Posts

Showing posts from 2025

పురాతన వస్తువుల విభజన కోసం ఎనిమిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు !

Image
ఆం ధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల మధ్య పురాతన వస్తువుల విభజన కోసం కొత్త కమిటీ ఏర్పాటు అయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మ్యూజియంలో ఉంచిన పురాతన వస్తువుల విభజన కోసం ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం -2014 నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య వస్తువుల పంపకం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఛైర్ పర్సన్‌గా రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక కమిషన్ ఛైర్ పర్సన్ తేజస్వీ పొడపాటి ని నియమించడం జరిగింది. కన్వీనర్‌గా పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది. కమిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చరిత్ర విభాగ విశ్రాంత హెచ్ వోడీ ప్రొఫెసర్ వకులా భరణం రామకృష్ణతో పాటు పురావస్తు శాఖ, మ్యూజియంలో ఉన్నత హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు అధికారులు ఉన్నారు. పురాతన వస్తువుల విభజన కోసం తెలంగాణ రాష్ట్ర కమిటీలతో కొత్తగా ఏర్పాటైన కమిటీ సమావేశం కానుంది. రాష్ట్రానికి చెందిన పురాతన వస్తువులను గుర్తించి, ఎంపిక, పర్యవేక్షణ, పంపిణీకి ఈ కమిటీ చర్యలు తీసుకోనుంది. పురాతన వస్తువులను రాష్ట్రానికి బద...

టీసీఎల్ నోట్ ఏ 1 నెక్స్ట్ పేపర్ టాబ్లెట్ విడుదల

Image
టీ సీఎల్ కంపెనీ నోట్ ఏ 1 నెక్స్ట్ పేపర్ ను విడుదల చేసింది. ఇది ఒక అత్యాధునిక డిజిటల్ నోట్-టేకింగ్ టాబ్లెట్, ఇది కాగితంపై రాసినట్లు సహజమైన అనుభూతిని ఇస్తూ, కళ్లకు హాని కలిగించకుండా రూపొందించారు. ఈ ట్యాబ్లెట్ ప్రధానంగా విద్యార్థులు, ప్రొఫెషనల్స్, క్రియేటివ్ వర్కర్ల కోసం రూపొందించారు. స్క్రీన్లపై ఎక్కువ గంటలు చదవడం, నోట్స్ తయారు చేయడం, స్కెచింగ్ చేసే యూజర్ల కోసం ఈ కొత్త హ్యాండ్ సెట్ తీసుకొచ్చారు. టాబ్లెట్ పెద్ద డిస్ప్లే, స్టైలస్ సపోర్ట్, AI- ఆధారిత ఫీచర్లను కలిగి ఉంది. 11.5-అంగుళాల కాన్వాస్ కలర్ డిస్ప్లేను 1,440×2,200 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఈ ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్, 3:2 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఈ డిస్ప్లే 300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 16.7 మిలియన్ కలర్స్ కు మద్దతు ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇంకా, ఇది TÜV-సర్టిఫైడ్ ఐ కంఫర్ట్, 2.44 శాతం బ్లూ లైట్ ఎమిషన్ తగ్గింపు కోసం SGS సర్టిఫికేషన్‌తో వస్తుంది. MediaTek G100 ప్రాసెసర్‌ను కలిగి ఉంది, ఇది 8GB RAM, 256GB స్టోరేజ్ తో వస్తోంది. నోట్-టేకింగ్, స్కెచింగ్ కోసం,  13-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎం...

పీపల్ కోటి సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు : 60 మందికి గాయాలు

Image
ఉ త్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో టీహెచ్డీసీ నిర్మిస్తున్న విష్ణుగఢ్ - పీపల్ కోటి జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన పీపల్ కోటి సొరంగంలో మంగళవారం అర్థరాత్రి రెండు లోకోమోటివ్ రైళ్ళు ఢీకొన్నాయి. షిఫ్ట్ మార్తున్న సమయంలో కార్మికులు, అధికారులను తీసుకెళుతున్న రైలు, నిర్మాణ సామాగ్రితో వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో రైల్లో 109 మందికి పైగా కార్మికులు, అధికారులు ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో సొరంగం లోపల కార్మికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. చీకటిగా ఉండే సొరంగం లోపల ఈ ప్రమాదం జరగడంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో మొత్తం 60 మందికి గాయాలు కాగా, వారిలో 10 మందిని గోపేశ్వర్‌లోని జిల్లా ఆసుపత్రికి, మరో 17 మందిని పీపలో కోటిలోని వివేకానంద ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. సమాచారం అందిన వెంటనే జిల్లా మెజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. లోపల చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని, ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా అలకనంద నదిపై 444 మెగావాట్ల సామర్థ్య...

స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మూడో దశను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో

Image
స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మూడో దశను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని సాలిడ్ మోటార్ స్టాటిక్‌ టెస్ట్‌ కేంద్రంలో మంగళవారం ఈ ప్రయోగం నిర్వహించింది. మూడు-దశల ఆల్-సాలిడ్ లాంచ్ వెహికల్ ఎస్‌ఎస్‌ఎల్వీ పనితీరును విశ్లేషించడంతోపాటు డేటాను సేకరించినట్లు ఇస్రో వెల్లడించింది. అంతరిక్షంలోకి చిన్న ఉపగ్రహాలను వేగంగా ప్రయోగించడం కోసం దీనిని రూపొందించారు. అధిక స్థాయిలో ఉత్పత్తికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. పేలోడ్‌కు సెకనుకు 4 కిలోమీటర్ల వేగాన్ని అందించడంలో ఎస్‌ఎస్‌-3 కీలకపాత్ర పోషిస్తుందని, పేలోడ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చేసిన అప్‌గ్రేడ్‌లు ఈ దశలో మెరుగైన ఇగ్నైటర్, నాజిల్‌ డిజైన్‌ ఉపగ్రహాల సామర్థ్యం, నిర్మాణాత్మక దృఢత్వాన్ని పెంచినట్లు తెలిపారు. ఈ పరీక్షలో ఒత్తిడి, థ్రస్ట్, ఉష్ణోగ్రత, వైబ్రేషన్, యాక్యుయేటర్ పనితీరు వంటి విషయాలను పరిశీలించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మడతపెట్టే ఎలక్ట్రిక్ మోపెడ్ టాటామెల్ ను విడుదల చేసిన ఐకోమా కంపెనీ

Image
జ పనీస్ కంపెనీ ఐకోమా ఆశ్చర్యపరిచేలా ఎలక్ట్రిక్ మోపెడ్ ను సృష్టించింది. ఈ కంపెనీ మడతపెట్టే, ఉపయోగంలో లేనప్పుడు సూట్‌కేస్ లాగా మారే ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ మోపెడ్ టాటామెల్ ను విడుదల చేసింది. దీనికి దిగువన చక్రాలు కూడా ఉన్నాయి, కాబట్టి దీన్ని సాధారణ సూట్‌కేస్ లాగా తీసుకెళ్లొచ్చు. మడతపెట్టి ఇంటి లోపలికి కూడా తీసుకెళ్లవచ్చు. ఈ మోపెడ్ ను డిజైనర్ తకామిట్సు ఐకోమా రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ అతిపెద్ద హైలైట్ దాని మడతపెట్టే డిజైన్. మీరు దీన్ని నడుపుతున్నప్పుడు, ఇది ఒక చిన్న స్కూటర్‌ను పోలి ఉంటుంది. కానీ దీన్ని మడతపెట్టినప్పుడు, ఇది కేవలం 27 x 27 x 10 అంగుళాలకు పరిమితమవుతుంది. దీని బరువు 63 కిలోగ్రాములు. కాబట్టి దానిని ఎత్తలేరు, కానీ చక్రాలు కింద ఉండటంతో దానిని సూట్‌కేస్ లాగా లిఫ్ట్, ఆఫీస్ లేదా అపార్ట్‌మెంట్‌లోకి సులభంగా లాగొచ్చు. ఇది గంటకు 45 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది 2,000W వరకు శక్తిని అందించగల 600W మోటారును కలిగి ఉంది. సురక్షితమైన LiFePO₄ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బైక్ 100 కిలోగ్రాముల వరకు బరువును మోస్తుం...

సంపన్న కస్టమర్ల కోసం ప్రీమియం మెటల్‌ 'గజ్' క్రెడిట్‌ కార్డును ప్రవేశపెట్టిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌

Image
ఐ డీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ తాజాగా గజ్ పేరిట సంపన్న కస్టమర్ల కోసం ప్రీమియం మెటల్‌ కార్డును ప్రవేశపెట్టింది. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ కస్టమర్ల కోసం ఉద్దేశించిన ఈ కార్డుపై జాయినింగ్, వార్షిక ఫీజు రూ. 12,500గా (జీఎస్‌టీ అదనం) ఉంటుంది. 12,500 ఇన్విటేషన్ రివార్డు పాయింట్లతో ఇది లభిస్తుంది. ఒక రివార్డు పాయింటు ఒక రూపాయికి సమానంగా ఉంటుంది. వీటిని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ యాప్‌ ద్వారా ట్రావెల్‌ బుకింగ్స్‌పై రిడీమ్‌ చేసుకోవచ్చు. వార్షికంగా రూ. 10 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. జీరో ఫారెక్స్‌ మార్కప్, గ్లోబల్‌ ఏటీఎంలలో వడ్డీరహితంగా నగదు లభ్యత, రూ. 50,000 వరకు విలువ చేసే ట్రిప్‌ క్యాన్సిలేషన్‌ కవరేజీ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. ప్రీమియం మెటల్‌ క్రెడిట్‌ కార్డుల త్రయం 'అశ్వ-మయూర-గజ'లో భాగంగా ఇది ఉంటుందని బ్యాంకు పేర్కొంది.

ఎస్సీ వర్గాల లబ్ధిదారులకు ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ రుణాలపై వడ్డీ మాఫీ

Image
ఆం ధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గాల లబ్ధిదారులకు చెందిన ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ రుణాలపై వడ్డీ మాఫీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని వందల పేద ఎస్సీ కుటుంబాలకు భారీ ఉపశమనం లభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం రూ.41.61 కోట్ల వడ్డీ రుణ భారాన్ని మాఫీ చేయాలని నిర్ణయించారు. ఇది మొత్తం 11,479 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చనుంది. అయితే, ఈ మాఫీ పొందాలంటే లబ్ధిదారులు తమ అసలు రుణ మొత్తాన్ని నాలుగు నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ , నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పథకాల కింద ఇచ్చిన రుణాలపై పేరుకుపోయిన వడ్డీని మాఫీ చేయడం ద్వారా ఈ లబ్ధిదారులు మళ్లీ కొత్త రుణాలకు అర్హులవుతారు. ఇది వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. వడ్డీని మాఫీ చేయడం ద్వారా ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు ప్రారంభించుకోగలరు. వారి ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రభుత్వం ఈ మాఫీ కోసం నాలుగు నెలల్లో అసలు చెల్లించాలనే కండీషన్ పెట్టడం ద్వారా ...

అల్లుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మామ !

Image
ఆం ధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా వెంకటగిరిలో భార్య కోసం అత్తింటికి వెళ్లిన అల్లుడిపై మామ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వివరాల ప్రకారం పాపన హరిప్రసాద్‌ (32), లక్ష్మీ మౌనిక దంపతుల మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య లక్ష్మీ మౌనిక అలిగి పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో భార్య, పిల్లలను తీసుకెళ్లేందుకు హరిప్రసాద్‌ శుక్రవారం అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ మాటా మాటా పెరిగింది. ఈ సమయంలో మామ అల్లుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గమనించిన స్థానికులు వెంటనే హరిప్రసాద్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శరీరం సుమారు 70 శాతం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఒకసారి ఛార్జ్‌తో 1008 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించిన రెనాల్ట్ ఫిలాంటే రికార్డ్ 2025

Image
రె నాల్ట్ ఫిలాంటే రికార్డ్ 2025 డెమో కారు మైలేజీలో అదరగొట్టింది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒకే ఛార్జ్‌తో 1008 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించింది. ఈ కారు ఈ దూరాన్ని ల్యాబ్ పరీక్షలో కాదు, స్థిరమైన హైవే వేగంతో ప్రయాణించింది. డిసెంబర్ 18న మొరాకోలోని UTAC టెస్ట్ సర్క్యూట్‌లో రెనాల్ట్ ఈ రికార్డును సాధించింది. ఫిలాంటే రికార్డ్ 2025 సగటు వేగంతో గంటకు 102 కి.మీ. ప్రయాణించింది. ఈ కారు మొత్తం 1,008 కి.మీ. ప్రయాణాన్ని 9 గంటల 52 నిమిషాల్లో పూర్తి చేసింది. ఈ రికార్డును ప్రత్యేకంగా నిలబెట్టేది దాని బ్యాటరీ. ఫిలాంటే రికార్డ్ 2025 87 kWh బ్యాటరీని ఉపయోగిస్తుంది. ఇది రెనాల్ట్ సీనిక్ E-టెక్ ఎలక్ట్రిక్‌లో కూడా అందించారు. తేడా బ్యాటరీ పరిమాణంలో కాదు, శక్తి సామర్థ్యంలో ఉంది. ఈ డెమో కారు 100 కి.మీ.కు కేవలం 7.8 kWh శక్తి వినియోగాన్ని నమోదు చేసింది. ఇది నేటి EVల కంటే చాలా తక్కువ. ఇది మాత్రమే కాదు, 1,008 కి.మీ నడిపిన తర్వాత కూడా, బ్యాటరీకి ఇంకా 11% ఛార్జ్ మిగిలి ఉంది, దీని కారణంగా కారు సైద్ధాంతికంగా గంటకు 100 కి.మీ కంటే ఎక్కువ వేగంతో దాదాపు 120 కి.మీ ఎక్కువ ప్రయాణిస్తుంది. పెద్ద బ్యాటరీని ఇన్‌స్టాల్ చేయడానికి బదులుగా, ర...

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన న్యూజిలాండ్

Image
న్యూ జిలాండ్ 2026కు సాయంత్రం 4.30 గంటలకు ( భారత కాలమాన ప్రకారం) ఘనంగా స్వాగతం పలికింది. అక్లాండ్‌లో పెద్ద ఎత్తున ఫైర్ క్రాకర్స్ కాల్చి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అక్లాండ్‌లోని ప్రతిష్టాత్మక స్కై టవర్‌పై ఫైర్ క్రాకర్ వెలుగులు అందర్ని ఆకర్షించాయి. న్యూజిలాండ్ తర్వాత పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశాలతో పాటు ఆస్ట్రేలియా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాయి. చిట్టచివరిగా న్యూఇయర్ సెలబ్రేట్ చేసే దేశంగా అమెరికా ఉంది. నిజానికి న్యూజిలాండ్ కన్నా ముందే పసిఫిక్ దేశమైన కిరిబాటిలో మధ్యాహ్నం 3.30 గంటలకే న్యూఇయర్ వస్తుంది. సాయంత్రం 6.30 గంటలకు ఆస్ట్రేలియా, రాత్రి 8.30 గంటలకు జపాన్, ఉత్తర, దక్షిణ కొరియాలో, రాత్రి 9.30 గంటలకు చైనా, మలేషియా, సింగపూర్, హాకాంగ్, ఫిలిప్పీన్స్, రాత్రి 10.30 గంటలకు థాయిలాండ్, వియత్నాం, కాంబోడియాలలో కొత్త సంవత్సరం వస్తుంది. 

వొడాఫోన్ ఐడియాకు ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం !

Image
రు ణాల భారం, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వొడాపోన్ ఐడియాకు కేంద్ర ప్రభుత్వం ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం బకాయిలను రూ.87,695 కోట్లకు సర్దుబాటు చేసి స్తంభింపచేసింది. 2032-41 మధ్య రూ.87,695 కోట్ల బకాయిలను చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. ఏజీఆర్ సంబంధిత అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలించాలని 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 20 కోట్ల మంది వొడాఫోన్ ఐడియా వినియోగదారుల ప్రయోజనాలకు రక్షణ ఏర్పడుతుందని, టెలికాం రంగం మనుగడ, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచేందుకు ఒక లైఫ్‌లైన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. వొడాఫోన్ ఐడియాలో భారత ప్రభుత్వానికి సుమారు 49 శాతం వాటా కూడా ఉంది.

