కోల్‌కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ 15 ఏండ్ల తృణమూల్ పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, గత 15 ఏండ్లుగా బెంగాల్ భయం, అవినీతి, దుష్పరిపాలనను చూసిందని, చొరబాట్లు ప్రజల్లో అభద్రతా భావాన్ని, ఆందోళనను సృష్టించాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. దీదీ నేతృత్వంలోని ప్రభుత్వ అవినీతి కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బెంగాల్‌కు తిరిగి పూర్వవైభవం తెస్తామని, స్వామి వివేకానంద, బంకిం చంద్ర ఛటోపాధ్యాయ, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఊహించిన బెంగాల్‌ను నిర్మించడానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
0 Comments