మహారాష్ట్ర, నాసిక్ సమీపంలోని గంగాపూర్ గ్రామం వద్ద ఉన్న ఒక లగ్జరీ రిసార్ట్‌లో పెళ్లి రోజే వధువు అకస్మాత్తుగా మరణించింది. ఈ ఘటనపై సర్కార్వాడ పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశారు. మరణించిన వధువును దీప్శిఖ గోడ్బోలే (29) గా గుర్తించారు. ముంబైలోని దాదర్-మాతుంగ ప్రాంతానికి చెందిన ఈమె, బొంబాయి హైకోర్టు రిటైర్డ్ జడ్జి గిరీష్ గోడ్బోలే కుమార్తె. ఆమె వివాహం నాసిక్ సమీపంలోని ఒక రిసార్ట్‌లో జరగాల్సి ఉంది. దీనికోసం బంధుమిత్రులందరూ ముంబై నుండి నాసిక్ చేరుకున్నారు. ఆదివారం ఉదయం 9:30 గంటల సమయంలో, ఆమె హోటల్ గది నంబర్ 201లో బంధువులతో కలిసి ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆమె మేనత్త డాక్టర్ స్వాతి బాపట్ వెంటనే ప్రథమ చికిత్స అందించి శ్రీ గురూజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పెళ్లి పనుల ఒత్తిడి మరియు సరైన నిద్ర లేకపోవడం వల్ల తాను అసౌకర్యంగా ఉన్నట్లు దీప్శిఖ అంతకుముందు బంధువులతో చెప్పింది. అయితే దానిని సాధారణ అలసటగా భావించి ఆమె పట్టించుకోలేదు. ఉదయం పెళ్లికి ముస్తాబవుతుండగా ప్రాణాలు విడిచింది.
0 Comments