Posts

Showing posts with the label 'Weekend Homes' Culture Emerges as a Strong Trend

ఫామ్ ప్లాట్లకు పెరుగుతున్న ఆదరణ : ట్రెండ్‌గా మారుతున్న వీకెండ్ హోమ్స్ సంస్కృతి

Image
న గరవాసులు సరికొత్త జీవనశైలి వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే వీకెండ్స్‌లో ప్రశాంతంగా గడిపేందుకు వీలుగా నగర శివార్లలో వెలుస్తున్న గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ప్లాట్లకు మార్కెట్‌లో విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. యాంత్రికమైన నగర జీవనం, కాలుష్యం నుండి ఉపశమనం పొందడానికి ఈ వీకెండ్ హోమ్స్ సంస్కృతి ఇప్పుడు ఒక బలమైన ట్రెండ్‌గా మారుతోంది. ఈ తరహా మార్పుకు ఐటీ రంగంలో వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ ,హైబ్రిడ్ పని విధానాలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. వారంలో ఐదు రోజులు ఆఫీసు లేదా ఇంట్లో ల్యాప్‌టాప్‌లకే పరిమితమయ్యే ఉద్యోగులు, వారాంతాల్లో ప్రకృతి ఒడిలో గడపడానికి ఇష్టపడుతున్నారు. నగరానికి కాస్త దూరంగా ఉన్నా, హైవే కనెక్టివిటీ బాగుండటంతో గురువారం లేదా శుక్రవారం సాయంత్రానికే ఫార్మ్ హౌస్‌లకు చేరుకుని, అక్కడి నుంచే తమ విధులను సైతం నిర్వహించుకుంటున్నారు. టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల ఎక్కడి నుంచైనా పని చేసుకునే వెసులుబాటు ఈ ధోరణికి మరింత ఊతాన్ని ఇస్తోంది. ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ప్రాజెక్టులు కేవలం ఖాళీ స్థలాలకే పరిమితం కాకుండా, నగరంలోని లగ్జరీ విల్లాలకు ఏమాత్రం తీసిపోని వసతులతో రూపుదిద్దుకుంటున్నాయి. 24 ...