2024

బీఎస్ఎన్ఎల్  రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది. వాటి ధర రూ.628, రూ.215 గా ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్లలో అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎమ్ఎస్, డేటా బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 628 రీచార్జ్ ప్లాన్ 84 రోజుల పూర్తి వ్యాలిడిటీని అందిస్తుంది. ఇంత వాలిడిటీతో ఇతర టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్‌లు రూ.800 కంటే ఎక్కువే ఉన్నాయి కానీ తక్కువ ధరలో లేవు. 628 రూపాయల బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్‌పై అపరిమిత వాయిస్ కాలింగ్ లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు పంపవచ్చు. అలానే వినియోగదారులు ప్రతిరోజూ 3GB డేటాను పొందుతారు. వినియోగదారులు అనేక గేమ్స్, ఎంటర్‌టైన్మెంట్ ఆఫర్స్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ రూ. 215 రీచార్జ్ ప్లాన్ లో కూడా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తోంది. అలాగే రోజుకు 100 SMS, ప్రతిరోజూ 2GB డేటా ఇస్తున్నారు. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. దీనిని ప్రైవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్‌తో పోల్చినట్లయితే, 30 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 GB డేటాతో అటువంటి చౌకైన ప్లాన్ అందుబాటులో లేదు. ఈ ప్లాన్ జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అనేక గేమ్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌లకు కూడా యాక్సెస్‌ను అందిస్తుంది.

రివైజ్డ్‌ ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు గడువును ఆదాయపు పన్ను విభాగం పొడిగించింది. వాస్తవానికి డిసెంబర్‌ 31 గడువు ముగియనుండగా, భారత నివాసితులకు 2025 జనవరి 15 వరకు అవకాశం కల్పించింది. జులైలో ఎవరైతే ఐటీఆర్‌ దాఖలు చేయలేదో వారు జరిమానా చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే గడువు లోపు ఐటీఆర్‌ సమర్పించినా ఒకవేళ అవసరమైతే రివైజ్డ్‌ ఐటీఆర్‌ దాఖలు చేయాలనుకున్నవారూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 (మదింపు సంవత్సరం 2024-25)కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు ఈ ఏడాది జులై 31తోనే ముగిసింది. ఏదైనా కారణంతో రిటర్నుల ప్రక్రియను పూర్తి చేయని వారికి చివరి అవకాశం చట్టం కల్పిస్తోంది. అలా ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 వరకూ దాఖలు చేసిన రిటర్నులను 'బిలేటెడ్‌ రిటర్న్‌'గా పేర్కొంటారు. బిలేటెడ్‌ ఐటీఆర్‌ సమర్పించే వారి వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్నప్పుడు రూ.1,000, అంతకుమించి ఉంటే రూ.5,000 వరకూ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రైల్వే సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ స్టేషన్‌లో ఇక నుంచి 15 నిమిషాలు ముందుగానే బయలుదేరుతుంది. పాత షెడ్యూల్‌ ప్రకారం విజయవాడ స్టేషన్‌లో ఉదయం 6.15 గంటలకు బయలుదేరాల్సిన రైలు మార్చిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 6 గంటలకే బయలుదేరుతుంది. నిత్యం విజయవాడ నుంచి విశాఖ వెళ్లే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

పంజాబ్‌ పోలీసులు నూతన సంవత్సర వేడుకల వేళ పౌరులను అప్రమత్తం చేస్తూ విన్నూతంగా సూచనలు జారీ చేశారు. ''వేడుకల సందర్భంగా అధికంగా మద్యం సేవించడం, వీధుల్లో గొడవలు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారికి పంజాబ్‌ పోలీసులు ప్రత్యేక ఆఫర్లు అందజేయనున్నారు. పోలీసు స్టేషన్‌కు ఉచితంగా ఎంట్రీ ఉంటుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారికి ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ ఇస్తాం. అంతేకాకుండా ఈ ఏడాది చివరి రాత్రిని నాశనం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే 112కి ఫోన్‌ చేసి మమ్మల్ని ఆహ్వానించవచ్చు'' అని పేర్కొన్నారు. ఈ పోస్టును పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా చూశారు. పోలీసులు చేసిన ఈ విన్నూత ప్రయత్నానికి ఆయన ఫిదా అయ్యారు. 'ఎక్స్‌' (ట్విటర్‌) వేదికగా పంచుకుంటూ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాను తమదైన శైలిలో వినూత్నంగా వినియోగించుకునే వారిలో పోలీసులు ఒకరని పేర్కొన్నారు. అందరికీ 'హ్యాపీ న్యూ ఇయర్‌' అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్టు కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. 

సినీ ఇండస్ట్రీతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు రహస్యంగా జరిపినవి కావని చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కౌంటర్ సమాధానచ్చారు. చిత్రపరిశ్రమతో రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఎలాంటి దాపరికాల్లేకుండా జరిగిన ఈ సమావేశంలో పూర్తి స్నేహభావంతో జరిగిందనదన్నారు. ఈ సమావేశం విషయంలో చిత్ర పరిశ్రమ సంతృప్తిగా ఉందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి మా బాధ్యతగా సహకారం అందచేయాలని సీఎం కోరారన్నారు. హైదరాబాద్ ను గ్లోబర్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చాలన్న సీఎం బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర సీమ ప్రతినిధులుగా మేమంతా స్వాగతించామన్నారు. అనవసర వివాదాల్లోకి, రాజకీయాల్లోకి చిత్ర పరిశ్రమను లాగవద్దని కేటీఆర్ కు దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. రాజకీయ దాడి, ప్రతి దాడులకు చిత్ర పరిశ్రమను వాడుకోవద్దని అందర్నీ కోరుతున్నామన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే చిత్ర పరిశ్రమకు ప్రభుత్వాల సహకారం , ప్రజల ప్రోత్సాహం ఎప్పటికి ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. సోమవారం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో  మాట్లాడినప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక, ప్రజల నుంచి విమర్శలు వస్తాయనే భయంతో డైవర్ట్ చేసే క్రమంలో అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన మరణాలపైన రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థులకు, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. సినిమా వాళ్లపైన పడి అటెన్షన్-డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి పాకులాడారని విమర్శించారు. సినిమా వాళ్ళ నుంచి సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు సైలెన్స్ గా ఉన్నాడని మండిపడ్డారు. గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రైతన్నలు, నేతన్నల మరణాల పైన స్పందించాలని డిమాండ్ చేశారు. వాళ్లకు కూడా కనీసం రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని పోరాడతామన్నారు. 

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ మంగళవారం ఉదయం మరోసారి మోరాయించింది. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే వెబ్‌సైట్ మొరాయించడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం నిర్వహణ పనులు జరుగుతున్నాయని, అందువల్ల తదుపరి గంట వరకు టిక్కెట్ బుకింగ్‌లు, కాన్సిలేషన్లు చేసుకోవడం వీలుపడదని వెబ్‌సైట్‌లో నోట్ పెట్టింది. ''తదుపరి గంట వరకు బుకింగ్, క్యాన్సిలేషన్లు చేసుకోవడం కుదరుదు, ఈ అంతరానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం, క్యాన్సిలేషన్ లేదా టీడీఆర్ ఫైల్ చేయాలనుకుంటే కస్టమర్ కేర్ నెంబర్లు 14646,08044647999, 08035734999ను లేదా etickets@irctc.co.inకు మెయిల్ ద్వారా సంప్రదించాలి'' అని సూచించింది. ఇలా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ డౌన్ కావడం ఈ నెలలో ఇది మూడోసారి కావడం గమనార్హం. డిసెంబరు 26న ఏకంగా గంటన్నర పాటు బుకింగ్స్ నిలిచిపోయాయి. అంతకు ముందు డిసెంబర్ 9 న కూడా వెబ్‌సైట్ రెండు గంటలపాటు నిలిచిపోయింది. దీంతో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడంలో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కూడా కొత్త ఏడాది సందర్బంగా టూర్ ప్లాన్ చేసుకున్నవారు.. జర్నీ కోసం టిక్కెట్ బుక్ చేసుకుందామంటే బుకింగ్స్ నిలిచిపోయాయి.

దేశం అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిన సంవత్సరం 2024 అని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. గ్రామీణ విద్యుద్దీకరణ, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, డిజిటల్ కెనెక్టివిటీ, లింగ సమానత్వం వంటి అంశాల్లో ఈ ఏడాది అసాధారణ ప్రగతిని సాధించామని అన్నారు. భారతదేశ విధానాలు, కార్యక్రమాలతో దేశంలో నిలకడైన మార్పులు వచ్చాయని, ముఖ్యంగా గ్రామీణ-పట్టణ అసమతౌల్యత తొలగిందని అన్నారు. గ్రామీణ భారతంలోని ప్రజల స్థితిగతులను మెరుగుపరచడంపై ఈ ఏడాది ప్రధానంగా దృష్టిసారించామని అన్నారు. పీఎం జన్‌థన్ యోజనతో సహా అనేక పథకాలు సానుకూల ఫలితాలనిచ్చాయని, 54 కోట్ల ఫస్ట్ టైమ్ బ్యాంక్ హోల్డర్లు ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చారని చెప్పారు. పీఎం ఆవాస్ యోజనతో గ్రామీణ హౌసింగ్ ముఖచిత్రమే మారిపోయిందని, 3.2 కోట్లకుపైగా గృహాలు మంజూరుచేయగా, 2.7 కోట్ల గృహాలు పూర్తయ్యాయని వివరించారు. లబ్ధిదారులలో 74 శాతం మహిళలే ఉన్నారని చెప్పారు. గ్రామీణ విద్యుద్దీకరణతో గ్రామాల్లో పదేపదే పవర్ కట్స్‌కు తెరపడిందన్నారు. దేశంలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసిందని మోదీ అన్నారు. 6 లక్షల గ్రామాలకు 4జి కనెక్టివిటీ వచ్చిందన్నారు. 'ఇండియా గ్రోత్ స్టోరీ'లో గ్రామీణ భారతం ఇప్పుడు చురుకైన భాగస్వామ్యం కలిగి ఉందని చెప్పారు. విధాన నిర్ణయాలు, పాలనలో మహిళల పార్టిషిపేషన్ కూడా పెరిగిందని, శాసనసభలు, పంచాయతీల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని, ఓటింగ్‌లో పాల్గొంటున్న మహిళల శాతం కూడా పెరిగిందన్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌పేస్ (యూపీఐ) ఈ ఏడాది గణనీయంగా పెరిగినట్టు చెప్పారు. 2017లో 400 మిలియన్ లావాదేవీలు జరగ్గా, 2024లో 170 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగాయన్నారు. ఈ ఏడాది ఒక్క అక్టోబర్ మాసంలోనే రికార్డు స్థాయిలో 500 మిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగినట్టు తెలిపారు. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం విషయంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఎంతో ప్రగతి సాధించామని, 2021లో ఒకే రోజు 25 మిలియన్ కోవిడ్-19 వ్యాక్సిన్లు వేశామని చెప్పారు. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్‌లో కూడా గ్లోబల్ లీడర్‌గా భారత్ నిలిచిందని చెప్పారు. ఆపన్న దేశాలకు 300 మిలియన్ వాక్సిన్లు ఎగుమతి చేశామని తెలిపారు. మౌలిక వసతులకల్పన ఊపందుకుందని, 66 ఏళ్లలో 91,000 కిలోమీటర్ల మేర హైవేలు నిర్మిస్తే, తమ ప్రభుత్వం గత పదేళ్లలో మరో 54,000 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను విస్తరించిందని మోదీ తెలిపారు. ఆర్థిక వృద్ధి, కనెక్టివిటీ, వాణిజ్యం, ఉద్యోగ అవకాశాలు దేశవ్యాప్తంగా పెరగడానికి ఈ చర్యలు దోహడపడ్డాయని చెప్పారు. గత దశాబ్ద కాలంలో 1.5 లక్షలకు పైగా స్టార్టప్‌లు రిజిస్టర్ అయ్యాయని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలతో మార్కెట్ నుంచి సానుకూల స్పందన రావడంతో పాటు రిటైల్ ఇన్వెస్టర్ల బేస్ పెరిగిదంన్నారు. మ్యూచ్యువల్ ఫండ్స్ ద్వారా ఫైనాన్షియల్ మార్కెట్‌లో ప్రజల పార్టిసిపేషన్ పెరగడం కూడా ఇండియాస్ గ్రోత్ స్టోరీని, దీర్ఘ కాలిక అవకాశాలను ప్రతిబింబిస్తోందని అన్నారు. 'వికసిత్ భారత్' దిశగా 2025లోనూ మరింత ముందుకు అడుగులు వేయడం ద్వారా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం కలను సాకారం చేద్దామని ప్రధాని అభిలషించారు.

