తెలంగాణలో చైనా మాంజా అమ్మితే ఐదేండ్ల జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల సిటీలో జరిపిన సోదాల్లో 15 లక్షల విలువైన 1,500 చైనీస్ మాంజాలను సీజ్ చేశామని ఆయన తెలిపారు. అలాగే, గురువారం జరిపిన తనిఖీల్లో 12 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 2024 లో 37 లక్షల విలువ గల చైనీస్ మాంజాలను స్వాధీనం చేసుకున్నామని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లంగర్ హౌస్ పరిధిలో బైక్ పై వెళ్తున్న ఒక ఆర్మీ జవాను చైనా మాంజా గొంతుకు చుట్టుకొని చనిపోయాడని, ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగొద్దని సిటీలోని పతంగుల షాపుల్లో తనిఖీలు జరుపుతున్నామని డీసీపీ వెల్లడించారు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ లో చైనీస్ మాంజాను నిషేధించారని, చైనీస్ మాంజా హ్యూమన్ సేఫ్టీకి ప్రమాదకరమని తెలిపారు. నిషేధించిన చైనా మాంజాను ప్రజలు వినియోగించద్దని సూచించారు. నిబంధనలు పాటించని విక్రయదారులకు ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, సెక్షన్ 15 ప్రకారం ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంటుందని తెలిపారు. చైనా మాంజా వల్ల పక్షులు, మనుషులు, పర్యావరణానికి ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం పోతున్నాయని చెప్పారు. దేశీయంగా తయారు చేసే మాంజా కూడా మార్కెట్లో అందుబాటులో ఉందని, చైనీస్ మాంజా కు బదులు దేశీయ మాంజాను వినియోగించాలని డీసీపీ సూచించారు. చైనీస్ మాంజాను ఎవరైనా విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. చైనా మాంజా తనిఖీలపై స్పెషల్ డ్రైవ్ నిత్యం జరుగుతూనే ఉంటుందని తెలిపారు.
తెలంగాణలో చైనా మాంజాపై నిషేధం !
by Telugu Lo Computer at January 04, 2025
Labels:
500 చైనీస్ మాంజాలను సీజ్
,
అమ్మితే ఐదేండ్ల జైలు శిక్షతో పాటు
,
టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు
,
తెలంగాణలో చైనా మాంజాపై నిషేధం
,
లక్ష రూపాయల జరిమానా
,
సిటీలో జరిపిన సోదాల్లో 15 లక్షల విలువైన 1
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment