Posts

Showing posts with the label Afghan Refugee Truck Overturns: 22 Dead

ఆఫ్ఘన్ శరణార్థుల ట్రక్కు బోల్తా పడి 22 మంది మృతి, 36 మంది తీవ్ర గాయాలు

Image
పా కిస్తాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న ఆఫ్ఘన్ శరణార్థులతో ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు బోల్తా పడటంతో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉండటం ఈ ఘటన తీవ్రతను మరింత పెంచింది. ఈ ప్రమాదం తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని లగ్మన్ ప్రావిన్స్ పరిధిలో కాబూల్-నంగర్‌హర్ ప్రధాన రహదారిపై జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, గంటల తరబడి నిరంతరంగా వాహనం నడిపిన డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ట్రక్కు అదుపు తప్పి రహదారి పక్కనున్న లోతైన కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో భారీ సంఖ్యలో కుటుంబాలు ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లగ్మన్ ప్రావిన్స్ గవర్నర్ ప్రతినిధి అబ్దుల్ మాలిక్ నియాజాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుల్లో 10 మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సహాయక బృందాలు, స్థానిక గ్రామస్తులు ఘటనా స్థలాన...