మణిపూర్ ప్రజలకు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ క్షమాపణలు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రజలకు ఎంతో కష్టంగా గడిచిపోయిందని, ఎంతో మంది తమ కుటుంబాలను కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తెగల వైరంతో దాదాపు 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని బీరేన్ సింగ్ చెప్పారు. చాలామంది ఇళ్లను వదిలిపెట్టి పోయారని తెలిపారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, 625 మంది నిందితులు అరెస్టయ్యారని చెప్పారు. పోలీసులు మొత్తం 5,600 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. అయితే గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో శాంతి నెలకొందని బీరేన్ సింగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తగినంత భద్రతా సిబ్బందిని పంపిందని చెప్పారు. కొత్త సంవత్సరంలో పూర్తిస్థాయిలో శాంతి స్థాపన జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన తప్పిదాలను క్షమించుదామని, చేదు జ్ఞాపకాలను మర్చిపోదామని చెప్పారు. అన్ని జాతుల ప్రజలు కలసికట్టుగా జీవించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త సంవత్సరంలో అందరం కొత్త జీవితాలను ప్రారంభిద్దామని బీరెన్‌ సింగ్‌ పిలుపునిచ్చారు.

ఇన్ఫోసిస్ మైసూరు ప్రాంగణంలో పనిచేసే ఉద్యోగులకు వార్నింగ్ మెయిల్స్ పంపించింది. ఈ మెయిల్స్ సారాంశం ఏంటంటే ఇక నుంచి ఆ బ్రాంచ్ ఉద్యోగులంతా ఇంట్లోంచే పని చేయాలి. తిరిగి చెప్పేవరకు ఇంట్లోంచే పనిచేయాల్సి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే ప్రమాదంలో పడతారని కూడా హెచ్చరించింది. హెచ్‌ఆర్ నుంచి ఈ మెయిల్స్ ఉద్యోగులందరికీ  వెళ్లింది. ఇన్ఫోసిస్ మైసూరు ప్రాంగణం ఉన్న హెబ్బాల్ ఇండస్ట్రియల్ ఏరియా రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలో ఉంది. ఈ ప్రాంతమంతా చిరుత పులులకు నిలయం. ఈ మధ్య రెండు మూడ్రోజులుగా క్యాంపస్‌లో చిరుత పులులు తిరుగుతూ కన్పించాయి. దాంతో ఉద్యోగుల రక్షణార్ధం సంస్థ అందరికీ వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. అటు అటవీశా, ఇటు టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో జల్లెడ పడుతోంది. ఈ ప్రాంగణంలో చిరుత పులులు సంచరించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా అంటే 2011లో ఓ చిరుత ఇలానే హల్‌చల్ చేసింది. ఇప్పుడు మరోసారి చిరుత సంచారం ఉండటంతో కంపెనీ ఉద్యోగుల్ని ఇంట్లోంచి పని చేసుకోమని స్పష్టం చేసింది.

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేరును మార్చుకోవడంపై సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ గా మారింది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఒకవైపు బిజినెస్, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న మస్క్, తాజాగా తన ఎక్స్ అకౌంట్ పేరును 'కేకియస్ మాక్సిమస్'గా మార్చుకున్నారు. వినడానికి ఈ పేరు వింతగా ఉన్నప్పటికీ దీనికో అర్థం కూడా ఉంది. కేకియస్ అనేది ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్. ఇది అనేక బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. ఇలాన్ మస్క్ క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇస్తున్నారనే విషయం అందరికి తెలుసు. ఇందులో భాగంగానే తన ఎక్స్ ఖాతా పేరును క్రిప్టో కరెన్సీ అర్థం వచ్చేలా మార్చుకున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2023లో కూడా తన ఎక్స్ అకౌంట్ పేరును 'మిస్టర్ ట్వీట్'గా మార్చుకున్నారు.

దేశంలో 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.4,000 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7110, ముంబైలో రూ.7110, దిల్లీలో రూ.7125, కలకత్తాలో రూ.7110, బెంగళూరులో రూ.7110, కేరళలో రూ.7110, వడోదరలో రూ.7115, అహ్మదాబాదులో రూ.7115, జైపూరులో రూ.7166, లక్నోలో రూ.7166, కోయంబత్తూరులో రూ.7151, మధురైలో రూ.7151, మంగళూరులో రూ.7110, నాశిక్ లో రూ.7113, అయోధ్యలో రూ.7125, బళ్లారిలో రూ.7110, గురుగ్రాములో రూ.7125, నోయిడాలో రూ.7125 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. వెండి ధర కేజీకి నేడు రూ.2000 తగ్గి రూ.98,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్‌ నివాసి తన కుమార్తె, మేనకోడలుతో కలిసి బైకుపై బయటికి వచ్చాడు. వారు సోన్‌బర్సా మార్కెట్‌ ఏరియాలోని డంపింగ్‌ యార్డు దగ్గరికి చేరుకోగానే, వారి పైనున్న 11 కేవీ విద్యుత్‌ వైర్లపై కోతి దూకింది. దాంతో ఓ వైర్‌ తెగి బైక్‌పై పడింది. దాంతో ముగ్గురూ విద్యుత్‌ అఘాతానికి గురయ్యారు. అందరూ చూస్తుండగానే క్షణాల్లో ముగ్గురూ అగ్నికి ఆహుతయ్యారు. వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కోతి దూకడంవల్లే విద్యుత్‌ వైర్‌ తెగిపడిందని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని విద్యుత్‌ అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ లబ్దిదారుడు ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేశారు. ఆ తర్వాత ఆ కాఫీని ఆయన సేవించడంతో పాటు ఆ లబ్దిదారుడు కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చారు. ఆ తర్వాత వారికి నెలవారి పెన్షన్ సొమ్మును పంపిణీ చేశారు. ఒకటో తేదీకి ఒక రోజు ముందుగానే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను మంగళవారం పంపిణీ చేసిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆయన పల్నాడు జిల్లాలో జరిగిన పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 66,77,943 మంది లబ్దిదారులకు పింఛన్ల కోసం రూ.2717 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పింఛన్ల పంపిణీ మంగళవారం మధ్యాహ్నానికి 90 శాతం మేరకు పూర్తి చేశారు. పల్నాడు జిల్లా యలమందలో ఆయన పర్యటించి, శారమ్మ అనే వితంతువు ఇంటికి వెళ్లి పింఛన్ నగదును అందజేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆమె భర్త చనిపోయారు. వారి కుటుంబ పరిస్థితి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ చదువుతున్న శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. సెల్ ఫోన్ షాపు పెట్టుకుంటానన్న ఆమె కుమారుడుకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష రుణం, మరో రూ.2 లక్షలు సబ్సీడీగా ఇప్పించాలని అధికారులను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 

హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ భగీరథమ్మ చెరువు బఫర్ జోన్ లోని అక్రమ నిర్మాణాలను అధికారులు జేసీబీలతో హైడ్రా కూల్చివేయిస్తున్నారు. ఈ చెరువు బఫర్ జోన్లోని రెండు ఎకరాల స్థలంలోని కొంత భాగంలో ఇటీవల ఆక్రమణదారులు రేకుల షెడ్లు నిర్మించారు. ఈ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం నాడు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి భగీరథమ్మ చెరువు వద్దకు చేరుకొని జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేశారు.

తెలంగాణ కేబినెట్ సమావేశం జనవరి 4వ తేదీన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం, కొత్త రేషన్ కార్డులు, ఎస్పీ వర్గీకరణ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో ఈ కేబినెట్ భేటీపై ఆయా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సంక్రాంతి నుంచే రైతు భరోసా పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతు భరోసా ఎవరికి ఇవ్వాలన్న దానితో పాటు కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాల ఖరారుపై సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వ్యవసాయ యాంత్రీకరణ, వీఆర్వో వ్యవస్థ, భూ భారతి అమలు వంటి అంశాలపై కూడా చర్చించనున్నట్టుగా సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నానిపై మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఆయనను ఏ6గా పోలీసులు తెలపగా. తనపై కేసు నమోదైన కాసేపటికే పేర్ని నాని ఏపీ హైర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. పేర్ని నాని పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు పేర్ని నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. పీడీఎస్‌ బియ్యం మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాజీ మంత్రి పేర్ని నాని అలియాస్‌ పేర్ని వెంకటరామయ్యపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కృష్ణా జిల్లా బందర్ పోలీసులు పేర్ని నానిని ఆరో నిందితుడిగా చేర్చారు. పేర్ని నాని భార్య జయసుధ ప్రధాన నిందితురాలిగా ఉన్న ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. జయసుధకు స్థానిక కోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రెండో నిందితుడు మానస తేజ, మేనేజర్‌ నాని, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్‌ మేనేజర్‌ కోటిరెడ్డి, రైస్‌ మిల్లర్‌ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్‌ మంగారావులను అరెస్టు చేశారు.

దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఎక్స్ ప్రెస్ వే, జాతీయ రహదారుల మీద వాహనాలు నడిపే డ్రైవర్లను మార్గనిర్దేశం చేయడానికి, వారిని అప్రమత్తం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ వే మీద ప్రతి 10 కిలోమీటర్లకు వాహన లోగోలతో వేగ పరిమితిని సూచించేలా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పాయింట్లు, డైవర్షన్ లాంటి వివరాలు సైతం సైన్ బోర్డులో కనిపించాలని కొత్త రూల్స్ తీసుకువస్తోంది. రహదారి యాజమాన్య ఏజెన్సీలు ప్రమాదాలను నివారించడంలో భాగంగా ప్రతి పది కిలోమీటర్లకు వేగ పరిమితిని సూచించేలా సైన్ బోర్డుల ఏర్పాటు తప్పనిసరి చేసింది. ఫిబ్రవరి, 2025 నుంచి ఎక్స్ప్రెస్వేలు, నేషనల్ హైవేలపై ఇది అమలులోకి రానుంది. ఇలా చేయడాన్ని రోడ్డు పరిభాషలో డ్రైవర్లకు సూచనలు ఇవ్వడం లాంటిది, వారిని ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరగకుండా అలర్ట్ చేయడం లాంటిది. సైన్ బోర్డులు ద్వారా డ్రైవర్లకు మార్గనిర్దేశం చేయడం ద్వారా వేగం నియంత్రణలో ఉంటే ప్రమాదాలు తగ్గుతాయని రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ భావిస్తోంది. స్పీడ్ లిమిట్స్ తో పాటు ఎగ్టిట్ పాయింట్స్ మీద అవగాహన కోసం కొన్ని సైన్ బోర్డులు ఉండటం మంచిదని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే నేషనల్ హైవేల మీద ప్రతి 10 కిలోమీటర్లకు ఓ చోట వేగ పరిమితిని సూచించేలా సైన్ బోర్డులు, ఎగ్జిట్ పాయింట్లకు సంబంధించి వివరాలు ఉండేలా చూసుకోవాలని ఇటీవల పేర్కొంది. అదే విధంగా ప్రతి 5 కిలోమీటర్లకు ఓ చోట నో పార్కింగ్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఓ చోట ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ సైతం డిస్ ప్లే చేయాలని గైడ్ లైన్స్ సిద్ధం చేశారు. ఫిబ్రవరి నుంచి సరికొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి.

తిరుమలలో వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులు శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా జారీ చేయనున్న సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లు, బారీకేడ్లు, షెడ్లు, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతి, తిరుమలలో జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తారు. తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, భైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా 13 నుండి 19వ తేదీ వరకు ఏ రోజుకారోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 రోజుల పాటు సిఫార్సు లేఖలను రద్దు చేశారు. అయితే ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. అదేవిధంగా చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజులపాటు టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతించనున్నట్టుగా ఇప్పటికే టీటీడీ స్పష్టం చేసింది. ఇక, శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తులు వారి ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని.. టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్‌లను కూడా జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని మరోసారి టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జనవరి 17, 18న జరిగే "భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025" ఈవెంట్‌లో లాంచ్‌ అయ్యే కొత్త కార్లు, బైక్స్‌ కోసం ఆటోమొబైల్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాహన తయారీ సంస్థలు కూడా తమ కొత్త వెహికల్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు తమ వాహనాలకు సంబంధించిన గ్లింప్స్‌ని కూడా విడుదల చేశాయి. ఇదే కోవలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టూ-వీలర్స్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ కూడా కొత్త స్కూటర్‌నిని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా.. తమ బ్రాండ్ నుంచి పేరొందిన హీరో డెస్టినీ 125ని సరికొత్త అవతారంలో లాంచ్‌ చేయనుంది. సరికొత్త డెస్టినీ 125 స్కూటర్‌ని త్వరలో తీసుకురానున్నట్లు ఇదివరకే హీరో సంస్థ ప్రకటించింది. అయితే దీని లాంచ్‌ తేదీ మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఆటో ఎక్స్ పో 2025 లోనే ఈ స్కూటర్‌ని లాంచ్‌ చేసే అవకాశం ఉంది. ఈ స్కూటర్‌ను హీరో సంస్థ తొలుత 2024 లోనే విడుదల చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల రీత్యా దీని విడుదలను వాయిదా వేసింది. ఇప్పుడు ఆటో ఎక్స్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ స్కూటర్ ఫ్రంట్‌ మోడ్రన్‌ రెట్రో లుక్‌లో కనిపించనుంది. ఈ స్కూటర్‌లో కొత్త డిజైన్‌లో హెడ్‌లైట్స్, సైడ్ ప్యానల్స్ స్టైలిష్ లుక్‌ను అందించనున్నాయి. ఈ స్కూటర్‌లోని టాప్ వేరియంట్ పూర్తిగా బ్లాక్ షేడ్‌లో దర్శనమివ్వనుంది. ఈ స్కూటర్‌లో కొత్తగా ఆప్రాన్, మిర్రర్ర్స్, సైడ్ ప్యానెల్, టెయిల్‌ల్యాంప్స్‌ కాపర్ ఇన్‌సర్ట్‌ని కలిగి ఉంటుంది. అందువల్ల లుక్‌ డిఫరెంట్‌గా ఉండనుంది. అంతేగాకుండా డార్క్ బ్రౌన్ కలర్‌లో ఉండే ఫ్లోర్ బోర్డ్ కలదు. వెడల్పుగా, పొడవుగా ఉండే సౌకర్యవంతమైన రైడింగ్ సౌకర్యంతో వస్తుంది. దీంతో పాటు సీటు వెనకాల ఉండే గ్రాబ్- రెయిల్ నడుముకు ఆనుకునేలా ఉండి, ప్రయాణికులకు కంఫర్ట్ సీటింగ్ అనుభూతిని ఇస్తుంది. ఈ స్కూటర్ ఇంకా మరెన్నో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను కలిగి ఉంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, నేవిగేషన్ సదుపాయాలు డెస్టినీ 125 స్కూటర్‌లో ఉన్నాయి. ఇక దీని పవర్‌ట్రైన్ విషయానికి వస్తే.. ఇది 125 సీసీ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 7,000 rpm వద్ద 9 bhp పవర్‌ అలాగే 5,500 rpm వద్ద 10.4 Nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ స్కూటర్ అలాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. కోపిక్ ఫోర్క్ మోనోోషాక్‌తో ఈ స్కూటర్ ఫ్రేమ్ డిజైన్ చేశారు. దీని బ్రేకింగ్ డ్యూటీస్‌ను పరిశీలిస్తే.. ముందు భాగంలో డిస్క్ బ్రేక్ ఉండగా, వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్‌తో ఉంది. అయితే ఎంట్రీ లెవెల్ వేరియంట్‌లో మాత్రం డ్రమ్ బ్రేక్‌ ఉండనుంది. ఇది హోండా యాక్టివా 125, సుజుకీ 125, టీవీఎస్ జూపిటర్ 125 వంటి ఇతర స్కూటర్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని ధర రూ.80,000 నుంచి రూ.85,000 మధ్య ఉండనుందని అంచనా. అంతేకాకుండా దీని మైలేజ్ కూడా మెరుగ్గానే ఉండనున్నట్లు తెలుస్తోంది. దీని స్టైలిష్ లుక్ సహా లో-మెయింటినెన్స్ కారణంగా ఇది కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటుందంని హీరో సంస్థ భావిస్తోంది. ఈ ఈవెంట్లో 50 కి పైగా దేశాల నుంచి దాదాపు 35కు పైగా వాహన తయారీ సంస్థలు పాల్గొననున్నాయి. ఆటోమొబైల్స్ ఆటో కాంపోనెంట్స్, టైర్లు, ఈ మొబిలిటీ, సాఫ్ట్‌వేర్, స్టీల్ బ్యాటరీస్ సంబంధిత విషయాలను కంపెనీలు పరిచయం చేయనున్నాయి.

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ డీసీ) ఏర్పాటుచేసిన స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ఏఐ, డ్రోన్ టెక్నాలజీ, డేటా సైన్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్‌లోని కోర్సుల కోసం సమగ్ర కేంద్రంగా మారింది. 2025 నాటికి 1 లక్ష మంది యువతను ఈ రంగాల్లో నైపుణ్యాలతో శిక్షణ ఇవ్వాలని ఎన్ఎస్ డీసీలక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం, ఈ పోర్టల్ 500కి పైగా కోర్సులను అందిస్తుంది, వీటిలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలు ఉన్నాయి. వ్యవసాయం మరియు సైబర్ భద్రతలో ఏఐ ఆధారిత పరిష్కారాలపై ప్రత్యేక కోర్సుల పరిచయానికి కూడా ప్రాముఖ్యత లభించింది. మెటా, మైక్రోసాఫ్ట్ వంటి టెక్నాలజీ దిగ్గజాలతో భాగస్వామ్యాలు, ఏఐఆధారిత అభ్యాసానికి అనువైన అనుభవాలను అందించాయి. ఎన్ఎస్ డీసీ వివిధ ఆర్థిక సహకారాలను కూడా అందిస్తుంది. ఐటీ, తయారీ రంగాల్లో 3.5 శాతం వృద్ధిని సాధించిన ఈ సంస్థ 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీ సాధించడానికి కృషి చేస్తుంది. రాబోయే ఐదేళ్లలో ఏఐ, రోబోటిక్స్ వంటి కొత్త-యుగం రంగాలలో ఎన్ఎస్ డీసీ 5 మిలియన్లకు పైగా ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా వేయబడింది. ఎన్ఎస్ డీసీ పరిశ్రమ 4.0 సాంకేతికతలకు సంబంధించిన కోర్సులపై దృష్టి సారించి, గ్రాడ్యుయేట్లను నేటి పరిశ్రమకు అనుగుణంగా శిక్షణ ఇచ్చేలా చూస్తుంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాల ద్వారా గ్లోబల్ ఎంప్లాయబిలిటీని పెంచి, డబుల్ సర్టిఫికేషన్ సాధించడం సాధ్యమైంది. లింగ సమానత్వం మరియు సాధికారత కోసం జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా, ఎన్ఎస్ డీసీ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు ప్రారంభించింది. బ్రిటానియా ఇండస్ట్రీస్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వంటి సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పడి, 2025 నాటికి 10,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను సాధికారత కల్పించేందుకు ఎన్ఎస్ డీసీ సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమంలో అత్యంత విజయవంతమైన వ్యవస్థాపకులకు రూ. 10 లక్షల విలువైన గ్రాంట్లు, వర్క్‌షాప్‌లకు యాక్సెస్ మరియు రూ. 150 కోట్ల వెంచర్ క్యాపిటల్ పూల్‌ను అందిస్తుంది. ఈ కార్యక్రమాలు 2040 నాటికి సుమారు 30 మిలియన్ల మహిళా-నేతృత్వ సంస్థలను సృష్టిస్తాయి, ఇది భారతదేశ జీడీపీలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉంటుంది. ఎన్ఎస్ డీసీ లక్ష మంది యువతకు నైపుణ్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ 505 జిల్లాల్లో 5,000 మందికి పైగా సీనియర్ సిటిజన్‌లను చేర్చుకుంటూ, దేశవ్యాప్త చేరికను పెంచుకుంటోంది. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) కింద ఎన్ఎస్ డీసీ యొక్క దృష్టి STEM, AI మరియు రోబోటిక్స్ కోర్సులపై ఉంది, ఇది పరిశ్రమ 4.0 డిమాండ్లను తీర్చడానికి నైపుణ్యాల్ని అభివృద్ధి చేయడానికి మద్దతు ఇస్తుంది. పీఎంకేవీవై 4.0 (2022-2026) ద్వారా 50 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో AI, రోబోటిక్స్ మరియు డ్రోన్‌లతో సహా 429 ఉద్యోగ పాత్రలను అందిస్తుంది. IITలు, IIMలు మరియు పరిశ్రమలతో కలిసి 'డ్రోన్ దీదీ' వంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడినవి. రూ. 12,000 కోట్ల బడ్జెట్‌తో, NSDC భారతదేశ శ్రామిక శక్తిని భవిష్యత్తు అవకాశాలకు సిద్ధం చేస్తోంది. 30 గంటల అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రాం ద్వారా, NSDC 10,000 మంది నిర్మాణ కార్మికులను ఇజ్రాయెల్‌కు పంపింది, వారి శిక్షణ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా చేయబడింది. మరోవైపు, ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ సాంప్రదాయ కళాకారులు మరియు హస్తకళాకారులను శక్తివంతం చేయడంపై దృష్టి సారించింది. ఈ పథకం రూ. 13,000 కోట్ల బడ్జెట్‌తో, టూల్‌కిట్ల కోసం రూ. 15,000 మరియు సబ్సిడీ వడ్డీ రేట్లలో రూ. 3 లక్షల వరకు కొలేటరల్-ఫ్రీ లోన్‌లు అందిస్తుంది. NSDC ఇంటర్నేషనల్ ద్వారా కూడా, భారతదేశం యొక్క ప్రపంచ శ్రామిక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇజ్రాయెల్‌లో 10,000 మంది నిర్మాణ కార్మికుల రిక్రూట్‌మెంట్‌ను సులభతరం చేసిన NSDC, సౌదీ అరేబియాలోని స్కిల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ద్వారా 25,000 మందిని అంచనా వేసింది, దాదాపు 24,000 మంది సర్టిఫికేట్ పొందారు.

దేశంలో యూరియా ఎరువు తర్వాత అత్యధికంగా వినియోగించే డై-అమ్మోనియం ఫాస్ఫేట్‌ (డీఏపీ) ఎరువు ధర జనవరి నుంచి పెరగొచ్చని తెలుస్తోంది. యాభై కిలోల బ్యాగ్‌పై కనీసంగా రూ.200 వరకు పెరిగే అవకాశముందని సమాచారం. డీఏపీ దిగుమతులకు కేంద్రం ఇప్పటివరకు అందించిన ప్రత్యేక ప్రోత్సాహకాల గడువు డిసెంబర్‌తో ముగియనుంది. దీని పొడిగింపుపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు, డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింతగా పడిపోయింది. ఈ నేపథ్యంలో దిగుమతి వ్యయం పెరిగి ఆమేరకు డీఏపీ ధర పెరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫాస్ఫేటిక్‌ ఎరువుల్లో 90 శాతం వరకు దిగుమతి చేసుకునేవే. దేశంలో ఏటా 100 లక్షల టన్నుల డీఏపీ వినియోగం అవుతుండగా, అందులో 60 లక్షల టన్నుల మేర దిగుమతి అవుతోంది. దేశీయ ఉత్పత్తికి ఉపయోగించే ముడి పదార్థాలైన రాక్‌ ఫాస్ఫేట్, ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ కూడా దిగుమతి చేసుకునేవే. డీఏపీ ధరను రైతులకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దిగమతులపై టన్నుకు రూ.3,500 ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తోంది. ఈ గడువు డిసెంబర్‌తో 31తో ముగియనుంది. ఈ ప్రోత్సాహకాల కొనసాగింపుపై ఇంతవరకు కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 50 కిలోల బ్యాగ్‌ ధర రూ.1,350 ఉండగా, అది 12-15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంటే సుమారు రూ.200 మేర పెరిగి రూ.1,550కి చేరే అవకాశముందని అంటున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు, చైనా నుంచి తగ్గిన ముడి సరుకు సరఫరా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో రవాణా పరమైన సవాళ్లు సైతం ధరల పెరుగుదలకు కారణాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీలో ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఎడిఆర్) విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.931 కోట్లు విలువ చేసే ఆస్తులతో అత్యంత సంపన్న ముఖ్యమంత్రి కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం రూ. 15 లక్షలతో అత్యంత పేద ముఖ్యమంత్రి. రాష్ట్ర శాసనసభలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రికి సగటు ఆస్తి రూ. 52.59 కోట్లు అని నివేదిక తెలియజేసింది. భారత తలసరి నికర జాతీయ ఆదాయం (ఎన్‌ఎన్‌ఐ) 2023-24కు సుమారు రూ. 185854 కాగా, ఒక ముఖ్యమంత్రి సగటు స్వీయ ఆదాయం రూ. 1364310. భారత సగటు తలసరి ఆదాయం కన్నాది సుమారు 7.3 రెట్లు అధికం. 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ రూ. 1630 కోట్లు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు రూ. 332 కోట్లకు పైగా విలువ చేసే మొత్తం ఆస్తులతో రెండవ సంపన్న ముఖ్యమంత్రి కాగా, కర్నాటక ముఖ్యమంత్రి ఆ జాబితాలో రూ. 51 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులతో మూడవ స్థానంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ. 55 లక్షలు విలువ చేసే ఆస్తులతో ఆ జాబితాలో రెండవ నిరుపేద సిఎం కాగా, పినరయి విజయన్ రూ. 118 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. ఖండుకు రూ. 180 కోట్ల మేరకు అత్యధికంగా అప్పులు ఉన్నాయి. సిద్ధరామయ్యకు రూ. 23 కోట్లు విలువ చేసే అప్పులు ఉన్నాయని, చంద్రబాబు నాయుడుకు రూ. 10 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 13 మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారని, 10  మంది ముఖ్యమంత్రులు హత్యా యత్నం, కిడ్నాపింగ్, లంచం, నేరపూర్వక బెదరింపు సహా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారని కూడా నివేదిక తెలిపింది. 31 మంది ముఖ్యమంత్రులలోకి ఇద్దరు మాత్రమే మహిళలు. 

తిరుమల ఆలయంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబుకు ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే సిఫారసు లేఖలపై చంద్రబాబుకు రేవంత్ రెడ్డి రాసిన లేఖను, దానికి రిప్లై ఇస్తూ చంద్రబాబు రాసిన లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చంద్రబాబు రాసిన లేఖలో తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల  సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. తెలంగాణ ప్రజలకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారితో వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, తెలంగాణ నుంచి ప్రతి రోజూ వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని గుర్తుచేశారు. శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, తెలుగు జాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఇక ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం (రూ.500/- టికెట్) కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్  (రూ. 300/- టికెట్) కొరకు రెండు లేఖలు స్వీకరించబడతాయని తెలిపారు. అంతేగాక ప్రతి లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయొచ్చని సీఎం చంద్రబాబు లేఖ ద్వారా వెల్లడించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి గత సంప్రదాయం ప్రకారం తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు ఇచ్చే విజ్ఞాపనల మేరకు స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కోరారు.

ఆంధ్రప్రదేశ్ లో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ తదితర దిగ్గజ పారిశ్రామిక సంస్థలు సహా పలు కంపెనీలు రాష్ట్రంలో మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న తొమ్మిది ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తెలిపింది. ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో వివిధ సంస్థలు ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుల గురించి సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం నిర్వహించారు. వాటిపై చర్చించి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామిక సంస్థలకు భూ కేటాయింపులతో పాటు అవసరమైన మౌలిక వసతులను శరవేగంగా కల్పించాలని, అదే సమయంలో ఒప్పందం ప్రకారం నిర్దిష్ట సమయంలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. తాజా ప్రాజెక్టులు, వాటి పెట్టుబడులు, తద్వారా లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. గత నెల 19న జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి కూడా చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

అమరావతి నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. ల్యాండ్ పూలింగ్ భూముల్లో మౌలిక వసతులను కల్పించేందుకు, ఇతర పనులకు సంబంధించిన టెండర్లను సీఆర్డీఏ అధికారులు ఆహ్వానించారు. ప్రపంచబ్యాంకు ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం నిధులు విడుదలకు అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఈ టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. పనులకు సంబంధించి టెండర్లలో పనులు చేపట్టనున్న కంపెనీలు తమ ధరలను కోట్ చేయాల్సి ఉంది. అయితే దీనిని వచ్చే నెల రెండో వారంలో ఖరారు చేయనున్నారు. వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు నూతన భవనాల నిర్మాణంతో పాటు వివిధ రకాల మౌలిక సదుపాయల కల్పనకు ఈ టెండర్లను సీఆర్డీఏ ఆహ్వానించింది. 

కేరళలోని కొచ్చిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో పన్నెండు వేల మందికిపైగా భరతనాట్యం డాన్సర్లతో నిర్వాహకులు రికార్డు చేపట్టాలన్న లక్ష్యంతో ఓ భారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పన్నెండు వేల మంది డాన్సర్లు కావడంతో అతి పెద్ద వేదిక నిర్మించారు. ముఖ్య అతిధిగా కేరళ సాంస్కృతిక మంత్రిని ఆహ్వానించారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆహ్వానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పద్దెనిమిది అడుగుల ఎత్తులో ముఖ్యులంతదరికీ సీట్లు ఏర్పాటు చేశారు. పలువురు వీఐపీలకు అంచున సీట్లు వేశారు. ఉమాధామస్ కూర్చున్న చోట ఒరిగిపోయింది. దీంతో ఆమె వెనక్కి పడిపోయారు. పద్దెనిమిది అడుగుల ఎత్తు నుంచి ఆమె ఒక్క సారిగా కింద పడిపోయారు. అక్కడ వేదిక నిర్మాణం కోసం పెట్టిన కర్రలు ఉండటంతో వాటి మీద పడ్డారు. దానితో నేరుగా తలకు దెబ్బతగిలింది. షాక్ కు గురైన నిర్వాహకులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అంత ఎత్తు నుంచి పడటం వల్ బ్రెయిన్ తో పాటు శరీరంలో పలు చోట్ల బ్లెడ్ క్లాట్ అయిందని వైద్యులు చెప్పారు. కొద్ది కొద్దిగా ఆమె పరిస్థితి మెరుగు అవుతున్నప్పటికీ కోమాలోనే ఉన్నారని వైద్యులు ప్రకటించారు. సరైన ఏర్పాట్లు చేయని భరత నాట్యం ప్రదర్శన నిర్వాహకులపై పోలీసులు కేసులు పెట్టారు.

