మహారాష్ట్ర , జార్ఖాండ్ ఎన్నికలు ముగిసి శనివారంనాడు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల అనంతర వ్యూహాలు, పొత్తులను కూడగట్టడంపై ఆ రెండు రాష్ట్రాలకు ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకునే బాధ్యతను సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘెల్, డాక్టర్.జి.పరమేశ్వరకు అప్పగించినట్టు ఏఐసీసీ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జార్ఖాండ్ పరిశీలకులుగా తారిఖ్ అన్వర్, మల్లు భట్టి విక్రమార్క, కృష్ణ అల్లవరును నియమించారు. పరిశీలకులు అవసరమైన వ్యూహాత్మక మార్గదర్శకాలు చేస్తూ, ప్రభుత్వ ఏర్పాటు, కూటమి వ్యూహాలపై కేంద్ర నాయకత్వానికి నివేదిక ఇస్తారు.
0 Comments