రెండు హైవే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం : పీఎం ఆవాస్ యోజన కోసం 5,36,137 కోట్లను కేటాయించిన కేంద్రం

Image
దే శంలోని రెండు హైవేల నిర్మాణానికి కేబినెట్‌ మంత్రివర్గం తెలిపింది. నాసిక్ సోలాపూర్ హై స్పీడ్ కారిడార్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 19,142 కోట్ల రూపాయలతో 374 కిలోమీటర్ల సూరత్ చెన్నై హై స్పీడ్ కారిడార్ నిర్మాణం జరగనుంది. చెన్నై సూరత్ హై కారిడా నిర్మాణంతో 45 శాతం ప్రయాణ సమయం తగ్గనుంది. 31 గంటల నుంచి 17 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. చెన్నై - సూరత్ కారిడార్ నిర్మాణంలో భాగంగా కర్నూల్, కడప మీదుగా జాతీయ రహదారి వెళ్లనుంది. చెన్నై పోర్టు, హజీరా పోర్టుకు కనెక్టివిటీ పెరుగనుంది. కొప్పర్తి, ఓర్వకల్ పారిశ్రామిక ఇండస్ట్రియల్ కారిడార్లకు హై స్పీడ్ నెట్‌వర్క్‌ ఉపయోగపడనుంది. రెండేళ్లలో రోడ్డు నిర్మాణం పూర్తికానుంది. ఒడిశాలోని జాతీయ రహదారి 326 వెడల్పు, బలోపేతం కోసం రూ.1526 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, 2024 జూన్ నుంచి రైల్వే, హైవే, మెట్రో, వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 12.6 లక్షల రూపాయల నిధులను కేబినెట్‌ కేటాయించింది. 43 రైల్వే ప్రాజెక్టుల కోసం 1,52,583 కోట్ల రూపాయలను కేటాయించింది. 24 జాతీయ రహదారుల న...

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Image
ఆం ధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో చలిగాలులు తీవ్రంగా వీచుతున్నాయి. తెల్లవారుజామున బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ముఖ్యంగా పల్లెలు, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో కోల్డ్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. చలితో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. రాబోయే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై స్పష్టమైన నివేదికను విడుదల చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫియర్‌ స్థాయిలో ఉత్తర-ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉత్తర కోస్తా, యానాంల్లో ప్రధానంగా పొడి వాతావరణం కొనసాగనుంది. బుధవారం, గురువారం రోజుల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్...

రాజస్థాన్ లో ఉగ్ర కుట్ర భగ్నం? : పేలుడు పదార్థాలు ఉన్న కారు స్వాధీనం

Image
రా జస్థాన్ టోంక్‌ జిల్లాలో పేలుడు పదార్థాలు ఉన్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ సంచులతో ఉన్న కారును సీజ్‌ చేశారు. 200 కాట్రేడ్జిలు, ఐదు బండిల్స్‌ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బరోని పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. నిందితులు బుండీ నుండి టోంక్‌కు పేలుడు పదార్థాలను తరలిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో సురేంద్ర మోచి, సురేంద్ర పట్వాలను అరెస్ట్ చేసిన పోలీసులుపలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ మృత్యుంజయ మిశ్రా మాట్లాడుతూ నిఘా వర్గాల సమాచారం మేరకు పెద్ద ఆపరేషన్ చేపట్టామని వాహనం నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని కేసులో అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, అమోనియం నైట్రేట్‌ను పేలుడు పదార్థాలతో కలిపి వాడతారు. గత నెల ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో ఉపయోగించారు. ఆ ఘటనలో 15 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

హరీశ్ రావు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు : మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి

Image
ప దేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు పూర్తి చేసిందో చెప్పాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. 'జగన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది మీరే కదా. రోజా ఇంటికి వెళ్లి కేసీఆర్‌ ఏం మాట్లాడారో గుర్తు లేదా? నీళ్లను ఏపీ వాడుకుంటే తప్పేముందని అనలేదా?' అని ప్రశ్నించారు. హరీశ్ రావు తెలివి లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్‌ విమర్శించారు. భారీ బడ్జెట్‌లతో చేపట్టిన ప్రాజెక్టులు కేవలం కమీషన్ల కోసమేనని, క్షేత్రస్థాయిలో రైతులకు జరిగిన మేలు శూన్యమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ అనుసరించిన విధానాల వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నీళ్ల విషయంలో చరిత్ర సృష్టిస్తామని, రాష్ట్ర ముఖచిత్రం మారుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర సాగునీటి రంగంపై తమ ప్రభుత్వానికి స్పష్టమైన దార్శనికత ఉందని మంత్రి స్పష్టం చేశారు. నీళ్ల విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి, చరిత్ర సృష్టించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. ప్రతి ఎకరాకు నీరు అందించడమే తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని మంత్రి ఉత్తమ్‌ పునరుద్ఘాటించారు. 

తెలంగాణలో యూరియా పంపిణీకి ప్రత్యేక అధికారులు నియామకం

Image
తె లంగాణలో యాసంగి సీజన్‌లో యూరియా పంపిణీకి ప్రత్యేక అధికారులను నియమిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా ప్రత్యేక అధికారులు మానిటరింగ్ చేయనున్నారు. అడిషనల్ డైరెక్టర్లు విజయ్ కుమార్, నర్సింహారావు, జేడీఏలు ఎస్.గీత, ఆశాకుమారి, సుచరిత, బాలు, శైలజ, డీడీఎంలు చంద్రశేఖర్, కనురాజులకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కొక్క ప్రత్యేక అధికారికి నాలుగైదు జిల్లాల చొప్పున బాధ్యతలు అప్పగిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద యూరియా యాప్ కొనసాగుతున్న ఐదు జిల్లాలు కాకుండా మిగతా జిల్లాల్లో కూడా యూరియా సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. యూరియా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా పంపిణీ చేసేలా ప్రత్యేక అధికారులు జిల్లాలో పర్యటించి మానిటరింగ్ చేయనున్నారు.

రైల్‌వన్‌ యాప్‌లో టికెట్లనుకొనుగోలు చేస్తే 3శాతం డిస్కౌంట్‌ !

Image
రై ల్‌వన్‌ యాప్‌ ద్వారా టికెట్టు కొనుగోలు చేస్తున్న ప్రయాణీకులకు రాయితీ ప్రకటించింది. డిజిటల్‌ పేమెంట్‌ మోడల్‌లో రైల్‌వన్‌ యాప్‌ ద్వారా అన్‌రిజర్వుడు టికెట్లను కొనుగోలు చేస్తే 3శాతం డిస్కౌంట్‌ అందించనున్నట్లు తెలిపింది. ఈ స్పెషల్ ఆఫర్‌ జనవరి 14 నుంచి జులై 14 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం రైల్‌వన్‌ యాప్‌లో ఆర్‌-వాలెట్‌ ద్వారా టికెట్‌ కొనుగోళ్లపై వస్తున్న క్యాష్‌బ్యాక్‌ యథాతథం గా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇతర వేదికలపై కొనుగోలు చేసే అన్‌రిజర్వుడు టికెట్‌లకు ఈ ఆఫర్‌ వర్తించదని క్లారిటీ ఇచ్చింది. డిజిటల్‌ టికెట్ల కొనుగోళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైల్‌వన్‌ యాప్‌ ద్వారా అన్‌రిజర్వుడు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను ఏ డిజిటల్ పేమెంట్ విధానం (యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, నెట్ బ్యాంకింగ్) ద్వారా కొనుగోలు చేసినా ఈ 3 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. రైలు టికెట్‌, ప్లాట్‌ఫామ్‌ టికెట్‌, ట్రైన్‌లైవ్‌ ట్రాకింగ్‌, జర్నీలో ఫుడ్‌ బుకింగ్‌ ఇవన్నీ ఒక్క చోట అందించే ఉద్దేశంతో భారతీయ రైల్వే 'రైల్‌వన్‌ యాప్‌'ను అందుబాటు లోకి తీసుకొచ్చింది. ఈ ...

