Posts

Showing posts with the label 'Green Sanvi'

హర్మూజ్ దాటిన భారత్‌కు చెందిన 7వ ఎల్‌పీజీ ట్యాంకర్ 'గ్రీన్ సాన్వి'

Image
భా రత్‌కు చెందిన 7వ ఎల్‌పీజీ ట్యాంకర్ 'గ్రీన్ సాన్వి' హర్మూజ్ జలసంధిని దాటి భారత్ వైపు కదిలింది. దీనిపై ఇరాన్ ప్రభుత్వం భారత్‌కు ఒక ప్రత్యేక సందేశాన్ని పంపింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. భారత్, ముఖ్యంగా గుజరాత్ తమ ఉమ్మడి చరిత్రలో కీలక స్థానాన్ని కలిగి ఉన్నాయని ఇరాన్ పేర్కొంది. ఇరు దేశాల మధ్య ప్రత్యేకమైన అనుబంధం, చరిత్ర ఉందని ఇరాన్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ అసూయతో రగిలిపోతోంది. కొందరు పాకిస్తాన్ నేతలు తమ దేశానికి ఇలాంటి సందేశాలు రాలేదని ఓవైపు, భారత్‌తో మైత్రిని గుర్తుచేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ చేసిన పోస్ట్‌కు రిప్లై ఇస్తూ ఇరాన్ కాన్సులేట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హర్మూజ్ జలసంధి ద్వారా ఎల్‌పీజీ ట్యాంకర్ ప్రయాణించడాన్ని భారత్ దౌత్య విజయం అని హర్ష్ సంఘ్వీ అభివర్ణించారు. దీనిపై స్పందించిన ఇరాన్ కాన్సులేట్ జనరల్.. 'మా ఉమ్మడి చరిత్రలో భారత్ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. శతాబ్దాల కిందట ఇక్కడి ప్రజలు మా దేశాన్ని సంతోషంగా ఆహ్వానించారు' అని పేర్కొంది. సుమారు 4,000 ఏళ్ల కిందట సింధు లోయ నగరాలను పర్షియన్ తీ...