తం ముగ్గురు పనివాళ్లు ఉన్నారు. వారిలో ఇద్దరు వంట మనుషులు కాగా, ఒకరు పిల్లల కేర్‌టేకర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున వేతనం ఇస్తున్నారు. ఆర్థికంగా వారికి ఏ లోటూ లేదు. అయితే అనుప్రియ ఆరోగ్యం గురించి అనూప్‌ దంపతులు ఎప్పుడూ ఆందోళన చెందుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం అనూప్‌ దంపతులు పుదుచ్చేరి పర్యటనకు ప్లాన్‌ చేసుకున్నారు. ఆ మేరకు ఆదివారం రాత్రి లగేజ్‌ను కూడా సర్దిపెట్టుకున్నారు. సోమవారం ఉదయం వారు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కానీ తీరా పనిమనిషి వచ్చి చూసేసరికి వారు పిల్లలను చంపేసి ఉసురు తీసుకున్నారు. పనిమనిషి వెల్లడించిన వివరాలను బట్టి తమ కూతురు అనారోగ్య సమస్య కారణంగానే దంపతులు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

మధ్యప్రదేశ్ కి చెందిన రాహుల్ అహిర్వార్ అనే యువకుడు ఢిల్లీలో లేబర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే వివాహం జరిగింది. ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలోనే రాత్రి 7 గంటలకు హర్పల్ పూర్ ఏరియాలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం రాహుల్‌ను ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన రాహుల్ అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో హర్పల్ పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు ఆ ప్రాంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబక్ నాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు మహోబక్‌నాథ్ పోలీసులకు సమాచారం అందించగా, ఆ ఏరియా తమ పరిధిలోకి రాదని, హర్పల్‌పూర్ పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు పట్టించుకోకపోవడంతో రాహుల్ మృతదేహం రోడ్డుపైనే పడి ఉంది. గంటలు గడుస్తున్నా పోలీసులు స్పందించకపోవడం, రాహుల్ కుటుంబ సభ్యుల రోదనలతో స్థానికులు మండిపడ్డారు. రాహుల్ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో చివరకు మహోబక్ నాథ్ పోలీసులు స్పందించి రాత్రి 11 గంటల ప్రాంతంలో రాహుల్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతర పెట్టి పేల్చివేశారు. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఐఈడీ పేలిన సమయంలో వ్యాన్‌లో 15మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను బీజాపూర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెట్రోలింగ్‌లో భాగంగా ఇవాళ ఉదయం జవాన్లు కుత్రు అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా.. వారిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఐఈడీ పేల్చివేశారు. గతకొన్నాళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌, సుకుమా జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య తరచూ కాల్పులు చోటు చేసుకుంటున్నాయి.

తెలంగాణలో రూ.430కోట్లతో కొత్తగా నిర్మించిన చర్లపల్లి టెర్మినల్‌ ను సోమవారం నాడు ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గనుల శాఖ మంత్రి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం వర్చువల్‌గా పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. టెర్మినల్ ప్రారంభానికి సంబంధించి అధికారులు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతర్జాతీయ విమానా శ్రయ తరహాలో ఆధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను రూపొందించారు. ఈ స్టేషన్‌ నుంచి 24 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇక్కడ ఐదు లిఫ్టులతోపాటు, ఐదు ఎస్కలేటర్లను సైతం ప్లాట్‌ఫామ్స్‌లో ఏర్పాటు చేశారు. అలాగే పార్సిల్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. 25 జతల రైళ్లను హ్యాండిల్ చేసేలా ఈ స్టేషన్‌లో ట్రాకులు ఏర్పాటు చేశారు. అందుకోసం 10 కొత్త ట్రాకులను నిర్మించారు. వాహనాల పార్కింగ్ కోసం సువిశాలమైన స్థలాన్ని ఏర్పాటుచేశారు. విశాలమైన లాంజ్ లు, ప్రయాణికులకు విలాసవంతమైన సౌకర్యాలను అందుబాటులో ఉంటారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో మొత్తం మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు ఉన్నాయి. అందులో ఒకటి గతంలోనే నిర్మించగా, కొత్తగా 2 టెర్మినల్స్ ను నిర్మించారు. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే.. మరో రెండు ప్రధాన రైళ్ల రాకపోకలు సైతం ఇక్కడి నుంచే నిర్వహించనున్నారు అధికారులు. ఇక్కడ్నుంచి ఇక నుంచి ప్రస్తుతం నడుస్తున్న సమయానికే ప్రతీ రోజు నాంపల్లి నుంచి బయల్దేరే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌- చెన్నై ఎక్స్‌ప్రెస్‌ చర్లపల్లి నుంచి బయల్దేరనుంది. అదే విధంగా గోరఖ్‌పూర్‌-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ సైతం చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. ఈ కొత్త టెర్మినల్ ఏర్పాటుతో నాంపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది.