చుండ్రు కొంతమందిని సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ డాండ్రఫ్ కారణంగా నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. తలపై నుంచి తెల్లటి తెల్లగా ఒక పదార్థం రాళ్లతో ఉండడంతో చాలామందిని అది ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. దీంతో చుండ్రు సమస్య తగ్గడం కోసం ఎన్నెన్నో షాంపూలు ప్రయత్నిస్తూ ఉంటారు. రకరకాల ఆయిల్స్ తో పాటు హోం రెమిడీస్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ మంచి ఫలితాలు కనిపించవు. వేపాకు జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఎంతో బాగా పని చేస్తుందని చెబుతున్నారు. వేపాకులో ఉండే ఔషద లక్షణాలు జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. అలాగే నెత్తి చికాకును కూడా తగ్గించడానికి సహాయపడుతుందట. వేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్ ఇ తో పాటుగా ఎన్నో రకాల మినరల్స్ పుష్కలంగా ఉంటాయట. అయితే ఇవన్నీ కూడా మన జుట్టు రాలడాన్ని తగ్గించి చుండ్రు లేకుండా చేయడానికి సహాయపడతాయని చెబుతున్నారు. వేపాకును జుట్టుకు పెట్టడం వల్ల మన జుట్టు మూలాల నుంచి బలంగా అవుతుందట. ఆరోగ్యంగా కూడా ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఆకులు నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతాయట. దీంతో మీ జుట్టు బలంగా, హెల్తీగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే వేపాకులు జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయట. అలాగే నెత్తిని పరిశుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయని చెబుతున్నారు. చుండ్రు సమస్య పోవడానికి.. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె లేదా కొన్ని చుక్కల ఆవనూనె తీసుకోవాలి. దీనిలో వేపాకు పేస్ట్ ను వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని నెత్తి మీది నుంచి వెంట్రుకల చివర్ల వరకు బాగా అప్లై చేసి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. అలాగే ఒక గిన్నెలో కొన్ని వేప ఆకులను, తేనె, నెయ్యి వేసి బాగా కలపి దీన్ని పేస్ట్ లా చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద రెండు మూడు నిమిషాలు వేడి చేయాలి. ఇది చల్లారిన తర్వాత నెత్తికి, జుట్టుకు పెట్టాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. అదేవిధంగా వేపాకులను మెత్తగా నూరి అందులో పెరుగు వేసి బాగా కలిపి జుట్టుకు అప్లై చేసి ఐదారు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అర్ధ గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు సమస్య ఈజీగా తగ్గుతుంది. అలాగే కొన్ని మరిగించిన నీళ్లలో కొన్న వేపాకులు, టీ స్పూన్ తేనె వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీళ్లను వడకట్టాలి. ఆకులను పేస్ట్ లా చేయాలి. దీన్ని నెత్తికి, జుట్టుకు బాగా పట్టించాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత తలను షాంపూతో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఈజీగా చుండ్రు సమస్య తగ్గుతుందని చెబుతున్నారు.

ప్రకటనలు ఏవీ లేకుండా ఉద్యోగులు తమంత తామే ఉద్యోగాలు వదిలిపెట్టి పారిపోయేలా కంపెనీలు పరోక్షంగా ఒత్తిడి (సైలెంట్‌ ఫైరింగ్‌) చేస్తున్నాయి. తాజాగా ఈ ధోరణి బాగా పెరిగిందని స్టాఫింగ్‌ సొల్యూషన్స్‌, హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ కంపెనీ జీనియస్‌ కన్సల్టెంట్స్‌ తాజా నివేదికలో తెలిపింది. అవసరాన్ని మించి ఉన్న ఉద్యోగులను తొలగించడానికి లేఆఫ్‌ బాట పడుతున్నట్టు 10 కంపెనీలు తెలిపాయి. 79 కంపెనీలు మాత్రం కొత్త టెక్నాలజీలు అలవరచుకునేలా తమ ఉద్యో గుల నైపుణ్యాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించాయి. పనితీరు సంతృప్తికరంగా లేని వారిపై అధిక పనిభారం వేసి వారు ఉద్యోగం వదులుకుని పోయేలా వ్యూహాన్ని తాము అనుసరిస్తున్నట్టు 6 కంపెనీలు తెలిపాయి. మొత్తం 1,223 కంపెనీలు, 1,069 మంది ఉద్యోగులను ఈ సర్వే సందర్భంగా ప్రశ్నించి నివేదిక రూపొందించారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ఆధునిక టెక్నాలజీల వినియోగాన్ని పెంచి ఉద్యోగుల అవసరం కనిష్ఠ స్థాయికి తగ్గించుకోవాలనుకుంటున్నట్టు 39ు యాజమాన్యా లు తెలిపాయి. అయితే 31ు మంది మాత్రం ఆధునిక టెక్నాలజీలు ఉపయోగించుకుంటూనే సమాంతరంగా మానవ వనరులను వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాయి. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, జెనరేటివ్‌ ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ రంగాల్లో 2030 నాటికి 10 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయని క్వెస్‌ ఐటీ స్టాఫిం గ్‌ తాజా నివేదికలో అంచనా వేసింది. అదే కాలంలో కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా సైన్స్‌, బ్లాక్‌ చెయిన్‌ వంటి ఆధునిక టెక్నాలజీలు ఆర్థిక వ్యవస్థకు 15 వేల కోట్ల డాలర్ల (రూ.12.75 లక్షల కోట్లు) వాటాను అందిస్తాయని అంచనా వేసింది. 43.5 శాతం వాటాతో టెక్నాలజీ రంగంలో నియామకాలకు బెంగళూరు కేంద్ర స్థానంగా కొనసాగుతుందని కూడా తెలిపింది. 13.4 శాతం వాటాతో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలుస్తుందని పేర్కొంది.

తమ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌పై చైనా సైబర్ దాడులకు పాల్పడినట్లు గుర్తించామని అమెరికా పేర్కొంది. వర్క్‌స్టేషన్లలో కీలకమైన పత్రాలను దొంగిలించేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది. కాంగ్రెస్‌కు రాసిన లేఖలో ఈ విషయాలను వెల్లడించినట్లు ఓ మీడియా సంస్థ బయటపెట్టింది. డిసెంబర్‌ ప్రారంభంలో ఈ సైబర్‌ దాడి జరిగింది. థర్డ్‌ పార్టీ సైబర్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ప్రొవైడర్‌ బియాండ్‌ ట్రస్ట్‌ నెట్‌వర్క్‌ లోపాలను వాడుకొని హ్యాకర్లు వర్క్‌స్టేషన్లు, కీలకమైన దస్త్రాలను యాక్సెస్ చేయగలిగారు. డిసెంబర్‌ 8న బియాండ్‌ ట్రస్ట్‌ అప్రమత్తమై ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చిందని ట్రెజరీ విభాగం అధికారి తెలిపారు. అనంతరం సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ, ఎఫ్‌బీఐ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు వెల్లడించారు. దీనిపై ఎఫ్‌బీఐ అధికారులు స్పందించలేదు. వాషింగ్టన్‌లోని బీజింగ్‌ రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది. 'మాపై అమెరికా చేస్తున్న నిరాధార ఆరోపణలను గట్టిగా వ్యతిరేకిస్తున్నాం' అని పేర్కొంది. మరోవైపు జార్జియాలోని బియాండ్‌ ట్రస్ట్‌ సైతం ఈ సైబర్‌ దాడిపై స్పందించలేదు. అయితే, వారి వెబ్‌సైట్‌లో.. ఇటీవల తమ కస్టమర్ల భద్రత ముప్పునకు సంబంధించిన ఘటనలు గుర్తించినట్లు తెలిపింది. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించింది. 'బియాండ్‌ ట్రస్ట్‌ వివరించిన భద్రతా సంఘటన ట్రెజరీ నివేదించిన హ్యాకింగ్‌ ఘటనకు దగ్గరగా ఉన్నట్లు గుర్తించాం. అయినప్పటికీ ఈ ఘటనపై విచారణ జరగాల్సి ఉంటుంది ' అని సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ అధికారి పేర్కొన్నారు. 

హైదరాబాద్‌ సిటీలో వెయ్యికిపైగా ఎలక్ర్టిక్‌ బస్సులు గ్రేటర్‌ రోడ్లపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఆర్టీసీ పనిచేస్తోంది. ఈవీ బస్సుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో అన్ని రూట్లలో వీటిని నడిపేలా రూట్‌ మ్యాప్‌లు సిద్ధం చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రద్దీప్రాంతాల్లో సూపర్‌ వైజర్లను నియమిస్తూ ప్రయాణికుల సంఖ్య పెంచుకునే అవకాశాలపై దృష్టిసారిస్తున్నారు. హయత్‌నగర్‌ డిపో 2కు త్వరలో 45 ఎలక్ర్టిక్‌ బస్సులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వాటిని ఏయే రూట్లలో నడపాలనే ముందస్తు రూట్‌మ్యా్‌పలు సిద్ధం చేస్తున్నారు. లాంగ్‌ రూట్లలో ఈవీ బస్సులు నడుపుతూ ఎలక్ర్టిక్‌ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ 90శాతం నమోదయ్యే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2025లో గ్రేటర్‌జోన్‌ పరిధిలోని 25 బస్‌డిపోల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేదిశగా ఆర్టీసీ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. శివారు ప్రాంతాల ప్రయాణికులే లక్ష్యంగా కొత్తరూట్లను ఆర్టీసీ సిద్ధం చేస్తోంది.

అదానీ విల్మర్ కంపెనీలో తమకు ఉన్న 31.06 శాతం వాటాను విల్మర్ కంపెనీకి అమ్మేస్తామని అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించింది. కంపెనీలో కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండాలనే నిబంధనలను అనుసరిస్తూ మిగతా 13 శాతం వాటాను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తామని వెల్లడించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ విక్రయించనున్న వాటాల విలువ దాదాపు రూ.16వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2025 మార్చి 31వ తేదీకి ముందే ఈ విక్రయ ప్రక్రియ పూర్తవుతుందని అదానీ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది. అదానీ విల్మర్ జాయింట్ వెంచర్‌ కంపెనీ బోర్డు నుంచి తాము నామినేట్‌ చేసిన డైరెక్టర్లు కూడా వైదొలగుతారని పేర్కొంది. అదానీ గ్రూప్‌ ఇకపై కేవలం ఇన్‌ఫ్రా రంగంపై ఫోకస్ చేయాలని భావిస్తోంది. అందుకే వంటనూనెల బిజినెస్ నుంచి తప్పుకుంటోంది. అదానీ గ్రూపునకు వెన్నెముక లాంటి అదానీ ఎంటర్‌ప్రైజెస్ రెవెన్యూ 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1.5 లక్షల కోట్లకు చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అదానీ ఎంటర్‌ప్రైజెస్ కింద అదానీ ఎయిర్‌పోర్ట్‌లు, సోలార్ మాడ్యుల్స్ తయారీ కంపెనీలు, విండ్‌ టర్బైన్‌లు, గ్రీన్ హైడ్రోజన్‌, రోడ్డు కన్‌స్ట్రక్షన్‌, డేటా సెంటర్, కాపర్ వ్యాపారాలు ఉన్నాయి. గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదైనా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు రికవర్ కాగలిగాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ కింద ఉన్న ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్ విలువ రూ.1.87 లక్షల కోట్లు, రోడ్డు కన్‌స్ట్రక్షన్ బిజినెస్ విలువ రూ.52,056 కోట్లు, కోల్‌ బిజినెస్ విలువ రూ.29,855 కోట్లు, డేటా సెంటర్ బిజినెస్ విలువ రూ.11,003 కోట్లు, గ్రీన్ హైడ్రోజన్‌ అండ్ క్లీన్ ఎనర్జీ బిజినెస్ విలువ రూ.1.86 లక్షల కోట్లు, కాపర్ బిజినెస్‌ విలువ రూ.27,442 కోట్లు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన ప్రశంసలపై కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ఏ విషయంలో ఆయనకు గొప్పగా కనిపించారో అంటూ సెటైర్లు వేశారు. ఇవాళ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుతో భేటీ తర్వాత మీడియా చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ చిట్ చాట్ లో పవన్ అల్లు అర్జున్ ను తప్పుబట్టారు. సంధ్య థియేటర ఘటన జరిగిన రెండో రోజే అల్లు అర్జున్ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లి పరామర్శిస్తే సరిపోయేదని, అల్లు అర్జున్ గోటితో పోయే దానికి గొడ్డలి వరకూ తెచ్చుకున్నారని పవన్ అన్నారు. సినిమా ఇండస్ట్రీ విషయంలో రేవంత్ రెడ్డి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారన్నారు. అభిమాని మృతిచెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలని, ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టైంది అన్నారు. అల్లుఅర్జునే కాదు, టీమ్‌ అయినా సంతాపం తెలపాల్సిదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పేరు చెప్పలేదని, అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారనడం సరికాదంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారంటూ పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. దీనిపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పవన్ కు రేవంత్ లో ఏం కనిపించిందో తెలియడం లేదన్నారు. పవన్ కు రేవంత్ ఏ యాంగిల్ లో గొప్పగా కనిపించాడో అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయనందుకు నచ్చారా అని పవన్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. గతంలో అల్లు అర్డున్ పై రేవంత్ రెడ్డి సర్కార్ చర్యల్ని బీజేపీ తప్పుబట్టింది. ఇప్పుడు అదే రేవంత్ ను పవన్ వెనకేసుకు రావడం బండి సంజయ్ కు మింగుడు పడలేదు. 

హీరో మోటోకార్ప్ నుండి హోండా వరకు, ఆయా కంపెనీలకు చెందిన కొన్ని బైక్‌లు శాశ్వతంగా నిలిచిపోయాయి. ఈ బైక్‌ల ప్రొడక్షన్ నిలిపేయడానికి వాటికి ఆశించిన స్థాయిలో డిమాండ్, సేల్స్ లేకపోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. హీరో మోటార్‌కార్ప్ తన ఎంట్రీ లెవల్ బైక్ ప్యాషన్ ఎక్స్‌టెక్‌ను నిలిపివేసింది. సరైన అమ్మకాలు లేని కారణంగానే హీరో ఈ బైక్‌ను మార్కెట్ నుండి తొలగించాల్సి వచ్చింది. ఈ బైక్‌లో 113.2cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్ ఉంది. ఇది 9 Bhp పవర్, 9.79Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 10-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఈ బైక్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అందించారు. ఈ బైక్ ధర రూ. 81,775 గా ఉంది. హీరో మోటోకార్ప్ ఇండియాలో ఎక్స్‌ట్రీమ్ 200S 4Vని నిలిపివేసింది. సరైన అమ్మకాలు లేని కారణంగానే ఈ బైక్‌ను నిలిపివేయవలసి వచ్చింది. ఇది పూర్తి ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్. ఈ బైక్‌లో ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 18.9Bhp పవర్, 17.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ బైక్ ధర రూ. 1.43 లక్షల వరకు పలికింది. ఈ సంవత్సరం, హీరో మోటోకార్ప్ XPulse 200Tని నిలిపివేసింది. ఈ బైక్‌లో 199.5cc, సింగిల్ సిలిండర్, ఎయిర్-ఆయిల్-కూల్డ్, 4-వాల్వ్ ఇంజన్ ఉంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. 8,500 RPM వద్ద 18.9 Bhp పవర్, 6,500 RPM, 17.35Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అమ్మకాలు సరిగా లేకపోవడంతో కంపెనీ ఈ బైకుని నిలిపేసింది. కంపెనీ ఈ బైకును నిలిపేస్తున్నట్లు ప్రకటించేటప్పటికి ఈ బైక్ ధర రూ. 1.37 లక్షలుగా ఉంది. సెప్టెంబర్‌లో హోండా ఎక్స్-బ్లేడ్ బైక్‌ను కూడా నిలిపివేసింది. ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేని కారణంగా ఈ బైక్‌ను నిలిపివేయవలసి వచ్చిందని ఆ కంపెనీ ప్రకటించింది. 2018 లో మొదటిసారిగా ఈ బైక్ లాంచ్ అయింది.ఈ బైక్‌కు 162cc సింగిల్-సిలిండర్, PGM-Fi ఇంజన్ ఇచ్చారు. ఇది శక్తివంతమైన బైక్ అయినప్పటికీ కస్టమర్‌లు దీన్ని ఇష్టపడలేదు. కంపెనీ ప్రొడక్షన్ ఆపేసేనాటికి ఈ బైక్ ధర రూ.92,902 గా ఉంది. 

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు ఇవాళ ఊరట లభించింది. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు ఇవాళ స్థానిక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పేర్ని జయసుధ అరెస్టుకు ఓ మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె భర్త పేర్ని నాని తాజాగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో బెయిల్ మంజూరు ఆమెకు ఊరటనిచ్చింది. మచిలీపట్నంలో పేర్ని జయసుధకు చెందిన గోడౌన్ లో పౌరసరఫరాల శాఖ నిల్వ చేసిన రేషన్ బియ్యంలో 378 మెట్రిక్ టన్నుల మేర మాయమైనట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ఆమె గతంలో 1.68 కోట్ల రూపాయలు డీడీలు కూడా ప్రభుత్వానికి చెల్లించారు. అయితే ఇవాళ మరోసారి కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆమెకు నోటీసులు పంపారు. అప్పట్లో గుర్తించిన బియ్యానికి అదనంగా మరింత బియ్యం మాయమైనట్లు గుర్తించామని, ఇందుకు గానూ మరో 1.67 కోట్లు కట్టాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో తనపై నమోదు చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేయవచ్చన్న సమాచారంతో పేర్ని జయసుధ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్కడి నుంచే ఆమె కృష్ణా జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని షరతు పెట్టింది.

తెలంగాణ లో రాష్ట్ర వ్యాప్తంగా పది మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లను బదిలీ చేసింది సర్కార్. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. ఉట్నూర్‌ ఏఎస్పీగా కాజల్‌, ఆసిఫాబాద్‌ ఏఎస్పీగా చిత్తరంజన్‌, భువనగిరి ఏఎస్పీగా రాహుల్‌రెడ్డి, దేవరకొండ ఏఎస్పీగా మౌనిక, కామారెడ్డి ఏఎస్పీగా చైతన్యరెడ్డి, నిర్మల్‌ ఏఎస్పీగా రాజేష్ మీనా, జనగామ ఏఎస్పీగా చేతన్‌ నితిన్‌, కరీంనగర్‌ రూరల్‌ ఏఎస్పీగా శుభం ప్రకాష్‌, భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్, డీజీపీ ఆఫీస్‌కు అంకిత్‌కుమార్ అటాచ్‌.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికార వ్యవస్థను గత ఐదేళ్లలో చిందర వందర చేశారని, దాన్ని గాడిన పెట్టే పనిలోనే కూటమి ప్రభుత్వం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. ఇకపై నెలలో 14 రోజులు ప్రజల మధ్యే ఉంటానని, అందుకు అనుగుణంగా జిల్లా పర్యటనలు ఉంటాయని తెలిపారు. సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు. ''దశాబ్దన్నర కాలంగా నేను రాజకీయాల్లో ఉన్నా. ఇప్పుడు వచ్చింది సద్వినియోగం చేసుకోగలిగితే గొప్ప అవకాశమవుతుంది. కరిగిపోయిన ప్రతి సెకను తిరిగి రాదు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఉన్న సమయం సరిపోవడం లేదు. మేం కూడా నేర్చుకోవడానికి సమయంపడుతోంది. సమస్యలకు పరిష్కారాలు వెతికేలోపు వంద పిటిషన్లు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. చాలా మంది తమ సమస్య పరిష్కారమవుతుందని ఆశించి వస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. వీటన్నింటినీ సమన్వయ పరిచిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనకు స్ఫూర్తినింపే నాయకులు కావాలి. అప్పుడు స్వచ్ఛమైన, బాధ్యతయుతమైన ప్రభుత్వం ఇవ్వగలం. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేరు. రాష్ట్రంలో 70శాతం మంది పంచాయతీల్లోనే ఉన్నారు. ఆ శాఖ నాకొక వరం. ఇది వరకూ కార్యకర్తలు, వారి సమస్యల కోసం వెళ్లాను. ఇప్పుడు ప్రజా సమస్యల కోసం వెళ్తున్నా. పనిచేస్తున్న అధికారులపై దాడులు జరుగుతుంటే వెళ్లాల్సి వచ్చింది. స్థానిక నాయకుల నిర్లక్ష్యం కూడా కనపడుతోంది. దాన్ని బద్దలు కొట్టడానికి కడపకు వెళ్లాను. అభివృద్ధికి ఎవరు అడ్డు పడినా ఊరుకునేది లేదనే సందేశం ఇవ్వాలనుకున్నా, ఏజెన్సీ ప్రాంతాల్లో నేను చెప్పులు వేసుకుని నడుస్తుంటే, బురదలో ఇరుక్కుపోయాయి. తర్వాత వదిలేసి నడిచాను. ఈ అనుభవం ప్రతి నాయకుడికి అవసరం. నేను నడిచి చూపిస్తేనే ఇతరులకు ధైర్యం వస్తుంది. నా పేషీతో వెళ్లి జిల్లాల్లో కూర్చోవడం అవసరం. నేనేదో పనిమీద వెళ్లినప్పుడు చూడటం కాకుండా, అక్కడే క్యాంపు ఆఫీస్‌ పెడితే ప్రజల సమస్యలకు సత్వరం పరిష్కారం చూపగలం. అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలి. నెలలో 14 రోజులు జిల్లా పర్యటనలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అయితే, ఒక జిల్లానా? లేక రెండా? అనేది చూడాలి. సెక్యురిటీ, బస, ఆహార వసతులను కూడా చూసుకోవాలి. అధికార వ్యవస్థలో స్పందన అనేది కరవైంది. ఇటీవల కాకినాడలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు చనిపోయారు. అందులో ఒకబ్బాయి బ్రెయిన్‌ డెడ్‌ అయితే, అతడి అవయవాలను తల్లిదండ్రులు దానం చేశారు. వారు కోరుకున్నది ఏంటంటే, సింపుల్‌ సారీ. ఎవరు చేశారో కనుక్కోమని కోరుతూ కేసు ఫైల్‌ చేయమన్నారు. పోలీసు అధికారులు సరిగ్గా స్పందించలేదు. నా దృష్టికి రాగానే ఎస్పీతో మాట్లాడమని చెప్పా. నా పేషీలో ఉన్న అధికారులు మాట్లాడితే 'ఇవన్నీ జరుగుతుంటాయండీ.. పోలీసులంతే' అన్నారట. అలా ఎలా మాట్లాడతారు? మానవతా దృక్పథం లేకపోతే ఎందుకు? ఇలాంటి విషయాల్లో సమూల మార్పు తీసుకురావాలి''

