మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాల విడుదల
తె లంగాణలో స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ఈ నిధులను జమ చేసింది. సోమవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జిల్లా డీఆర్‌డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరు నాగారం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని తెలిపారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ భారం లేకుండా ప్రభుత్వమే వాటిని చెల్లిస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ. 3,500 కోట్ల వడ్డీలను ఎగవేసిందంటూ బీఆర్ఎస్ పార్టీపై ఈ సందర్భంగా సీతక్క మండిపడ్డారు. అంతే కాకుండా స్వయం సహాయక సంఘాల్లోని మహిళల పొదుపు సొమ్మును సైతం గత ప్రభుత్వం కాజేసిందని విమర్శించారు. అక్కా చెల్లెమ్మల కష్టార్జితమైన అభయహస్తం నిధులను కూడా ప్రభుత్వం మింగేసిందన్నారు. కానీ తమ ప్రజా ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఎన్న...