లెనోవో 100e క్రోమ్‌బుక్ విడుదల

Image
లె నోవో రూ.15,000 లోపే బెస్ట్ ఫీచర్లతో లెనోవో 100e క్రోమ్‌బుక్ జెన్ 4 మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు, ఆఫీస్ అవసరాల కోసం ప్రాథమిక పనులు చేసుకునే వారికి ఇది ఒక మంచి ఛాయిస్ గా నిలుస్తుంది. ఈ ల్యాప్‌టాప్ గూగుల్ క్రోమ్ ఓఎస్ పై పనిచేస్తుంది. ఇది కేవలం 10 సెకన్లలోనే బూట్ అవుతుంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వేలాది ఆండ్రాయిడ్ యాప్‌లను నేరుగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.వినియోగదారుల పనిని మరింత సులభతరం చేసేందుకు ఇందులో జెమినీ ఏఐ టూల్ సపోర్ట్‌ను కూడా లెనోవో అందించింది. ప్రయాణాల్లో, తరగతి గదుల్లో వాడుకోవడానికి వీలుగా దీనిని చాలా తేలికగా రూపొందించారు. స్క్రీన్: 11.6 అంగుళాల HD డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.దీనికి యాంటీ-గ్లేర్ ప్యానెల్ ఉండటం వల్ల కళ్ళపై ఒత్తిడి పడదు మరియు వెలుతురులో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది 1.23 కిలోల బరువు మాత్రమే ఉంటుంది, కాబట్టి బ్యాగులో సులభంగా మోసుకెళ్లవచ్చు. సాధారణ మల్టీటాస్కింగ్, వెబ్ బ్రౌజింగ్ కోసం ఇందులో మెరుగైన హార్డ్‌వేర్‌ను అమర్చారు. మీడియాటెక్ కొంపానియో 528 చిప్‌సెట్‌తో ఇది పనిచేస్తుంది. 4GB RAM & 64GB eMMC స్టోరేజ్‌ను కలిగి ఉం...

గ్రెగ్ అబెల్‌ చేతికి బెర్క్‌షైర్ హాత్వే పగ్గాలు

Image
వా రెన్ బఫెట్ నుంచి బెర్క్‌షైర్ హాత్వే బాధ్యతలను గ్రెగ్ అబెల్ ఈ వారం చివరలో అధికారికంగా చేపట్టనున్నారు. 1962లో కేవలం ఒక చిన్న టెక్స్‌టైల్‌ మిల్లుగా ప్రారంభమైన బెర్క్‌షైర్‌ను నేడు ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా నిలిపేందుకు బఫెట్ ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో బఫెట్‌ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అబెల్ ముందున్న అతిపెద్ద సవాలు. గత ఆరు దశాబ్దాల్లో బఫెట్ బెర్క్‌షైర్‌ను ఒక సామ్రాజ్యంగా మార్చారు. గీకో, నేషనల్ ఇండెమ్నిటీ వంటి బీమా సంస్థలు, డెయిరీ క్వీన్, బీఎన్‌ఎస్‌ఎఫ్‌ రైల్ రోడ్ వంటి దిగ్గజ కంపెనీలను కొనుగోలు చేశారు. యాపిల్, కోకాకోలా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థల్లో వారెన్‌ బఫెట్‌ చేసిన దీర్ఘకాలిక పెట్టుబడులు అపారమైన లాభాలను తెచ్చిపెట్టాయి. గత 20 ఏళ్లలో 60 బిలియన్‌ డాలర్లకు పైగా దానం చేసినప్పటికీ, బఫెట్ వ్యక్తిగత సంపద నేడు సుమారు 150 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2018 నుంచి బెర్క్‌షైర్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న 62 ఏళ్ల గ్రెగ్ అబెల్, బఫెట్ కంటే భిన్నమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అబెల్ ఇటీవల నెట్ జెట్స్ సీఈఓ ఆడమ్ జాన్సన్‌ను కంపెనీ సర్వీస్, రిటైల్ విభాగాలకు హెడ్‌గా నియమి...

పూర్తిగా దగ్ధమైన కేరళ స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ బస్సు : ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు

Image
కే రళలోని కొట్టాయంలో కేరళ స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. అయితే అదృష్టవశాత్తూ అందులోని ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. మలప్పురం డిపోకు చెందిన సూపర్‌ డీలక్స్‌ బస్సు 28 మంది ప్రయాణికులతో పతనంతిట్టలోని గవికి వెళ్తోంది. బస్సు రన్ని మీదుగా గవికి వెళ్తుండగా మణిమల సమీపంలోని పజాయిడంలో గల కున్నతుపుళ ప్రాంతానికి రాగానే బస్సు ప్రమాదానికి గురైంది. ముందుగా వెనుకసైడు లెఫ్ట్‌ టైర్‌ నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. డ్రైవర్‌ బస్సును ఆపడంతో అంతా కిందకు దిగారు. ప్రయాణికుల లగేజ్‌ను కూడా తొలగించారు. ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో కేఎస్‌ఆర్‌టీసీ ప్రయాణికుల కోసం మరో బస్సును ఏర్పాటు చేసింది. వారంతా కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో బడ్జెట్‌ ట్రిప్‌కు వెళ్తున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. ఈ మేరకు ఘటనపై కేసు న...

నైమెసులైడ్‌పై ట్యాబ్లెట్లు, సిరప్‌ల తయారీ, విక్రయాలు, పంపిణీపై నిషేధం విధించిన కేంద్రం

Image
నొప్పి, జ్వరానికి వాడే నైమెసులైడ్ 100 మిల్లీగ్రాములకుపైగా డోస్ ఉన్న ఇమిడియట్ రిలీస్ ట్యాబ్లెట్లు, సిరప్‌ల తయారీ, విక్రయాలు, పంపిణీపై పూర్తిగా నిషేధించింది. ఈ నిర్ణయం డిసెంబర్ 29, 2025 నుంచి తక్షణమే అమల్లోకి వస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్-1940లోని సెక్షన్ 26ఏ కింద, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్‌తో సంప్రదించిన అనంతరం ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపింది. 100 మిల్లీగ్రాములకంటే అధిక మోతాదులో ఉన్న నైమెసులైడ్ మందులు మన ఆరోగ్యానికి ప్రమాదకరమని, అదే విధంగా పని చేసే సురక్షిత మెడిసిన్ అందుబాటులో ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మందు వాడకంతో లివర్‌కు హాని కలిగే అవకాశాలు ఉన్నాయని గత కొన్నేళ్లుగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే తక్కువ మోతాదులోని నైమెసులైడ్ మందులు, అలాగే ఇతర జ్వర-నొప్పి నివారణ ఇతర మెడిసిన్ మార్కెట్‌లో కొనసాగుతాయి. ఈ నిర్ణయంతో నైమెసులైడ్ ఆధారిత మందులు తయారు చేస్తున్న కంపెనీలు.. ఉత్పత్తిని నిలిపివేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్టాక్‌ను వెనక్కి పిలిపించుకోవాలి. పెద్ద ఔషధ సంస్థలపై ఈ నిర్ణయ ప్రభావం స్వల్పంగానే ఉం...

27,036 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిన హీరో డెస్టినీ 125 స్కూటర్‌

Image
హీరో మోటోకార్ప్ యువతను ఆకర్షించే ఉద్దేశంతో జూమ్ 110, జూమ్ 125, జూమ్ 160 వంటి కొత్త తరం స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. డిజైన్, ఫీచర్లు, స్పోర్టీ లుక్ పరంగా ఇవి ఆధునికంగానే ఉన్నప్పటికీ, అమ్మకాల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోయాయి. హోండా, సుజుకి, యమహా, టీవీఎస్ లాంటి బ్రాండ్లు ఇప్పటికే బలమైన నమ్మకం, పెద్ద కస్టమర్ బేస్‌తో మార్కెట్‌ను పట్టుకుని ఉండటమే హీరోకు ప్రధాన సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో హీరోకు ఊరటనిచ్చింది డెస్టిని 125 కొత్త వెర్షన్. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ఫ్యామిలీ స్కూటర్‌గా పొజిషన్ చేసిన ఈ మోడల్‌కు తాజాగా ఇచ్చిన డిజైన్ అప్‌డేట్స్, మెరుగైన లుక్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. డెస్టిని రూపురేఖల్లో చేసిన మార్పులు హీరో షోరూమ్‌లకు జనాన్ని రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీని ప్రభావం అమ్మకాల గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నవంబర్‌లో మాత్రమే డెస్టిని 125 మొత్తం 27,036 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే నెలలో, అంటే నవంబర్ 2024లో కేవలం 8,875 యూనిట్లకే పరిమితమైంది. అంటే ఏడాది వ్యవ...

లిఫ్ట్ ఇస్తామని నమ్మించి కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు !

