శ్రీశైలం మల్లికార్జునస్వామి స్వామి దయతో రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ప్రభుత్వాలకు బలాన్ని, ధైర్యాన్ని, ఆర్థిక బలాన్ని ఇచ్చి నడిపించాలని వేడుకున్నానని కొండా సురేఖ అన్నారు. తెలంగాణ నుంచి తిరుమలకు అధిక భక్తులు, అధిక రాబడి వస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు శ్రీశైలం మా గుడిగా ఉండేది, దురదృష్టం రాష్ట్రం విడిపోవడం వలన శ్రీశైలాన్ని కోల్పోయాం. అయినా మాకు మల్లన్నపై భక్తి ఎక్కువన్నారు. తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తెలంగాణ భక్తుల విన్నపాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని కొండా సురేఖ అన్నారు. టీటీడీ తరుపున తెలంగాణలో ధర్మప్రచార నిధులను కేటాయించాలని, గత ప్రభుత్వం పాటించిన విధానాలని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నామని కొండా సురేఖ ఆకాంక్షించారు.
0 Comments