''కొన్ని సమస్యల పరిష్కారం కోసం సీఎంగారు 14 గంటల పాటు అధికారులతో మీటింగ్‌ పెడతారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే సక్రమంగా పనిచేయాలి. నాణ్యమైన పని చేసినప్పుడు సెలవులు కూడా తీసుకోవచ్చు. అధికార వ్యవస్థలో సమయపాలన సరిగా లేదు. అద్భుతంగా పనిచేయాలంటే 8గంటలు చేసినా చాలు. గత ఐదేళ్లలో ఏపీలో అధికార వ్యవస్థ పనితీరు అట్టడుగు స్థాయికి వెళ్లిపోయిందని ఇటీవల దిల్లీలో చెప్పారు. వర్క్‌ కల్చర్‌ తగ్గించేశారు. గత ఐదేళ్లలో నాణ్యత పరిశీలన లేకపోవడంతో ఇప్పుడది అలవాటు అయిపోయింది. ఆ అలవాటును మాన్పించడానికి మాకు సమయం పడుతుంది. ఈ క్రమంలో అధికారులు కొంత ఇబ్బంది పడొచ్చు. శని, ఆదివారాలు విశ్రాంతి తీసుకోవాలంటే, మిగిలిన రోజులు బాగా పనిచేయాలి. ఐదు రోజులు బలంగా పనిచేస్తే, సెలవు కూడా బాగుంటుంది. అధికార యంత్రాంగాన్ని పటిష్ఠం చేయడమే జిల్లాల పర్యటన ఉద్దేశం. అధికార వ్యవస్థను చిందర వందర చేశారు. 'తప్పు జరుగుతుంటే మీరెందుకు ప్రశ్నించలేదు' అని మేము అడుగుతుంటే, ఎవరూ నోరు మెదపడం లేదు. భయపడుతున్నారు. 'అధికారులం కదా మేమేం చేస్తాం' అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమని తాము సమీక్షించుకోవాలి. మా ఆర్నెల్ల పాలన, వాళ్ల తొలి ఆర్నెల పాలన పోల్చండి. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని నలిపేశారు. వర్క్‌ కల్చర్‌ చంపేశారు. ప్రజల అంచనాలు చూస్తే భారీగా ఉన్నాయి. ప్రతి నెల జీతాలు, పెన్షన్లు సమయానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సివిల్‌ సప్లయ్‌లో కుంభకోణాలు బయటపెట్టాం. గత ఐదేళ్లలో లంచాల లేకుండా బదిలీలు జరగలేదు. మేము అధికారం చేపట్టిన తర్వాత మెరిట్‌ ఆధారంగా పోస్టులు ఇచ్చాం. కొంతమంది లిస్ట్‌లో తమ పేర్లు చూసుకుని ఆశ్చర్యపోయారు. పేరు తప్పు పడిందేమోనని అనుకున్నారు. నా పరిధిలో ఉండే అధికారులను చాలా స్పష్టతతో కేవలం మెరిట్‌ ఆధారంగా నియమించాం. దీన్ని కింది స్థాయి వరకూ తీసుకెళ్లాలి. 'ప్రతిభ ఆధారంగా మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచామో. మీ కింది వారినీ అలాగే తీసుకోండి' అని చెప్పాను. లంచాలు లేకుండా చూడాలని సూచించా. అవినీతి, లంచగొండితనం చాలా మందిలో జీర్ణించుకుపోయాయి. వీటిని ఎలాగైనా నిర్మూలించాలి'' అని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

దక్షిణ కొరియాలోని ముయాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన దుర్ఘటనతో అక్కడి ప్రజలు విమాన ప్రయాణాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది.  నిన్నటి నుంచి అక్కడ రద్దవుతున్న బుకింగ్సే ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకు దాదాపు 68వేల విమాన రిజర్వేషన్‌ బుకింగ్స్‌ రద్దయినట్లు జెజు ఎయిర్‌ వెల్లడించింది. వీటిలో 33వేలకు పైగా దేశీయ విమాన సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్‌ కాగా.. 34వేలకు పైగా అంతర్జాతీయం బుకింగ్స్‌ ఉన్నాయని పేర్కొంది. టూర్‌ ప్యాకేజీల క్యాన్సిలేషన్స్‌ పెరుగుతున్నట్లు స్థానిక ట్రావెల్‌ ఏజెన్సీలు చెబుతున్నట్లు అక్కడి పత్రికలు పేర్కొంటున్నాయి. ఆదివారం ఒక్కరోజే తమకు 40కి పైగా క్యాన్సిలేషన్‌కు సంబంధించిన ఎంక్వైరీలు వచ్చినట్లు ఓ ట్రావెలర్‌ తెలిపారు. బుకింగ్స్‌ దాదాపు 50శాతం మేర తగ్గినట్లు చెబుతున్నారు.

ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గుర్గావ్‌లో జాతీయ రహదారి 8పై వాణిజ్య ప్రకటనల బోర్డు ఏర్పాటు చేసేందుకు వెల్డింగ్‌ పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిప్పు రవ్వలు ఆ రోడ్డుపై వర్షంగా కురిశాయి. కదులుతున్న కార్లు, బస్సులు, బైక్‌లపై నిప్పురవ్వలు పడ్డాయి. ముందు జాగ్రత్త కోసం ఒక బస్సును డ్రైవర్‌ నిలిపివేశాడు. కాగా, ఒక డాక్టర్‌ ఈ వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 'గుర్గావ్‌లోని ఎన్‌హెచ్ 8పై దృశ్యాలు. ట్రాఫిక్ మళ్లింపు లేదా నియంత్రణ లేదు. అగ్నిమాపక భద్రతా జాగ్రత్తలు లేవు. వర్క్ జోన్ ఐసోలేషన్ లేదు. విపత్తుకు దారితీసే సరైన వేదిక' అని విమర్శించారు. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో అధికారుల నిర్లక్ష్యం, భద్రతా లోపాలపై నెటిజన్లు మండిపడ్డారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు స్పందించారు. మరోసారి ఇలా జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఆ లేన్‌ మూసివేస్తామని పేర్కొన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీని తాత్కాలిక సీఎంగా ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొనడంపై లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తనను బాధించిందన్నారు. ఒక ముఖ్యమంత్రిగా కేవలం ఆతిశీకే కాదని, రాష్ట్రపతి ప్రతినిధిగా తనకూ అవమానకరమని అన్నారు. కేజ్రీవాల్‌ చేస్తున్న ప్రకటనలు ఢిల్లీ ప్రభుత్వ తీరుపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంటూ సీఎంకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సుదీర్ఘ లేఖ రాశారు. ''కొన్ని రోజుల క్రితం మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ మిమ్మల్ని (ఆతిశీ) తాత్కాలిక ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు. అది నాకు చాలా అభ్యంతరకరంగా అనిపించింది. ఇది మీతో (సీఎం) పాటు మాకు కూడా అవమానకరమే. కేజ్రీవాల్‌ చెప్పిన తాత్కాలిక ముఖ్యమంత్రి అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేదే'' అని పేర్కొంటూ ముఖ్యమంత్రి అతిశీకి రాసిన లేఖలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పేర్కొన్నారు. సీఎంకు వ్యక్తిగతంగా ఈ లేఖ రాస్తున్నట్లు చెప్పిన ఎల్జీ.. ముఖ్యమంత్రి అతిశీపై ప్రశంసలు కురిపించారు. మునుపటి ముఖ్యమంత్రి మాదిరిగా కాకుండా అనేక శాఖలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. పాలనాపరంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. సీఎం అతిశీని నెగటీవ్‌గా చిత్రీకరిస్తూ ప్రచారం చేయడం తనను ఎంతో నిరాశకు గురిచేసిందన్నారు.

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతూ "పసలేని కేసులు పనికిమాలిన కేసులను ప్రభుత్వం పెడుతుంది. అవినీతి జరగనే లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ పేరుతో కేసులు పెడుతుంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ప్రభుత్వం తమ అధికార యంత్రాంగం చేతిలో ఉందని అడ్డగోలుగా కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. నేను మొదటి రోజు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నా ప్రభుత్వ నిర్ణయంగా ఒక మంత్రిగా నిర్ణయం తీసుకున్నా అదే మాటకు నేను కట్టుబడి ఉన్నాను. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటల్లోనే అవినీతి జరగలేదని చెప్పారు. అవినీతి ఎక్కడ ఉందని ముఖ్యమంత్రినీ అడిగితే చెప్పలేని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి ఫార్ములా-ఈ ప్రతినిధులతో కలిసిన ఫొటో బయట పెట్టడంతో ముఖ్యమంత్రి అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సస్పెండ్ చేస్తాను, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటానని బెదిరిస్తున్నారు. వాళ్లతో జరిగిన సమావేశాన్ని ఒక సంవత్సరం పాటు దాచి ఉంచారు. వాళ్ల దగ్గర డబ్బులు తీసుకున్నారని అనుమానం ఉంది. ఫార్ములా-ఈ సంస్ధ అనుచిత లబ్ధి పొందింది అన్నది వాస్తవమైతే, వాళ్లపైనే ఎందుకు కేసు పెట్టలేదు? ముఖ్యమంత్రి 600 కోట్లు అంటూ అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. కాంట్రాక్టులను రద్దు చేసుకోలేము అని చెబుతున్న ముఖ్యమంత్రి, ఫార్ములా-ఈ ని ఏ విధంగా రద్దు చేసుకున్నారు?" అని కేటీఆర్ ప్రశ్నించారు. దీనికి ఏమన్నా క్యాబినెట్ అప్రూవల్ ఉందా? ప్రొసీజర్ పొరపాట్లు ఉంటే సంబంధిత సంస్థల దగ్గరికి వెళ్ళాలి కానీ అవినీతి కేసులు అని పెట్టడం వృధా. హైదరాబాద్ పేరు ప్రతిష్టలు, తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు హైదరాబాద్ నుంచి ఫార్ములా ఈ రేసు పోవద్దన్న ఉద్దేశంతోనే డబ్బులు కట్టాం. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క రూపాయి అవినీతి కూడా అవకాశమే లేదు. ఒక పైసా అవినీతి జరగలేదు. కోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి ఈ అంశంలో మరిన్ని విషయాలు చెప్పలేను. ఏసిబి ఎఫ్ఐఆర్‌ని కొట్టివేయాలని హైకోర్టులో కేసు నమోదు చేశాను. అయితే ఇదే అంశం పైన ఈడీ ఏసీబీ ఆధారంగా కేసు నమోదు చేసింది. ఈడీ నోటీసులు వచ్చిన మాట వాస్తవమే. కానీ ఈ ఎఫ్ఐఆర్ హైకోర్టు కొట్టి వేస్తే ఏం జరుగుతుందో చూడాలి. ఇతర కేసుల్లో మాదిరి కాకుండా ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఏం జరుగుతుందన్నది చూడాలి" అని కేటీఆర్ అన్నారు. "ఔటర్ రింగ్ రోడ్డు పైన ఆరోపణ చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఔటర్ రింగ్ రోడ్ రిలీజ్ రద్దు చేయాలి. అవినీతి జరిగిందని ఆరోపించినప్పుడు ప్రభుత్వం లీజును ఎందుకు రద్దు చేయట్లేదో ముఖ్యమంత్రి చెప్పాలి. నాపైన ఇప్పటికే అనేక కేసులను రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేసింది. రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు వివిధ రకాల కేసులు పెట్టి జైలుకు పంపాలని ప్రయత్నం చేశారు. అనేక రకాల అంశాలు లేవనెత్తుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంలో నాకు డబ్బులు ఎట్లా వచ్చాయో చెప్పాలి. అనుమానాలపైన కేసులు ఉండవు కేవలం ఆధారాలపైనే కేసులు ఉంటాయి. రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్దాలనూ, అసత్యాలనూ మీడియా యధాతధంగా ప్రచురితం చేస్తోంది. అసెంబ్లీలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్న నీచపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా రాష్ట్ర అప్పుల పైన ఒక్కొక్క అబద్ధాన్నీ అసెంబ్లీలో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి కాదు రేవంత్ రెడ్డి తాతకు కూడా భయపడను" అని కేటీఆర్ అన్నారు.