Image
ఢి ల్లీకి సమీపంలోని ఫరీదాబాద్‌లో లిఫ్ట్ ఇస్తామని నమ్మించి ఒక యువతిని కారులోకి ఎక్కించుకున్న ఇద్దరు దుండగులు, కదిలే కారులోనే రెండు గంటల పాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేసి, తల పగలగొట్టి అర్థరాత్రి సమయంలో రోడ్డుపై పడేసి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు తన తల్లితో గొడవపడి, తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో మెట్రో చౌక్ వద్ద ఆటో కోసం వేచి చూస్తోంది. ఆ సమయంలో ఓ కారులో వచ్చిన ఇద్దరు యువకులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి కారులోకి ఎక్కించుకున్నారు. నిందితులు కారును ఫరీదాబాద్ నుండి గురుగ్రామ్ రోడ్డు వైపు తీసుకెళ్లారు. సుమారు రెండు గంటల పాటు కారును రోడ్డుపై తిప్పుతూనే ఉన్నారు. ఒకడు కారు నడుపుతుండగా, మరొకడు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతి గట్టిగా ఎదిరించడంతో ఆమెను విపరీతంగా కొట్టారు. ఆ దాడిలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. అనంతరం బాధితురాలిని కదిలే కారులో నుండి కిందకు తోసేసి నిందితులు పారిపోయారు. ఈ దారుణంపై బాధితురాలు తన సోదరికి సమాచారం అందించగా ఆమె వెంటనే పోలీసులన...

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు

Image
తె లంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో జీహెచ్ఎంసీ, జిల్లా కలెక్టర్ పదవులు, అలాగే పలు ముఖ్య శాఖల కమిషనర్ పోస్టులు ఉండటం గమనార్హం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయడం, పట్టణ మరియు గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుభవజ్ఞులైన అధికారులను కీలక స్థానాల్లో నియమించారు. పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జి. శ్రీజనన్ను హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌ లో అదనపు కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆయనకు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న వినయ్ కృష్ణా రెడ్డిని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా నియమించారు. ఆయన మల్కాజ్గిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లను పర్యవేక్షించనున్నారు. నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక వంటి కీలక అంశాల్లో వీరి పాత్ర అత్యంత కీలకంగా ఉండనుందని అధి...

మత్స్యకారులకు చిక్కిన కలిమొయి చేప

Image
ఆం ధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఋషికొండ తీర ప్రాంతంలో మత్స్యకారులకు అరుదైన చేప జాతికి చెందిన చేప చిక్కింది. శరీరంపై విభిన్నమైన చారలతో ప్రత్యేకంగా కనిపించింది. ఈ చేప తీరానికి చేరేలోగా నిర్జీవంగా మారింది. స్పాటెడ్ మోరే ఈల్స్ గా పిలవబడే ఈ చేపల రకానికి చెందిన జీవిని మన మత్స్యకారులు కలిమొయిగా పిలుస్తారు. చూడ్డానికి ఈ చేప చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని శరీరంపై చిరుత పులి లాంటి చారలు కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా సముద్రంలో లోతైన ప్రాంతాల్లో ఉండే రాళ్ల మధ్య ఆవాసం ఏర్పరుచుకొని ఇవి జీవనం సాగిస్తాయి. ఈ కలిమొయి చేపకు పదునైన దంతాలు ఉంటాయి. ఇది దాదాపుగా 5 మీటర్ల పొడవు వరకు పెరుగుతుందని సముద్ర మత్స్య పరిశోధన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రం లోని లోతైన ప్రాంతంలో జీవించే ఈ చేపలు రాత్రిపూట ఎక్కువగా ఆహార అన్వేషణ చేస్తూ ఉంటాయని, ఇవి వలకు చిక్కడం చాలా అరుదని అధికారులు అంటున్నారు.

కోటా-నాగ్డా సెక్షన్‌లో గంటకు 182 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ : రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

Image
వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. క్రమంగా దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీ- వారణాశి, ఢిల్లీ- పాట్నా, ఢిల్లీ- కోటా వంటి కొన్ని మార్గాలు ప్రాథమికంగా ఎంపిక అయ్యాయి. ఆయా మార్గాల్లో ట్రయల్ రన్స్ సాగుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బిగ్ అప్ డేట్ ఇచ్చారు . వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ వేగానికి సంబంధించిన వీడియోను ఆయన తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. గంటకు 180- 182 కిలో మీటర్ల వేగాన్ని అందుకుందీ ట్రైన్. కోటా-నాగ్డా సెక్షన్‌లో గంటకు 182 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు పరుగులు పెట్టింది. దీన్ని పరీక్షించడానికి వాటర్ టెస్ట్ నిర్వహించారు. నీటితో నింపిన మొత్తం నాలుగు గాజు గ్లాస్ లను దీనికోసం వినియోగించారు. ఒక్క చుక్క నీరు కింద పడకుండా గరిష్టంగా 182 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ దూసుకెళ్లడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. రైలు లోపలి నుండి మొబైల్ స్క్రీన్‌పై గంటకు 182 కి.మీ. వరకు దీనీ వేగం నమోదైంది. అంత వేగంలో కూడా డెక్‌పై అమర్చిన నీటి గ్లాసులు కదలకుండా స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఛైర్ కార...

వార్షిక రిటర్న్‌లు దాఖలు గడువు జనవరి 31 వరకు పొడిగింపు

Image
ఐటీ  వార్షిక రిటర్న్‌లు దాఖలు చేసేవారికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గడువు తేదీని పొడిగించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉత్తర్వుల ప్రకారం ఆర్థిక నివేదికలు, వార్షిక రిటర్న్‌లను దాఖలు చేయడానికి జనవరి 31, 2026 వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు ముగుస్తుంది. అయితే.. ఫైలింగ్ వ్యవస్థలో వస్తున్న టెక్నికల్ ఇబ్బందులు, పండుగలు, ఇతర సెలవుల వల్ల రిటన్న్‌లు దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మని కొన్ని వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తులు దృష్టిలో ఉంచుకొని, కంపెనీలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైలింగ్‌లను అదనపు రుసుము చెల్లించకుండా గడువు తేదీని పొడిగించాలని అధికారికంగా నిర్ణయం తీసుకుంది. 

ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.40 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

Image
ముం బయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. బ్యాంకాక్ నుంచి ముంబయికి వచ్చిన ప్రయాణికులపై అనుమానం వ్యక్తం చేసిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కస్టమ్స్ అధికారులకు రూ.40 కోట్ల విలువైన 40 కేజీల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన 9 మంది స్మగ్లర్లు గంజాయిని లగేజ్ బ్యాగుల్లో దాచి అక్రమంగా తరలించే యత్నం చేశారు. వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని బ్యాగులను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో లగేజ్ బ్యాగుల్లో దాచిన భారీ మొత్తంలో విదేశీ గంజాయి బయటపడింది. వెంటనే గంజాయిని సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేపట్టారు. 

ధనియాల నీరు - ఆయుర్వేదం - ఆరోగ్య ప్రయోజనాలు

Image
ధ నియాల నీరు దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరంలో ఉన్న మురికిని కడిగేసే ఒక సహజ క్లీనర్‌గా పనిచేస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ధనియాలు ‘త్రిదోష హారిణి’. అంటే ఇవి వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తాయి. ముఖ్యంగా శరీరంలో అధిక వేడిని తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో దీనికి సాటిలేదు. ధనియాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి సహజ సిద్ధమైన ‘డైయూరిటిక్’గా పనిచేసి, రక్తంలోని వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపి శరీరాన్ని లోపల నుండి శుభ్రపరుస్తాయి. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి ధనియాల నీరు ఒక వరప్రసాదం. ఇది జఠరాగ్నిని ప్రేరేపించి, ఆహారం సులభంగా అరిగేలా చేస్తుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు రోజూ ఉదయాన్నే ధనియాల నీరు తాగడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి క్రమబద్ధీకరించబడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తారు. రక్తంలోని టాక్సిన్స్ క్లియర్ అవ్వడం వల్ల మొటిమలు తగ్గి, చర్మం సహజ సిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాల రక్షణకు తోడ్పడతాయి. చాలామంది ధనియాల పొడి వాడుతుంటారు, కానీ గింజలు వాడటం ఉత్తమం. రెండు టీస్పూన్ల ధనియాలను ఒక గ్లాసు నీటిలో రా...

కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

Image
తె లంగాణలోని నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద హైవేపై కంటైనర్‌ను వెనుక నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా.. వీరంతా తీర్థయాత్రలకు వెళ్లి వస్తుండగా బస్సు ప్రమాదం జరిగినట్టు సమాచారం. 

వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై

Image
ప్ర పంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. 2024 సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ప్రకారం, ఆసియా ఖండంలోని నగరాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నవి. ఇందులో భారత్ నుంచి నాలుగు నగరాలు చోటు సంపాదించాయి. ఈ నివేదికలో ఆర్థిక వ్యవస్థ, జనాభా, సంపద వంటి అంశాలను బట్టి 230 నగరాలను విశ్లేషించి, 2033 నాటికి ప్రపంచాన్ని ప్రభావితం చేయగల కీలక వృద్ధి కేంద్రాలను గుర్తించారు. ప్రస్తుత ప్రపంచ జనాభాలో 55% మంది నగరాల్లో నివసిస్తుంటారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం, 2050 నాటికి ఈ సంఖ్య 70% కు చేరనుందని, అదనంగా సుమారు 2.5 బిలియన్ల మంది నగరాల్లోకి వలస రావడం ఆశించబడుతోంది. బెంగళూరు : దాదాపు $360 బిలియన్ల జీడీపీతో భారత్ లో అత్యంత ఉత్పాదక నగరంగా గుర్తింపు. ఎలక్ట్రానిక్ సిటీ, ఇంటర్నేషనల్ టెక్ పార్క్, బాగ్మన్ టెక్ పార్క్ వంటి టెక్ హబ్‌లు ఈ నగరాన్ని ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా నిలిపాయి. హో చి మిన్ సిటీ : వియత్నాం ఆర్థిక శక్తి కేంద్రం. జీడీపీ US$121 బిలియన్, జీడీపీ US$9,600. మైనింగ్, సీఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం, నిర్మాణం, పర్యాటకం, ఫైనాన్స్, వాణిజ్యం ...

అసోంలో ఐఎంకే ఉగ్రవాద మాడ్యూల్ : 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు

Image
అ సోంలో భారీ ఉగ్రవాద మాడ్యూల్ బయటపడింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇమామ్ మహముదార్ కాఫిలా మాడ్యుల్ (ఐఎంకే) సంస్థకు చెందిన 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అసోం పోలీసులు ఈ అరెస్టులు చేశారు. ఐఎంకే అనేది నిషేధిత జమాతే-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) అనుబంధ విభాగం. గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దిగిపోయిన తర్వాత జైళ్ల నుంచి విడుదలైన ఉగ్రవాదులు, సీనియర్ నాయకులు భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించాలని ఐఎంకేకు దిశానిర్దేశం చేశారు.

సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరిక !

Image
ఆ న్‌లైన్‌లో అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పిల్లలపై లైంగిక వేధింపులు, అసభ్యకర కంటెంట్‌పై కఠినంగా వ్యవహరించాలని సామాజిక మాధ్యమాలు, ఇతర ఆన్‌లైన్ వేదికలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. లేదంటే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 79 ప్రకారం థర్డ్‌పార్టీ సమాచారాన్ని అప్‌లోడ్‌, ప్రచురణ, లేదా వ్యాప్తి చేస్తే ఆయా వేదికలదే బాధ్యత అని గుర్తుచేసింది. నిబంధనలు పాటించకుంటే ఐటీ యాక్ట్‌, బీఎన్‌ఎస్‌ సహా ఇతర చట్టాల కింద తీవ్ర పరిణామాలు తప్పవని ఉద్ఘాటించింది.

అధికారులు గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలి !

Image
హై దరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలమెంట్ విభాగం అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో కొత్త జోనల్ కమిషనర్లకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. క్యూర్ పరిధిలోని సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని చెప్పుకొచ్చారు. పరిపాలనను పట్టాలెక్కించాలనేదే తమ ఆలోచన అని తెలిపారు. హైదరాబాద్ నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ అని వివరించారు. కోర్ అర్బన్ రీజియన్‌ను ప్రక్షాళన చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. జోన్‌ల వారీగా సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్‌లదేనని స్పష్టం చేశారు. సిటీలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలని మార్గనిర్దేశం చేశారు. క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీ వాహనాలను తీసుకురావాలని నిర్ణయించామని ...

జనవరి 8న పోకో ఎం8 5జీ విడుదల

Image
దే శీయ మార్కెట్లోకి జనవరి 8న విడుదలకు పోకో ఎం8 5జీ సిద్ధమవుతోంది. గత కొన్ని వారాలుగా పోకో సంస్థ ఈ ఎం8 5జీ మోడల్‌ను టీజర్ల ద్వారా పరిచయం చేస్తూ ఆసక్తిని పెంచుతోంది. ఈ డివైస్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో శక్తిని పొందనుందని, అలాగే సొగసైన డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకోనుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రెడ్ మీ నోట్ 15, రెడ్ మీ 16 ప్రో సిరీస్‌లు ప్రకటించిన కొద్ది రోజులకే ఇది లాంచ్ కానుంది. అధికారిక సమాచారం ప్రకారం, లాంచ్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ కేవలం 7.35 మిల్లీమీటర్ల మందంతో, సుమారు 178 గ్రాముల బరువుతో ఉండనుందని సమాచారం. ఫోటోగ్రఫీ విభాగంలో ఇది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను పొందనుంది. ఈ కెమెరా ఏఐ ఆధారిత ఫీచర్లతో మెరుగైన ఫోటో అనుభవాన్ని అందించనుందని కంపెనీ సూచిస్తోంది. అదనంగా, స్క్విర్కిల్ ఆకారంలో ఉండే కెమెరా మాడ్యూల్‌లో మరో రెండు సెన్సార్లు కూడా ఉండే అవకాశం ఉంది.

రైల్వే విద్యుత్ లైన్ల దగ్గర గాలిపటాలు ఎగురవేయవద్దు : రైల్వే శాఖ విజ్ఞప్తి

Image
రైల్వే విద్యుత్తు లైన్ల దగ్గర గాలిపటాలు ఎగురవేయవద్దని, అలాగే విద్యుత్తు తీగల నుండి వేలాడుతున్న గాలిపటం దారాలను తాకడాన్ని నివారించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే ప్రాంగణాల పరిసరాల్లో, యార్డులు, ట్రాక్‌లు, సమీపంలోని జనసంచార ప్రాంతాలలో గాలిపటాలు ఎగురవేయడం వల్ల అనేక విద్యుదాఘాతానికి గురైన సంఘటనలు సంభవించాయని దక్షిణ మధ్య రైల్వే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మునుపటి సంక్రాంతి పండుగ సీజన్‌లో ఇలాంటి సంఘటనలు భారతీయ రైల్వేలోని అనేక జోన్‌ లలో, కొన్ని కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఇందులో వ్యక్తులు 25 కె. వి ట్రాక్షన్ ఓవర్‌ హెడ్ కండక్టర్‌ లలో చిక్కుకున్న గాలిపటం దారాలను తాకడంతో విద్యుత్ షాక్‌ లు లేదా ప్రాణాంతక గాయాలకు గురయ్యారని తెలిపింది. సాధారణంగా ప్రజలు ఉపయోగించే చైనా నుండి దిగుమతి చేసిన గాలిపటాల దారాలు, విద్యుత్ వాహకం అవడంవలన అవి ప్రాణాలకు మాత్రమే కాకుండా కీలకమైన రైల్వే విద్యుత్ మౌలిక సదుపాయాలకు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది. దీని వలన ప్రయాణీకులకు అలాగే రైల్వే సిబ్బందికి.. రైల్వే సేవలకు అంతరాయనికి, ప్రమాదాలకు దారితీయవచ్చని స్పష్...

బనకచర్ల ప్రాజెక్టుకి సీడబ్య్లూసీ అనుమతిని ఆక్షేపించిన హరీశ్‌రావు

Image
హై దరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ ఏపీ నిర్మిస్తోన్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్‌కు సీడబ్య్లూసీ అనుమతి వచ్చిందని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర అభిప్రాయం లేకుండా సీడబ్య్లూసీ ఎలా అనుమతి ఇస్తోందని ప్రశ్నించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని ఆక్షేపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులను విమర్శించడమే సరిపోతోందని విమర్శించారు. నీటి వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర పోతుందా, నిద్ర పోతున్నట్లు నటిస్తుందా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. తాను ఎటువంటి ఫేక్ రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణతో ఉన్న అనుబంధంతోనే తాను ఇలా మాట్లాడుతున్నానని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. తెలంగాణ జలదోపిడీకి సూత్రదారి ఆదిత్య నాథ్ దాస్ అని ఆరోపణలు చేశారు. తెలంగాణ ద్రోహి ఆయనేనని ఆక్షేపించారు. ఆదిత్య నాథ్ దాస్‌ను రేవంత్‌రెడ్డి సర్కార్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బనకచర్ల...

