Ad Code

తెలంగాణలో అయిదు రోజులు సంక్రాంతి సెలవులు


తెలంగాణ విద్యా శాఖ సంక్రాంతి సెలవులు అయిదు రోజులు ప్రకటించింది. జనవరి 13 నుంచి 17 వరకు పాఠశాలలకు సెలవులు ఖరారు చేస్తూ విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. తిరిగి, జనవరి 18వ తేదీన మళ్లీ పాఠశాలలు పునః ప్రారం భం కానున్నాయి. పండుగ ప్రారంభానికి ముందు జనవరి 11 రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో అదనంగా మరో రెండు రోజులు సెలవులు కలిసి రానున్నాయి. అదే విధంగా కళాశాలల కు ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది. 17వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. తాజాగా డిసెంబర్ చివరి వారంలో క్రిస్మస్ సెలవుల్లో స్కూళ్లకు అదనంగా మూడు రోజుల సెలవు అదనంగా వచ్చాయి. వరుసగా బాక్సింగ్‌డే, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మరణంతో డిసెంబర్‌ చివరలో వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. తాజా సెలవుల ప్రకారం సంక్రాంతి హాలీడేస్ తరువాత 18న తిరిగి విద్యా సంస్థలు ప్రారంభం అయినా.. మరుసటి రోజు 19న ఆదివారం కావటంతో మరో సెలవు దక్కనుంది. సంక్రాంతి సెలవు తర్వాత పాఠశాల విద్యార్థులకు అసెస్‌మెంట్ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు జనవరి 29లోగా, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 28లోగా ఈ పరీక్షలు నిర్వహించాలని పాఠశాలలకు ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 2025 ఏడాదికి సంబంధించి సాధారణ , ఆప్షనల్ సెలవుల జాబితాను కూడా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్ హాలిడేస్‌ జాబితాలో ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu