About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label ₹26 Lakhs Collected from Job Seekers. Show all posts
Showing posts with label ₹26 Lakhs Collected from Job Seekers. Show all posts

నకిలీ డీఎస్పీని అరెస్టు చేసిన ఏలూరు పోలీసులు : నిరుద్యోగుల నుంచి రూ.26 లక్షలు వసూలు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో డీఎస్పీగా పనిచేస్తున్నానంటూ నమ్మించి నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ.26 లక్షలు వసూలు చేసిన కేటుగాడిని ఏలూరు పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలానికి చెందిన బత్తుల శ్రీనివాస్ అలియాస్ శ్రీను(35) చదువుకుంది పదో తరగతి వరకు మాత్రమే. అయితే, అమాయకుల ఆశలను ఆసరాగా చేసుకుని సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. తాను గుంటూరు జిల్లాలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నానని, అంతేకాకుండా గోల్డ్ బిజినెస్ కూడా ఉందంటూ ప్రచారం చేసుకునేవాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు, ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని.. వారిని ఖరీదైన లగ్జరీ హోటళ్లకు పిలిపించి నమ్మకం కుదిరేలా మాట్లాడేవాడు. ఇటీవల ఏలూరుకు చెందిన పాలిక రంగ వీరబాబుకు ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.18 లక్షలు, మరో బాధితుడు దండిపాటి గణేష్ నుంచి రూ.8 లక్షలు వసూలు చేశాడు. ఇలా మొత్తం రూ.26 లక్షలు కాజేసిన తర్వాత.. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుపై ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ తక్షణమే స్పందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో ఏలూరు II టౌన్ సీఐ కె. అశోక్ కుమార్, ఎస్సై బి. మధు వెంకటరాజు, హెడ్ కానిస్టేబుల్ కె. రవిచంద్‌లతో కూడిన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. నిఘా పెట్టిన పోలీసులు.. ఏలూరు II టౌన్ పరిధిలోని జికె ప్యాలెస్ లాడ్జిలో బస చేసిన నకిలీ డీఎస్పీ బత్తుల శ్రీనివాస్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.5,50,000/- నగదు, నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు, పోలీస్ డిపార్ట్‌మెంట్ రబ్బర్ స్టాంపులు, పోలీస్ యూనిఫాం, వాకీటాకీ స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితుడిపై గతంలోనూ రాజమండ్రి II టౌన్, మఠంపల్లి, సూర్యాపేట, నరసరావుపేట రూరల్, త్రిపురాంతకం, చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లలో పలు చీటింగ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కేసును వేగంగా ఛేదించి నిందితుడిని పట్టుకున్న ఎస్సై బి. మధు వెంకటరాజు, హెడ్ కానిస్టేబుల్ కె. రవిచంద్‌లను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.

Read More...