శాసనసభ, శాసనమండలికి ఫ్లోర్‌ లీడర్లు, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్లను నియామించిన బీఆర్‌ఎస్‌

Image
తె లంగాణ శాసనసభ, శాసనమండలికి సంబంధించి బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్ల నియామకం చేపట్టింది. శాసనసభ బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్లుగా హరీష్‌రావు, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లను  నియమించగా, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్లుగా రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలను నియమించింది. మండలిలో బీఆర్‌ఎస్‌ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ను నియమించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తుది నిర్ణయం మేరకే వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

పుతిన్ ఇంటిపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి యత్నం : స్పందించిన ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

Image
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. రష్యాలోని నోవ్‌గొరొడ్‌ ప్రాంత గ్రామంలో ఉన్న పుతిన్‌ ఇంటిపై ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్‌ ప్రయత్నించిందని రష్యా పేర్కొంది. మొత్తం 91 డ్రోన్లను ఆ దేశం ప్రయోగించినట్లు రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ తెలిపారు. అయితే అన్నింటినీ నిర్వీర్యం చేశామని, ఇంటికి ఎటువంటి నష్టం కలగలేదని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్‌పై సరైన సమయంలో దాడిచేసే హక్కు తమకు ఉందని స్పష్టంచేశారు. శాంతి చర్చలకు విఘాతం కలిగించే దాడి ఇదని, తాము చూస్తూ ఊరుకోమంటూ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ వ్యాఖ్యానించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న తాజా పరిణామాలపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  స్పందించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే ఆందోళన కలిగించాయని, ఇరు దేశాలు సంయమనం పాటించాలని, దౌత్యంపై తిరిగి దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఘర్షణలకు ముగింపు పలకడం, శాంతి సాధనకు ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య ప్రయత్నం అత్యంత ఆచరణీయ మార్గమన్న ప్రధాని మోడీ, అన్ని భాగస్వామ్య పక్షాలు ...

శాంసంగ్ సీఈఎస్ 2026లో సరికొత్త ఆడియో పరికరాల ప్రదర్శన

Image
జ నవరి 6 నుంచి ప్రారంభం కానున్న శాంసంగ్ సీఈఎస్ 2026లో ఇమ్మర్సివ్ సౌండ్, ఏఐ టెక్నాలజీ , వినూత్న డిజైన్‌తో కూడిన ఈ పరికరాలను అధికారికంగా ప్రదర్శించనుంది. క్యూ-సిరీస్ సౌండ్‌బార్లు అంటే ఇంట్లోనే థియేటర్ అనుభూతి అని చెప్పొచ్చు. శాంసంగ్ తన పాపులర్ క్యూ-సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. HW-Q990H (ఫ్లాగ్‌షిప్ మోడల్): ఇది 11.1.4 ఛానల్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 7.0.2 మెయిన్ బార్, 4.0.2 రియర్ స్పీకర్లు , పవర్‌ఫుల్ సబ్‌వూఫర్ ఉన్నాయి. ఇందులో మొదటిసారిగా ‘సౌండ్ ఎలివేషన్’ టెక్నాలజీని వాడారు. ఇది స్క్రీన్‌పై వచ్చే డైలాగులను నేరుగా మన వైపు వచ్చేలా మలచి, శబ్దాన్ని మరింత సహజంగా వినిపిస్తుంది. ఏఐ ట్యూనింగ్ ద్వారా గది ఆకృతికి తగ్గట్టుగా సౌండ్‌ను అడ్జస్ట్ చేస్తుంది. HW-QS90H (ఆల్-ఇన్-వన్ మోడల్):ఇది ఒక కన్వర్టబుల్ డిజైన్‌తో వస్తుంది. దీనిని గోడకు తగిలించుకోవచ్చు లేదా టేబుల్‌పై ఉంచుకోవచ్చు. దీనిలోని గైరో సెన్సార్ అది ఉన్న దిశను బట్టి సౌండ్ అవుట్‌పుట్‌ను ఆటోమేటిక్‌గా మారుస్తుంది. దీనికి ప్రత్యేక సబ్‌వూఫర్ అవసరం లేదు, ఎందుకంటే ఇందులోనే క్వాడ్ బాస్ వూఫర్ సిస్టమ్ బిల్ట్-ఇన్ చేయబడింది. మ్యూజిక్ స్ట...

జింక మాంసం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు !

Image
తె లంగాణలోని రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో జింక మాంసం విక్రయం కలకలం రేపింది. సులేమాన్ నగర్లో జింక మాంసం అమ్ముతున్న మహ్మద్ ఇర్ఫానుద్దీన్ను రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 15 కిలోల జింక మాంసం, జింక తోలు, తలతో పాటు 3 వేల 500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో వేటాడి వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి హైదరాబాద్కు జింకలను తీసుకువచ్చి, స్థానికంగా వధించి కిలో 800 రూపాయల చొప్పున నిందితుడు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు నిందితుడిని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్, 2025లో కూడా హైదరాబాద్లో జింక మాంసం పట్టుబడడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. టోలిచౌకిలో10 కిలోల జింక మాంసాన్ని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ వెల్లడించారు. టోలిచౌకి సబ్జా కాలనీకి చెందిన డాక్టర్ మహ్మద్ సలీమ్ మూస (47), బజార్ ఘాట్ నాంపల్లికి చెందిన మహ్మద్ ఇక్బాల్ కలిసి జహీరాబాద్ ఫారెస్ట్ ఏరియా నుంచి జింక మాంసం...

మద్రాస్‌ యూనివర్సిటీ సవరణ బిల్లును వెనక్కి పంపిన రాష్ట్రపతి భవన్‌

Image
త మిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన మద్రాస్‌ యూనివర్సిటీ సవరణ బిల్లును రాష్ట్రపతి భవన్‌ మంగళవారం వెనక్కి పంపించేసింది.మూడేళ్లుగా రాష్ట్రపతి వద్ద ఈ బిల్లు పెండింగ్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే. మద్రాస్ యూనివర్సిటీ చట్టం 1923 ప్రకారం తమిళనాడు గవర్నర్‌ యూనివర్సిటీకి ఎక్స్-ఆఫీషియో చాన్సలర్‌. వైస్‌ చాన్సలర్ నియామకం, తొలగింపు తదితర హక్కులు గవర్నర్‌ వద్దే ఉన్నాయి. అయితే.. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవితో స్టాలిన్‌ సర్కార్‌కు పొసగడం లేదు. గవర్నర్‌ వల్లే తమిళనాడులో వర్సిటీల వీసీ నియామకాలు నిలిచిపోయాయని ప్రభుత్వం తరచూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మద్రాస్‌ వర్సిటీ బిల్లు ద్వారా గవర్నర్‌ అధికారాలకు చెక్‌ పెట్టాలని స్టాలిన్‌ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వైస్‌ చాన్సలర్‌ను నియమించుకునే అధికారం పొందడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలకు అనుగుణంగా యూనివర్సిటీ పాలనను మార్చడం, అలాగే ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీని యూనివర్సిటీ సిండికేట్‌లో సభ్యుడిగా చేర్చడం తదితర అంశాలను బిల్లులో తమిళనాడు ప్రభుత్వం పొందుపరిచింది. అయితే ఈ బిల్లును గవర్నర్‌ ...

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు

Image
హై దరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నామినేషన్ లో సమర్పించిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత డిసెంబర్ 29న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాకుండా ప్రచారంలోనూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దాదాపు పదహారేండ్ల కింద రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నవీన్​ యాదవ్ ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్ లో ​ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 25 వేల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నవంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ యాదవ్.. డిసెంబర్ 29న తొలిసారిగా అసెంబ్లీకి హాజరై నియోజకవర్గ ప్రజా సమస్యలపై గళం విప్పారు.

