Ad Code

మలయాళ నటుడు దిలీప్ శంకర్ అనుమానాస్పద మృతి !


తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో మలయాళ సినీ, సీరియల్ నటుడు దిలీప్ శంకర్ హోటల్ గదిలో శవమై కనిపించాడు. మృతికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. రెండు రోజుల క్రితం దిలీప్ శంకర్ హోటల్ లో రూమ్ తీసుకున్నాడు. అయితే అతను అప్పటి నుంచి గది బయటకు వెళ్లలేదని సమాచారం. ఈరోజు గదిలో నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది గదిని తెరిచారు. ఈ క్రమంలోనే దిలీప్ శంకర్ శవమై కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దిలీప్ శంకర్ పలు సీరియల్స్‌లో ప్రముఖ పాత్రలు పోషించారు. ఫ్లవర్స్ టీవీలో ఓ సీరియల్‌లో దిలీప్ శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu