సింగరేణిలో బదిలీ వర్కర్లు, జనరల్ అసిస్టెంట్ ట్రైనీలుగా పనిచేస్తున్న 1,135 మంది కార్మికులను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరించేందుకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇటీవల కోల్‌బెల్ట్ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల నుంచి మూడేళ్లకు పైగా క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న కార్మికులకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. 2025 డిసెంబర్ 31వ తేదీ నాటికి లేదా అంతకుముందు సింగరేణిలో ఉద్యోగంలో చేరి బదిలీ వర్కర్లు లేదా జనరల్ అసిస్టెంట్ ట్రైనీలుగా పనిచేస్తున్న వారికి ఈ అవకాశం వర్తించనుంది. భూగర్భ గనుల్లో పనిచేసిన వారు 190 పని దినాలు, ఓపెన్‌కాస్ట్ గనులు, ఇతర బయటి విభాగాల్లో పనిచేసిన వారు 240 పని దినాలు పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారిని మాత్రమే క్రమబద్ధీకరణకు పరిగణనలోకి తీసుకోనున్నారు. సింగరేణి ఛైర్మన్, ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు జనరల్ మేనేజర్ (పర్సనల్) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీలోగా అర్హులైన కార్మికుల జాబితాలను సమర్పించాలని ఆయా ఏరియా జనరల్ మేనేజర్లను యాజమాన్యం ఆదేశించింది. అర్హులైన కార్మికులకు 2026 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి క్రమబద్ధీకరణ వర్తించనుంది. గతంలో బదిలీ వర్కర్లు, బదిలీ ఫిల్లర్ల నుంచి జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరణ పొందేందుకు కార్మికులు చాలాకాలం వేచి చూడాల్సి వచ్చేది. అయితే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు చేపడుతున్నట్లు సంస్థ వెల్లడించింది. క్రమశిక్షణతో విధులకు హాజరవుతూ గైర్హాజరు కాకుండా పనిచేసే కార్మికులకు క్రమబద్ధీకరణతో పాటు భవిష్యత్తులో అంతర్గత పదోన్నతులు, ఇతర ఉద్యోగ అవకాశాలు పొందేందుకు మార్గం సుగమమవుతుందని సింగరేణి యాజమాన్యం పేర్కొంది. విధులకు గైర్హాజరైతే ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉత్పత్తి, ఉత్పాదకత పెంపులో కార్మికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఛైర్మన్, ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సూచించారు. క్రమబద్ధీకరణ పొందనున్న కార్మికులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, సంస్థ అభివృద్ధి, విస్తరణకు కార్మికులు సహకరించాలని ఆయన కోరారు.
3
Beranda › Posts filed under 135 Workers at Singareni
Showing posts with label 135 Workers at Singareni. Show all posts
Showing posts with label 135 Workers at Singareni. Show all posts
Subscribe to:
Posts (Atom)
