బెంగళూరులోని రాజాజీనగర్ పరిధిలో కుటుంబంలో తలెత్తిన విభేదాలతో క్యాబ్ డ్రైవర్ శేఖర్ ఏడుగురిని చంపినట్లు పోలీసులు గుర్తించారు. భార్య, ఆమె కుటుంబాన్ని చంపిన శేఖర్ తర్వాత మృతదేహాన్ని మాయం చేశాడు. ఒకరి తర్వాత ఒకరిని రోకలిబండతో కొట్టి శేఖర్ చంపినట్లు గుర్తించారు. కుటుంబ కలహాలు, భార్య వైపు వారు తమ సంసారంలో జోక్యం చేసుకుంటున్నారనే కక్షతో నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ నరమేధానికి సంబంధించి నిందితుడైన ఇందు శేఖర్ అనే క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి భార్య సునీత, అత్త రూపవతి, బావమరుదులు శివకుమార్, శంకర్, తోటికోడళ్లు దివ్య, నలిని, అలాగే శంకర్ కుమారుడైన ఏడేళ్ల బాలుడు పునీత్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు ఇందు శేఖర్ పక్కా ప్లాన్ ప్రకారం రెండు రోజుల వ్యవధిలో ఒక్కొక్కరిని తన ఇంటికి పిలిపించి రోకలిబండతో మోది దారుణంగా హతమార్చాడు. మొదట భార్యను చంపి, ఆ తర్వాత మిగతా కుటుంబ సభ్యులను పార్టీ పేరుతో పిలిపించి అంతమొందించాడు.హత్యల అనంతరం ఇంట్లోని రక్తపు మరకలను కెమికల్స్ ఉపయోగించి క్లీన్ చేశాడు. శవాలను తన క్యాబ్ కారులో తరలించి చిక్కబళ్లాపూర్ జిల్లాలోని నంది హిల్స్ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు లోయల్లో పడేసాడు. నిందితుడి బంధువుల్లో ఒకరైన నళిని కనిపించకుండా పోవడంతో ఆమె తల్లి శ్రీరాంపుర పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇందు శేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ సామూహిక హత్యల గుట్టు రట్టయింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని ఘటనా స్థలాలకు తీసుకెళ్లి మృతదేహాల రికవరీ ప్రక్రియ చేపట్టారు. ఇప్పటివరకు ఏడేళ్ల బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా, మిగిలిన వారి దేహాల కోసం గాలిస్తున్నారు.పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
3
Beranda
› a cab driver named Shekhar
› Cab Driver Beats Seven People—Including His Wife and Her Relatives to Death with a Pestle
› crime
› karnataka
› Rajajinagar area of Bengaluru
› భార్య, ఆమె బంధువులతో సహా ఏడుగురిని రోకలిబండతో కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్
Subscribe to:
Post Comments (Atom)
