Posts

Showing posts with the label 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థి లైంగిక దాడికి యత్నించిన

ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ పాఠశాల బాలుడి పై బాలల హక్కుల కమిషన్ కేసు నమోదు !

Image
తె లంగాణలోని మేడ్చల్ జిల్లా ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థి లైంగిక దాడికి యత్నించిన విషయం తెలిసిందే. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. తొమ్మిదో తరగతి విద్యార్థి పై చర్యలు తీసుకున్నామని ప్రిన్సిపాల్ జోసెఫ్ తెలిపారు. మరోవైపు 9వతరగతికి చెందిన విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ పాఠశాల్లో బాలుడు, మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై బాలల హక్కుల కమీషన్ కేసు నమోదు చేసింది. మీడియాలో వచ్చిన కథానాల ఆధారంగా బాలల హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని బాలల హక్కుల కమిషన్ ఆదేశించింది.