Posts

Showing posts with the label Donald Trump's Financial Security Plan for Children Born in America

అమెరికాలో పుట్టే పిల్లలకి డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక భరోసా !

Image
అ మెరికాలో పుట్టిన అమెరికన్ పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసానిచ్చే ఒక ప్లాన్ ను అందించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. దేశంలోని బడా బిజినెస్ మెన్ లను, పలు దాతృత్వ సంస్థలను దీనికోసం విరాళాలు ఇవ్వవలసింది డోనాల్డ్ ట్రంప్ కోరారు. అమెరికాలో పుట్టబోయే అమెరికన్ పిల్లలకు ఆర్థికభరోసా కల్పించడం కోసం ట్రంప్ అకౌంట్స్ పేరుతో ఒక ప్రోగ్రాంను మొదలుపెట్టారు. ట్రంప్ అకౌంట్స్ ద్వారా అమెరికాలో పుట్టే పిల్లలకు వారి అకౌంట్లో వెయ్యి డాలర్లను వేస్తారు. ఈ వెయ్యి డాలర్లను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి, తిరిగి వారి పెద్దయ్యేవరకు వారికి కావలసిన ఆర్థిక భరోసాను కల్పిస్తారు. అమెరికాలో పుట్టే పిల్లలకు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా 18 ఏళ్ల వయసు నుండే ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించడం ఈ అకౌంట్స్ ప్రధానమైన ఉద్దేశం. ఈ సంవత్సరం ప్రారంభంలో చట్టంగా సంతకం చేయబడిన ఈ బిల్లు ప్రతి అమెరికన్ నవజాత శిశువుకు వెయ్యి డాలర్లను ఇస్తుంది.  తక్కువ ఆదాయ కుటుంబాల పిల్లల సంపదను పెంచడానికి సహాయపడే ఈ ప్రోగ్రాంకు అమెరికాలోని సంపన్న వర్గాలను సహాయం చేయవలసిందిగా ట్రంప్ విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రముఖ బిలియన...