పెళ్లి రోజే రిటైర్డ్ హైకోర్టు జడ్జి కుమార్తె ఆకస్మిక మృతి

Image
మ హారాష్ట్ర, నాసిక్ సమీపంలోని గంగాపూర్ గ్రామం వద్ద ఉన్న ఒక లగ్జరీ రిసార్ట్‌లో పెళ్లి రోజే వధువు అకస్మాత్తుగా మరణించింది. ఈ ఘటనపై సర్కార్వాడ పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశారు. మరణించిన వధువును దీప్శిఖ గోడ్బోలే (29) గా గుర్తించారు. ముంబైలోని దాదర్-మాతుంగ ప్రాంతానికి చెందిన ఈమె, బొంబాయి హైకోర్టు రిటైర్డ్ జడ్జి గిరీష్ గోడ్బోలే కుమార్తె. ఆమె వివాహం నాసిక్ సమీపంలోని ఒక రిసార్ట్‌లో జరగాల్సి ఉంది. దీనికోసం బంధుమిత్రులందరూ ముంబై నుండి నాసిక్ చేరుకున్నారు. ఆదివారం ఉదయం 9:30 గంటల సమయంలో, ఆమె హోటల్ గది నంబర్ 201లో బంధువులతో కలిసి ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆమె మేనత్త డాక్టర్ స్వాతి బాపట్ వెంటనే ప్రథమ చికిత్స అందించి శ్రీ గురూజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పెళ్లి పనుల ఒత్తిడి మరియు సరైన నిద్ర లేకపోవడం వల్ల తాను అసౌకర్యంగా ఉన్నట్లు దీప్శిఖ అంతకుముందు బంధువులతో చెప్పింది. అయితే దానిని సాధారణ అలసటగా భావించి ఆమె పట్టించుకోలేదు. ఉదయం పెళ్లికి ముస్తాబవుతుండగా ప్రాణాలు విడిచింది.

ఎదురెదురుగా రెండు బైకులు ఢీ : పక్క నుంచి వెళ్తున్న లారీ కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం

Image
హై దరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్ మె ట్ సమీపంలోని బాటసింగారం వద్ద సర్వీస్ రోడ్డుపై ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొట్టుకున్నాయి. ఓ బైక్ పై ఉన్న ముగ్గురు విద్యార్థినులు కిందపడిపోయారు. అదే సమయంలో పక్క నుంచి వెళుతున్న లారీ కిందపడటంతో హంసలేఖ (22) అనే ఇంజినీరింగ్ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతురాలు దిల్ సుఖ్ నగర్ కు చెందిన విద్యార్థినిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

డొనాల్డ్ ట్రంప్‌కు 'ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్'ను ఇవ్వనున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం

Image
అ మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్'ను ట్రంప్‌కు ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో ఇరువురు నేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడిందని సీఎన్ఎన్ వార్తా సంస్థ పేర్కొంది.గత 80 ఏళ్ల చరిత్రలో ఈ పురస్కారాన్ని ఓ విదేశీయుడికి (నాన్-ఇజ్రాయెల్ సిటిజన్) ఇవ్వడం ఇదే తొలిసారి కాగా.. శాంతి విభాగంలో అవార్డును ప్రకటించడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ఏడాది జులై లో ఇజ్రాయెల్ తమ నిబంధనలను సవరించి మరీ విదేశీయులకు ఈ అవార్డు ఇచ్చేలా మార్పులు చేసింది. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరై ట్రంప్ ఈ అవార్డును స్వీకరించే అవకాశం ఉంది."ట్రంప్ ఎన్నో సంప్రదాయాలను తిరగరాసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకే మేం కూడా సంప్రదాయాన్ని పక్కనపెట్టి తొలిసారి ఓ ఇజ్రాయేలేతరుడికి ఈ అవార్డును ఇస్తున్నాం. యూదు ప్రజలకు, ఇజ్రాయెల్ భద్రతకు ట్రంప్ చేసిన సేవలకు ఇది గుర్తింపు" అని నెతన్యాహు పేర్కొన్నారు. దీనిపై స్పం...

ఎల్ఆర్‌జీఆర్ 120 ప్రయోగం విజయవంతం

Image
ఒ డిశాలోని చండీపూర్‌ నుంచి డీఆర్‌డీవో చేపట్టిన దీర్ఘశ్రేణి గైడెడ్‌ రాకెట్‌ పినాక (ఎల్ఆర్‌జీఆర్ 120) ప్రయోగం విజయవంతం  అయింది. ఈ రాకెట్‌ గరిష్ఠంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అధికారులు తెలిపారు. ఈ పరీక్ష విజయవంతమైందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 'ఎక్స్‌' వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఆయన అభినందించారు. 

15 ఏండ్ల తృణమూల్‌ పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

Image
కో ల్‌కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ 15 ఏండ్ల తృణమూల్‌ పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, గత 15 ఏండ్లుగా బెంగాల్‌ భయం, అవినీతి, దుష్పరిపాలనను చూసిందని, చొరబాట్లు ప్రజల్లో అభద్రతా భావాన్ని, ఆందోళనను సృష్టించాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. దీదీ నేతృత్వంలోని ప్రభుత్వ అవినీతి కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బెంగాల్‌కు తిరిగి పూర్వవైభవం తెస్తామని, స్వామి వివేకానంద, బంకిం చంద్ర ఛటోపాధ్యాయ, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఊహించిన బెంగాల్‌ను నిర్మించడానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

రూ. 32,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం !

Image
రూ. 32,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 6.48 శాతం ప్రభుత్వ సెక్యూరిటీ 2035 రీ-ఇష్యూ కింద ఈ అమ్మకాలు జరపనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై కార్యాలయం ఆధ్వర్యంలో జనవరి 2న ఈ వేలం జరగనుంది. మల్టిపుల్ ప్రైస్ విధానంలో ఈ వేలాన్ని నిర్వహిస్తారు. ఈ సెక్యూరిటీపై మరో రూ. 2,000 కోట్ల వరకు అదనపు సబ్‌స్క్రిప్షన్‌ను నిలుపుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.ఈ వేలంలో పాల్గొనేవారు ఆర్బీఐ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో బిడ్లను దాఖలు చేయాలి. నాన్-కాంపిటీటివ్ బిడ్లను ఉదయం 10:30 నుంచి 11:00 గంటల మధ్య, కాంపిటీటివ్ బిడ్లను ఉదయం 10:30 నుంచి 11:30 గంటల మధ్య సమర్పించాల్సి ఉంటుంది. అర్హులైన వ్యక్తులు, సంస్థల కోసం మొత్తం నోటిఫైడ్ మొత్తంలో 5 శాతం నాన్-కాంపిటీటివ్ బిడ్డింగ్ కింద కేటాయించారు. సాధారణంగా ప్రభుత్వాలు తమ బడ్జెట్ లోటును భర్తీ చేసుకోవడానికి, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల వంటి ప్రజా ఖర్చులకు నిధులు సమీకరించడానికే ఇలా బాండ్లను విక్రయిస్తాయి. వేలం ఫలి...

టోల్‌ ప్లాజా వద్ద డ్రైవర్‌ వీరంగం : గేటు ధ్వంసం చేసి సిబ్బందిపై దాడి !

Image
క ర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ సమీపంలోని బ్రహ్మరకూట్లు టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు చెల్లించే విషయంలో మొదలైన వివాదం టోల్ సిబ్బందిపై దాడికి దారితీసింది. లారీ డ్రైవర్, క్లీనర్ కలిసి టోల్ గేటును ధ్వంసం చేయడమే కాకుండా అక్కడి సిబ్బందిపై దాడికి దిగడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిక్కమగళూరుకు చెందిన భరత్ (23) అనే లారీ డ్రైవర్ తన వాహనాన్ని రాంగ్ రూట్‌లో టోల్ ప్లాజా వద్దకు తీసుకువచ్చాడు. డ్యూటీలో ఉన్న టోల్ సిబ్బంది టోల్ రుసుము చెల్లించాలని కోరగా, డ్రైవర్ నిరాకరిస్తూ గొడవకు దిగాడు. ఆవేశంతో వాహనాన్ని ముందుకు పోనిచ్చి టోల్ గేటును ఢీకొట్టి దానిని ధ్వంసం చేశాడు. అనంతరం డ్రైవర్ భరత్, క్లీనర్ తేజస్ (26) కలిసి అక్కడి సిబ్బంది అంకిత్, రోహిత్‌లను అసభ్య పదజాలంతో దూషిస్తూ వారిపై దాడికి దిగారు.