Posts

Showing posts with the label alleging that the Enforcement Directorate had seized their party files

టీఎంసీ పిటిషన్‌ను డిస్పోజ్ చేసిన కోల్‌కతా హైకోర్టు !

Image
ప శ్చిమ బెంగాల్ లో ఐ-ప్యాక్ సంస్థపై ఇటీవల జరిపిన దాడుల్లో తమ పార్టీ ఫైళ్లు, ఎన్నికలకు సంబంధించిన డాటాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ సీజ్ చేసిందంటూ తృణమూల్ కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ను కోల్‌కతా హైకోర్టు బుధవారంనాడు డిస్పోజ్ చేసింది. సుప్రీంకోర్టులో ఇదే తరహా పిటిషన్ వేసినట్టు ఈడీ చెప్పడంతో ఆ సంస్థ వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈడీ వేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం గురువారంనాడు విచారణ జరుపనుంది. టీఎంసీకి సంబంధించిన ఎలాంటి డాటాను తాము సీజ్ చేయలేదని కోల్‌కతా హైకోర్టులో విచారణ సందర్భంగా ఈడీ తెలిపింది. కస్టడీలోకి తీసుకోని సామగ్రిని సురక్షితంగా ఉంచాలనడం ఏమిటని ప్రశ్నించింది. ఇది డాటా భద్రతకు సంబంధించిన అంశమే అయితే ఇందుకు సంబంధించిన విజ్ఞప్తిని తాము కట్టుబడి ఉంటామని, ఈడీ ఎలాంటి డాటాను స్వాధీనం చేసుకోలేదని, ఇందుకు భిన్నంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఆ డాటా తీసుకువెళ్లారని తెలిపింది. తమ రెయిడ్లతో తృణమూల్ కాంగ్రెస్‌కు అసలు సంబంధమే లేదని వివరించింది. కాగా, ఎన్నికలకు సంబంధించిన తమ పార్టీ డాటాను ఈడీ సీజ్ చేసినందున ఆ డాటాకు భద్రత కల్పించాలని కోర్టును టీఎంసీ కోరిం...