Posts

Showing posts with the label decided to provide financial aid of Rs 1 crore each to Sudarshan Reddy's two children

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండ : రూ.2.25 కోట్లు అందించాలని కేసీఆర్ నిర్ణయం

Image
అ నారోగ్యంతో ఇటీవల మరణించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.2.25 కోట్ల సాయం అందజేయాలని పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున వారి బాగోగుల కోసం రూ.25 లక్షలను ఆమె పేర బ్యాంకులో జమ చేయాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. అంతేగాక పిల్లల భవిష్యత్తు, వారి చదువు, కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని అధినేత తెలిపారు. కాగా, సుదర్శన్ రెడ్డి దశదినకర్మల కార్యక్రమాలు ముగిసిన తర్వాత పార్టీ జిల్లా ముఖ్యులు సమావేశమై వారి కుటుంబ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారనీ, ఎల్లకాలం వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.