Posts

Showing posts with the label describing it as a "Black Bill

డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి వినూత్న నిరసన : కాపీలను తగలబెట్టిన స్టాలిన్

Image
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. నేడు లోక్‌సభలో దీన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌  డీలిమిటేషన్ బిల్లు కాపీని తగలబెట్టారు. దీన్ని 'బ్లాక్‌ బిల్‌'గా అభివర్ణించారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టాలిన్‌ గురువారం నామక్కల్‌ ప్రాంతంలో పర్యటించారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా నల్ల దుస్తులు ధరించి తన నిరసనను తెలిపారు. నల్ల జెండాను ఎగరవేసి.. బిల్లు కాపీని తగలబెట్టారు. అనంతరం 'కలిసి పోరాడదాం.. గెలుద్దాం' అంటూ డీఎంకే నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను స్టాలిన్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా1960లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం గురించి ఆయన ప్రస్తావించారు. గతంలో తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా చేపట్టిన ప్రతిఘటన జ్వాల ఢిల్లీని దహించివేసిందని గుర్తు చేశారు. ఆ సమయంలో ఢిల్లీ దిగొచ్చిన తర్వాతే పరిస్థితి మాములు స్థితికి వచ్చిందని సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ బ్లాక్‌ బిల్...