Posts

Showing posts with the label 20వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు

ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు !

Image
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.. మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ డిల్లీ అసెంబ్లీ ఎన్నికల వివరాలను వెల్లడించారు. ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే దశలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఢిల్లీలో ఎన్నికల కోడ్‌ వెంటనే అమల్లోకి వచ్చినట్టు ఈసీ ప్రకటించింది. ఈనెల 10వ తేదీన ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. ఫిభ్రవరి 17వ తేదీ వరకు నామినేషన్ల గడువు విధించారు. ఈనెల 20వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఢిల్లీలో ప్రస్తుతం 1 కోటి 55 లక్షల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 83 లక్షలకు పైగా పురుష ఓటర్లు ఉండగా, 71.74 లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఈసారి ఢిల్లీలో భారీ ఎత్తున ఓటింగ్ జరిగే అవకాశం ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఇదే తొలి ఎన్నికలని.. యువత ప్రజాస్వామ్యంలో తమ వంతు పాత్ర పోషించ...