Posts

Showing posts with the label Deputy CM Pawan Kalyan

ఇదే ఘటన మీ మతంలో జరిగి ఉంటే మీరు ఇలాగే స్పందించేవారా?

Image
తి రుమల పరకామణిలో జరిగిన చోరీపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ఇదే ఘటన మీ మతంలో జరిగి ఉంటే మీరు ఇలాగే స్పందించేవారా? భారత రాజ్యాంగం అన్ని మతాలకు సమానంగా వర్తిస్తుందని అన్నారు. ఇస్లాం, క్రైస్తవ మతాలకు ఒకలా, హిందూ మతానికి మరోలా నిబంధనలు ఉండవనని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఆ అక్రమాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయని అన్నారు. ఇటీవల పట్టు శాలువాల పేరుతో పాలిస్టర్ వస్త్రాలు సరఫరా చేసిన కుంభకోణం వెలుగులోకి వచ్చిందన్నారు. తిరుమలలో జరిగిన అన్ని అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని స్పష్టం చేశారు. హిందువులు మెజారిటీ అనడం ఒక భ్రమ మాత్రమేనని అన్నారు.. కులం, మతం, భాష, ప్రాంతాల వారీగా హిందువులు విడిపోయి ఉన్నారని పవన్ తెలిపారు.

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం

Image
ఆం ధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సబ్ కమిటీలోని మంత్రులు అనగాని, నారాయణ, నాదెండ్ల, సత్యకుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి హాజరయ్యారు. ప్రజల అవసరాలు, పాలనా సౌలభ్యం ప్రధాన అజెండాగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై ప్రభుత్వం ఆలోచనలు, చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందని మంత్రి వర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. గత ప్రభుత్వ నిర్ణయం కారణంగా పలు చోట్ల ప్రజలకు ఇబ్బందులు, పరిపాలనలోనూ సమస్యలు వచ్చాయని తెలిపింది. అయితే గతంలో జరిగిన జిల్లా పునర్ వ్యవస్థీకరణ వల్ల తలెత్తిన ఇబ్బందులను సరిదిద్దే పనిలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలిపింది. జిల్లాల పునర్ విభజన, మార్పులు చేర్పులు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఈ ఏడాది జూలైలో రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేసింది. పలుమార్లు సమావేశమై వివిధ వర్గాలు, ప్రజాసంఘాల నుంచి వచ్చిన వినతులను కేబినెట్ సబ్ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏ...