Posts

Showing posts with the label Boyapati waive remuneration

అఖండ 2 విడుదల వాయిదా : రెమ్యూనరేషన్ వదులుకున్న బాలకృష్ణ, బోయపాటి

Image
అ ఖండ 2 విడుదల వాయిదా పడింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ సంస్థకు మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవిల కారణంగా ఈ రోజు విడుదల కావాల్సిన అఖండ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఈరోస్ నౌకు చెల్లించాల్సిన డబ్బులు క్లియర్ చేసే వరకు రిలీజ్ చేయవద్దని అఖండ 2 విడుదలపై తాత్కాలిక నిషేధం విధిస్తు మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సినిమా రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో హీరో నందమూరి బాలకృష్ణ ముందుకు వచ్చి నిర్మాతలకు అండగా నిలబడ్డారు. రెమ్యునరేషన్ లో భాగంగా బాలయ్యకు నిర్మాతలు ఇంకా రూ. 7 కోట్లు పెండింగ్ ఉన్నారు. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనుకు రూ. 4 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు రిలీజ్ వాయిదా పడడంతో బాలయ్య, బోయపాటి ఇద్దరు నిర్మాతలకు సాయంగా తమ రెమ్యూనరేషన్ ను వదులుకున్నారు. అలాగే నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కొంతవరకు హామీగా ఉన్నట్టు సమాచారం. ఫైనాన్స్ ఇష్యూ క్లియర్ కు అన్ని అడ్డంకులు తొలగడంతో 14 రీల్స్ ప్లస్ మేకర్స్ ఈ రోజు మద్రాస్ హైకోర్టుకు అప్పీల్ కు వెళ్తున్నారు.