Posts

Showing posts with the label 13 countries including the US

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ 2026కు విశేష స్పందన

Image
న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ 2026 ప్రారంభమైంది. నేటి నుంచి 20వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సమ్మిట్‌ ఏఐ రంగంలో భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటిచెబుతోంది. దాదాపు 70వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 10 భారీ అరేనాల్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌పోకు ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. ఈ సమ్మిట్ కోసం దేశ విదేశాల నుంచి 2.5 లక్షల మంది ప్రతినిధులు రిజిస్టర్ చేసుకోవడం విశేషం. ప్రభుత్వం ఊహించిన దానికంటే ఇది ఎంతో ఎక్కువని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ వెల్లడించారు. ఈ సదస్సులో మొత్తం 600 పైగా స్టార్టప్ కంపెనీలు, 300కు పైగా ఎగ్జిబిషన్ పవిలియన్లు కొలువుదీరాయి. అమెరికా, రష్యా, జపాన్ సహా 13 దేశాలు ప్రత్యేక పవిలియన్లను ఏర్పాటు చేశాయి. 500 సెషన్లలో దాదాపు 3,250 మంది నిపుణులు ప్రసంగించబోతున్నారు. ఈ సమ్మిట్‌లో దక్షిణాది స్టార్టప్‌లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా చెన్నైకి చెందిన ఏఐ కంపెనీలు తమ వినూత్న ఆవిష్కరణలతో అదరగొడుతున్నాయి. చెన్నైకి చెందిన 'అత్సుయ టెక్నాలజీస్' తన AOne ప్లాట్‌ఫామ్‌తో గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్‌లో టాప్-20లో నిలిచింది. పారిశ్రామిక రంగంలో ఏఐ ఏజెంట్ల ద్వారా రి...