చుండ్రు కొంతమందిని సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ డాండ్రఫ్ కారణంగా నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. తలపై నుంచి తెల్లటి తెల్లగా ఒక పదార్థం రాళ్లతో ఉండడంతో చాలామందిని అది ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. దీంతో చుండ్రు సమస్య తగ్గడం కోసం ఎన్నెన్నో షాంపూలు ప్రయత్నిస్తూ ఉంటారు. రకరకాల ఆయిల్స్ తో పాటు హోం రెమిడీస్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ మంచి ఫలితాలు కనిపించవు. వేపాకు జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఎంతో బాగా పని చేస్తుందని చెబుతున్నారు. వేపాకులో ఉండే ఔషద లక్షణాలు జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. అలాగే నెత్తి చికాకును కూడా తగ్గించడానికి సహాయపడుతుందట. వేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్ ఇ తో పాటుగా ఎన్నో రకాల మినరల్స్ పుష్కలంగా ఉంటాయట. అయితే ఇవన్నీ కూడా మన జుట్టు రాలడాన్ని తగ్గించి చుండ్రు లేకుండా చేయడానికి సహాయపడతాయని చెబుతున్నారు. వేపాకును జుట్టుకు పెట్టడం వల్ల మన జుట్టు మూలాల నుంచి బలంగా అవుతుందట. ఆరోగ్యంగా కూడా ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఆకులు నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతాయట. దీంతో మీ జుట్టు బలంగా, హెల్తీగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే వేపాకులు జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయట. అలాగే నెత్తిని పరిశుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయని చెబుతున్నారు. చుండ్రు సమస్య పోవడానికి.. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె లేదా కొన్ని చుక్కల ఆవనూనె తీసుకోవాలి. దీనిలో వేపాకు పేస్ట్ ను వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని నెత్తి మీది నుంచి వెంట్రుకల చివర్ల వరకు బాగా అప్లై చేసి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. అలాగే ఒక గిన్నెలో కొన్ని వేప ఆకులను, తేనె, నెయ్యి వేసి బాగా కలపి దీన్ని పేస్ట్ లా చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద రెండు మూడు నిమిషాలు వేడి చేయాలి. ఇది చల్లారిన తర్వాత నెత్తికి, జుట్టుకు పెట్టాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. అదేవిధంగా వేపాకులను మెత్తగా నూరి అందులో పెరుగు వేసి బాగా కలిపి జుట్టుకు అప్లై చేసి ఐదారు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అర్ధ గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు సమస్య ఈజీగా తగ్గుతుంది. అలాగే కొన్ని మరిగించిన నీళ్లలో కొన్న వేపాకులు, టీ స్పూన్ తేనె వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీళ్లను వడకట్టాలి. ఆకులను పేస్ట్ లా చేయాలి. దీన్ని నెత్తికి, జుట్టుకు బాగా పట్టించాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత తలను షాంపూతో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఈజీగా చుండ్రు సమస్య తగ్గుతుందని చెబుతున్నారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