తన అనుమతి తీసుకోకుండా తాను మాట్లాడిన విషయాన్ని ఏవిధంగా రికార్డు చేస్తారని నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఫోన్‌లో చెప్పిన మాటలు వాస్తవమేనని ఆమె అన్నారు. అయినప్పటికీ, ఫోన్‌ సంభాషణను ఈ విధంగా రికార్డు చేయడం బాలేదన్నారు. తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించమని కోరుతూ స్థానిక మీడియా సంస్థ ఫోన్‌ కాల్‌లో ఆమెను సంప్రదించింది. భాజపా ఆధ్వర్యంలో ఆ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై విలేకరి ఆమెను ప్రశ్నించాడు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తమిళనాడు భాజపా తనని పట్టించుకోవడం లేదని తెలిపారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డ్‌ను సదరు మీడియా సంస్థ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసింది. ఆమె అనుమతితోనే దీనిని రిలీజ్‌ చేస్తున్నామని పేర్కొంది. దీనిపై తాజాగా ఆమె స్పందించారు. ''మరి ఇంత దిగజారుతారని అనుకోలేదు. నా అనుమతి తీసుకోకుండా ఈవిధంగా నా వాయిస్‌ ఎలా రికార్డు చేస్తారు? కానీ, నేను నిజమే చెప్పా. భాజపా కార్యక్రమాల్లో మీరెందుకు కనిపించడం లేదని నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే.. వారందరికీ ఒక్కటే సమాధానం చెబుతా. ఆయా కార్యక్రమాలకు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వరు. వాటికి నన్ను ఆహ్వానించరు. ఒకవేళ సమాచారం ఇచ్చినా చివరి నిమిషంలో చెబుతారు. కొంతమంది ఊహిస్తున్నట్లు నేను అయితే పార్టీని వీడటం లేదు. ప్రధాని నరేంద్రమోదీ విజన్‌, ఆయన ప్రవేశ పెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తా'' అని ఖుష్బూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఖుష్బూ అనుమతితోనే తాను ఇది షేర్‌ చేశామని మీడియా సంస్థ పేర్కొనడంపై ఆమె మరోసారి స్పందించారు. ''ఆ సంస్థ చెబుతున్న దానిలో నిజం లేదు. ఈ విషయాన్ని వారు నా దృష్టికి ఏమాత్రం తీసుకురాలేదు. ఫోన్‌ కాల్‌ రికార్డు చేస్తున్నామని మీరు నాకెప్పుడు చెప్పారు?'' అని ప్రశ్నిస్తూ మరో పోస్ట్‌ పెట్టారు.

ఆప్ఘానిస్థాన్‌లో మహిళలు సంచరించే ప్రదేశాలకు ఎదురుగా ఉండే నివాసాల్లో కిటికీలు ఏర్పాటు చేయొద్దంటూ తాలిబాన్లు ఆదేశాలు జారీ చేశారు. పొరుగింటి వారి వంటగదులు మొదలు, బావులు వంటి వాటికి అభిముఖంగా ఎటువంటి కిటికీలు నిర్మించకూడదు. కొత్తగా నిర్మించబోయే భవంతుల్లో ఈ నిబంధన పక్కాగా అమలయ్యేలా చూడాలని తాలిబన్ సుప్రీం లీడర్ స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఉన్న ఇళ్లకు ఈ నిబంధన ప్రకారం మార్పులు చేయాలని, అవసరమైతే గోడలు కూడా నిర్మించుకోవాలన్నారు. ''వంటగదిలో పనిచేసేటప్పుడు, బావుల నుంచి నీరు తీసుకెళ్లేటప్పుడు మహిళలను చూస్తే అసభ్యతకు దారితీయొచ్చు'' అని తాలిబాన్లు ఓ ప్రకటనలో తమ నిషేధానికి గల కారణాన్ని వివరించారు. ఇప్పటికే కిటికీలు ఉన్న ఇళ్ల యజమానులు పొరుగింటి వారికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. అమెరికా అండతో పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని కూలదోసి దేశ పగ్గాలు చేపట్టారు. నాటి నుంచి మహిళలపై కఠిన ఆంక్షలకు తెరతీశారు. బహిరంగ ప్రదేశాల్లో వారి సంచారంపై అనేక పరిమితులు విధించారు. ప్రాథమిక విద్యకు మించి మహిళలు చదవాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేశారు. వారు ఉద్యోగం చేయడంపై కూడా అనేక పరిమితులు తీసుకొచ్చారు. తాజాగా తీసుకొచ్చిన ఓ చట్టం ప్రకారం, అప్ఘాన్ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో పాటలు పాడటం లేదా కవితలు వినిపించడం నిషేధం. కాగా, ఈ ఆంక్షలపై ఐక్యరాజ్య సమితి ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది స్త్రీలపై దారుణ వివక్ష అని మండిపడింది.

బ్రిటీష్ ఆన్‌లైన్ వార్తాపత్రిక ది ఇండిపెండెంట్ ఇటీవల 21వ శతాబ్దపు 60 మంది ఉత్తమ నటుల జాబితాను విడుదల చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోని అత్యుత్తమ నటుల జాబితాలో భారతదేశం నుంచి ఇర్ఫాన్ ఖాన్ పేరు మాత్రమే చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 60 మంది ఉత్తమ నటుల జాబితాలో ఇర్ఫాన్ ఖాన్ పేరు 41వ స్థానంలో ఉంది. ఎంతో కష్టపడి చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ఇర్ఫాన్ మంచి గుర్తింపు వచ్చేసరికి మన మధ్య లేకపోవడం బాధాకరం. ఏళ్ల శ్రమ అనంతరం 2001లో ఆసిఫ్ కపాడియా చిత్రం ది వారియర్‌తో మంచి గుర్తింపు లభించింది. 2003లో హాసిల్, మక్బూల్, ది నేమ్‌సేక్ సినిమాలు అద్భుతమైన నటుడిగా పరిచయం చేసాయి. ఇది కాకుండా అతని సినిమా ఖాతాలో లంచ్‌బాక్స్, స్లమ్‌డాగ్ మిలియనీర్, హైదర్, పాన్ సింగ్ తోమర్ వంటి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. రాజస్థాన్‌లోని పఠాన్ ముస్లిం కుటుంబంలో 7 జనవరి 1967న జన్మించిన సహబ్జాదే ఇర్ఫాన్ అలీఖాన్‌కు సినిమాలంటే చాలా ఇష్టం. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి నటన నేర్చుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ముంబై వెళ్లిపోయారు. ఇర్ఫాన్ తన కెరీర్‌ను చక్కదిద్దడానికి ఉత్తమ అవకాశాలను పొందుతున్నప్పుడు.. అరుదైన వ్యాధితో బాధపడ్డాడు. నటుడికి న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే వ్యాధి సోకింది. చికిత్స కోసం ఇర్ఫాన్ నెలల తరబడి యూకేలోనే ఉన్నాడు. కోలుకుని మళ్లీ తెరపైకి వస్తాడని భావించినా అది కుదరలేదు. యూకేలో చికిత్స అనంతరం ముంబయిలోని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తను చివరగా నటించిన ‘అంగ్రేజీ మీడియం’ షూటింగ్​లోనూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో కొన్నాళ్లపాటు విరామం తీసుకుని మళ్లీ చిత్రీకరణకు హాజరై, దానిని పూర్తి చేశారు. 29 ఏప్రిల్ 2020 న నటుడి మరణ వార్త అతని కుటుంబంతో పాటు.. అభిమానుల హృదయాలను కలచివేసింది. “నా జీవితంలో ఉన్నట్లుంది ఇలా జరిగింది. ఇలానే ముందుకు సాగాలి. చివరి రోజులు దీనితోనే గడపాలి. నాకు న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే వ్యాధి ఉన్నట్లు తేలింది. కానీ నా చుట్టుపక్కల ఉన్న నన్ను ప్రేమించే మనుషులే.. నాకు జీవితంపై ఆశను, జీవించడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తున్నారు” అని అప్పట్లో ఇర్ఫాన్ ట్వీట్ చేశారు.

బెవరేజ్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్ టాప్-10 రమ్స్ లిస్ట్ ప్రకటించింది. దీంట్లో హాంప్డెన్ ఎస్టేట్ హెచ్ఎల్సీఎఫ్ క్లాసిక్ సింగిల్ జమైకన్ రమ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇది రమ్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తింపు పొందింది. హాంప్డెన్ ఎస్టేట్ హెచ్ఎల్సీఎఫ్ క్లాసిక్ సింగిల్ జమైకన్ రమ్ క్వాలిటీ, తయారీ పరంగా సూపర్‌ పాపులర్‌ అయింది. ఇది హై ఎస్టర్ కాన్సన్‌ట్రేషన్‌తో, బోల్డ్, కాంప్లెక్స్‌ ఫ్లేవర్స్‌తో వస్తుంది. బాగా పండిన పైనాపిల్, ఆరెంజ్‌ జెస్ట్‌ అరోమాతో యూనిక్ టేస్ట్ ఉంటుంది. పంచదార పాకంలో ముంచిన అరటి, వెచ్చని సుగంధ ద్రవ్యాల టేస్ట్‌ అందిస్తుంది. దీన్ని చక్కటి సిగార్‌తో లేదా స్పెషల్ కాక్‌టెయిల్స్‌లో మిక్స్‌ చేసి సిప్‌ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని జడ్జింగ్ ప్యానెల్ ప్రశంసించింది.

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో రేవ్ పార్టీ కలకలం  రేపుతోంది. ఈ ఘటనలో దాడి చేసిన పోలీసులు 13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కోరుకొండ మండలం, బూరుగుపూడి జంక్షన్ వద్ద నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది. ఫెర్టిలైజర్స్ షాపుల యజమానులు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేశారు.13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులు, మూడు కార్లు స్వాధీనం చేసుకుని కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజమండ్రి నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగడంతో రేవ్ పార్టీ బయటపడింది. గోదావరి జిల్లాలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న రేవ్ పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే ఈ రేవ్ పార్టీలో అందరూ మద్యం సేవించారని, డ్రగ్స్ వాడలేదని రాజమండ్రి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. రాత్రి అంతా నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ పెట్టుకుని, డ్యాన్సులు చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి అధికారులకు వచ్చిన సమాచారం మేరకే పోలీసులు రేవ్ పార్టీపై దాడి  చేశారు. 

3