దేశంలో రెండు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (హెచ్‌ఎమ్‌పీవీ) కేసులు బయటపడ్డాయి. రెండు కేసులూ కర్ణాటక రాజధాని బెంగళూరులోనే వెలుగు చూసినట్లు భారత వైద్య పరిశోధన మండలి తాజాగా ధృవీకరించింది. బెంగళూరులోని బాప్టిస్ట్‌ ఆసుపత్రిలో మూడు నెలల, ఎనిమిది నెలల చిన్నారులకు ఈ వైరస్‌ సోకిటనట్లు తేలింది. మూడు నెలల శిశువు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా, ఎనిమిది నెలల పాప ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. బాధిత కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. హ్యూమన్‌ మెటాన్యూమోవైరస్‌ను(హెచ్‌ఎంపీవీ) మొదట 2001లో గుర్తించారు. 2011-12లో అమెరికా, కెనడా, ఐరోపా ఈ వైరస్‌ కేసులు నమోదయ్యాయి. హెచ్‌ఎంపీవీ వైరస్‌ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్‌, నిమోనియా వంటి సమస్యలకు సైతం దారి తీయొచ్చు. సాధారణంగా వైరస్‌ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుప్పిర్లు ద్వారా వైరస్‌ వ్యాపిస్తుంది. వైరస్‌ సోకిన వారికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా, తాకినా వైరస్‌ సోకవచ్చు. వైరస్‌తో కలుషితమైన వస్తువులను తాకి, అవే చేతులతో ముక్కు, మూతి, కళ్లను తాకినా వైరస్‌ సోకుతుంది. పిల్లలు, వయోధికులు, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి హెచ్‌ఎంపీవీ ముప్పు అధికం. తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోని చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు. అనారోగ్య లక్షణాలతో ఉన్న వారికి కొంచెం దూరంగా మసులుకోవాలి. తరచూ ముట్టుకునే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోరుకు టిష్యూ లేదా కర్చీఫ్‌ను అడ్డుపెట్టుకోవాలి. తరచూ కనీసం 20 సెకన్ల పాటు సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత వస్తువులు ఇతరులు వినియోగించడానికి ఇవ్వొద్దు. అనారోగ్యంగా ఉంటే ఇంటికే పరిమితం అవడం మంచిది.

రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన గేమ్‌ చేంజర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్‌ (22) బైక్‌పై శనివారం రాజమహేంద్రవరం రూరల్‌ మండలం వేమగిరిలో జరిగిన గేమ్‌ చేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చారు. జనం ఎక్కువగా ఉండడంతో తిరిగి కాకినాడ బయలుదేరారు. రాత్రి 9.30 గంటలకు వడిశలేరులో ఎదురుగా వస్తున్న వ్యాన్‌ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టగా తీవ్రగాయాలపాలయ్యారు. దీంతో ఇద్దరినీ వారి స్నేహితులు 108 వాహనంలో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మణికంఠ మృతిచెందాడని వైద్యులు తెలిపారు. కొనఊపిరితో ఉన్న చరణ్‌ను చికిత్స నిమిత్తం కాకినాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి 12.15 గంటలకు మృతిచెందాడు. మృతుల స్నేహితుడు శశిశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ టి.కృష్ణసాయి తెలిపారు.

కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న విశాల్ కి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గతేడాది రత్తం (తెలుగులో రత్నం) లో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. బాగా చిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు. చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రత్నం తర్వాత మరే లోనూ కనిపించలేదు. అయితే 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని మదగజరాజ ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా మదగజరాజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ కు వచ్చిన విశాల్ ను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మోహం అంతా వాచిపోయి, మాట్లాతున్నప్పుడు  చేతులు వణికిపోతూ, నోట్లోంచి మాట కూడా సరిగా రాలేని స్థితిలో ఉన్నాడు. విశాల్ పరిస్థితిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరోకు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే విశాల్ తీవ్ర చలి జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడని తెలుస్తోంది. 

జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే.మంచు మనోజ్, విష్ణు,మోహన్ బాబు మధ్య ఆస్తి తగాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే మంచు మనోజ్ తనపై దాడి జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.అనంతరం విష్ణు సైతం మనోజ్ మీద కేసు పెట్టారు. మోహన్ బాబు ఇంటికి వివరాల కోసం వెళ్లిన జర్నలిస్టుపై ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైంది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్ దరఖాస్తు చేయగా.. హైకోర్టు నిరాకరించింది. దీంతో మోహన్ బాబు సోమవారం సుప్రీం కోర్టులో బెయిల్ దాఖలు చేసినట్లు సమాచారం.

బంగాళాఖాతం మీదుగా వీస్తోన్న బలమైన ఈస్టర్లీ విండ్స్ లో చోటు చేసుకుంటోన్న మార్పులు చలి గాలికీ కారణమని వాతావరణ శాఖ తెలిపింది. దీనిప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు తమిళనాడు వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నైలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఈస్టర్లీ విండ్స్ వేగం గంటకు 35 నుండి 45 కిలో మీటర్ల వరకు ఉండొచ్చు. గంటకు 55 కిలో మీటర్ల వరకూ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాలు, గల్ఫ్ ఆఫ్ మన్నార్, బంగాళాఖాతంలో నైరుతి- దక్షిణ ప్రాంతాల్లో బలమైన తూర్పు ఈదురు గాలులు వీస్తాయి. దీని ప్రభావంతో- చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా వచ్చే 72 గంటల పాటు అంటే- ఈ నెల 8వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పుదుచ్చేరి, కరైకల్‌ల్లోనూ ఇదే తీవ్రత కనిపించే అవకాశాలు లేకపోలేదని అంచనా వేసింది. అదే సమయంలో చలి తీవ్రత భారీగా పెరుగుతుందని ఐఎండీ పేర్కొంది. నీలగిరి, దిండిగల్, కోయంబత్తూరు, సేలం వంటి జిల్లాల్లో వర్షాలతో పాటు పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉండొచ్చు. ఊటీ, కొడైకెనల్, కోటగిరి, కూనూరు, ఏర్కాడ్, ఏలగిరి, కుళుక్కుమలై, జవాధు హిల్స్ వంటి ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంటుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ కేసులను.. కర్నాటక హైకోర్టుకు బదిలీ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. మొబైల్ ఫోన్ల అమ్మకాల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా చేసిన ఆరోపణలను సవాల్ చేస్తూ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ సంస్థలు వివిధ కోర్టుల్లో కేసులు దాఖలు చేశాయి. అయితే సీసీఐ వేసిన పిటీషన్ ఆధారంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్వల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం ఈ-కామర్స్ సంస్థల కేసులను కర్నాటకకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఒకవేళ ట్రాన్స్‌ఫర్ అయిన పిటీషన్ల కేసుల్లో విచారణ పూర్తి కాకుంటే, వాళ్లకు తగినంత సమయం ఇవ్వాలని కోర్టు పేర్కొన్నది. అన్ని కేసులను కర్నాటక హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు బెంచ్ తెలిపింది. సీసీఐ ఆరోపణలను సవాల్ చేస్తూ సుమారు 26 పిటీషన్లు వేర్వేరు హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్టలపై ఢిల్లీ వ్యాపార మహాసంఘం ఫిర్యాదులు చేసింది. దాని ఆధారంగా సీసీఐ విచారణ చేపట్టింది. అయితే సీసీఐ ఇచ్చిన నివేదికను తప్పుపడుతూ.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు వేర్వేరు కోర్టుల్లో పిటీషన్లు దాఖలు చేసింది.

శ్రీశైలంలో పూజారి ఇంట్లో చిరుత పులి సంచారం చేసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్‌ గా మారింది. పాతాళగంగ మెట్ల మార్గంలోని శ్రీశైలం పూజారి సత్యనారాయణ ఇంట్లో అర్ధరాత్రి చిరుత పులి సంచరించింది. ఇంట్లో అందరూ డోర్లు పెట్టుకుని పడుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్‌ గా మారింది. దీనిపై అటవీ శాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

3