Posts

Showing posts with the label 900 Units in October

అక్టోబర్ నెలలో 34,900 యూనిట్లు అమ్మిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ !

Image
దే శీయ మార్కెట్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తన పట్టును రోజురోజుకు పెంచుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా అక్టోబర్ నెలలో ఈ స్కూటర్ అమ్మకాలు భారీగా పెరిగి మొత్తం 34,900 యూనిట్లు కొనుగోలుదారులకు చేరాయి. ఇది గత సంవత్సరం ఇదే నెల (అక్టోబర్)లో నమోదైన 30,644 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 13.89% వృద్ధిని సూచిస్తుంది. చేతక్ అమ్మకాలు ఈ స్థాయిలో పెరగడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటిది ఇది ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ టూ వీలర్‌లతో పోలిస్తే సరసమైన ధరలో లభిస్తోంది. రెండవది దీని బాడీని పూర్తిగా స్టీల్‌తో తయారు చేయడం వల్ల, క్వాలిటీ, మన్నిక విషయంలో వినియోగదారులకు మంచి నమ్మకాన్ని కలిగించడం జరిగింది. సాంప్రదాయ స్కూటర్ క్వాలిటీని కోరుకునే కస్టమర్లు దీని బిల్డ్ క్వాలిటీని ఇష్టపడుతున్నారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్‌లో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా చేతక్ 3001, చేతక్ 3501, చేతక్ 3502, చేతక్ 3503 వేరియంట్లలో లభిస్తోంది. ఈ వేరియంట్లు ధర, బ్యాటరీ సామర్థ్యం, ఫీచర్ల పరంగా విభిన్నంగా ఉన్నాయి. బజాజ్ చేతక్ 3001బేసిక్ మోడల్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.02 లక్షలుగా ఉంది. ఇందులో 3 కిలోవాట్-అవర్ సామర్థ...