Posts

Showing posts with the label 'అన్నల్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌' జర్నల్‌

శరీర ఉష్ణోగ్రత పెరిగితే గుండెకు హాని కలుగుతుందా ?

Image
శ రీర ఉష్ణోగ్రత పెరిగితే గుండెకు  హాని జరుగొచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 20 మంది యువ ఆరోగ్యవంతులు, 21 మంది ఆరోగ్యంగా ఉన్న నడి వయస్కులు, 20 మంది కరోనరీ ఆర్టెరీ డిసీజ్‌ తో బాధ పడుతున్న వృద్ధులపై చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. శరీర ఉష్ణోగ్రత పెరిగితే గుండె గోడలకు రక్త ప్రవాహం పెరుగుతుందని, ఫలితంగా గుండె ఒత్తిడికి గురవుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. గుండెపై ఒత్తిడిని నిరోధించేందుకు చల్లని ప్రదేశాల్లో ఉండటం శ్రేయస్కరమని తెలిసింది. 'అన్నల్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌' జర్నల్‌ లో ఈ మేరకు సదరు అధ్యయన నివేదిక ప్రచురితమైంది.