భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు మొదటి ప్రాధాన్యత ఇచ్చారని, విద్యాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు విద్యా శాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు బాధ్యతలు అప్పగించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తొలుత ఆయన అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా బంజారా భవన్ లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశంలో విద్యాభివృద్ధికి ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించిన ఘనత అబుల్ కలాం ఆజాద్ సొంతం అని, ఆయన హయాంలోనే ఐటీఐలకు పునాది పడిందని వివరించారు. ఆ ఐటీఐలను మనం ఇప్పుడు ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసుకున్నామని చెప్పారు. నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. సాఫ్ట్వేర్ రంగంతోపాటు పలు విభాగాల్లో ఏఐతో ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని, కానీ బ్లూ కాలర్ జాబ్స్‌ను ఏఐతో చేయలేమని చెప్పారు. నైపుణ్యం పెంచుకుంటే భవిష్యత్తులో బ్లూ కాలర్ ఉద్యోగావకాశాలకు కొదవ లేదన్నారు. కాగా, గులాంనబీ ఆజాద్ నుంచి షబ్బీర్ అలీ వరకు కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ఎన్నో అవకాశాలను ఇచ్చిందని గుర్తు చేశారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. అయితే మైనారిటీ రిజర్వేషన్‌ను తొలగిస్తామని బీజేపీ చేవెళ్ల సభలో ప్రకటించిందని, ముందు గుజరాత్లో తొలగించి చూపించాలని తాము సవాల్ విసిరామని అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి స్వాతంత్య్రం కోసం పోరాడిన చరిత్ర లేదు.. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం అని చెప్పారు. పేదలకు, మైనారిటీలకు కాంగ్రెస్ ఓటు హక్కు కల్పిస్తే బీజేపీ ఆ ఓట్లను తొలగించాలని చూస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 12 ఏళ్లు గడిచినా మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. బీజేపీతో పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. తెలంగాణ గల్లీ నుంచి వెళ్లిన కారు దిల్లీకి చేరగానే మోదీ కమలంగా మారిపోతోందని ఎద్దేవా చేశారు. మైనారిటీ స్కాలర్షిప్లను తొలగించాలని బీజేపీకి ఏ దేవుడు చెప్పాడని ప్రశ్నించారు. క్రీడల్లో దేశ ప్రతిష్టను పెంచిన మైనారిటీ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతితోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి గౌరవించిందన్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి గౌరవించామని, షబ్బీర్ అలీని సలహాదారుగా నియమించామని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో మైనారిటీలకు ఎన్నో అవకాశాలు కల్పించామన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని, సిటీని కాపాడుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఓల్డ్ సిటీలో మెట్రో పనులను వేగవంతం చేశామని వివరించారు. మూసీ పునరుజ్జీవంతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. చదువు ఒక్కటే మీ జీవితాలను మారుస్తుంది.. పిల్లలను చదివించండి.. నైపుణ్యాన్ని అందించండి అంటూ మీ సోదరుడిగా అండగా ఉంటా.. మీ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే బాధ్యత నాది అని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. నిఖత్ జరీన్, సిరాజుద్దీన్ తరహాలో పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించండి అని మైనారిటీలకు పిలుపునిచ్చారు. నైపుణ్యం, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇందుకోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.
3
Beranda › Posts filed under CM Revanth Reddy
Showing posts with label CM Revanth Reddy. Show all posts
Showing posts with label CM Revanth Reddy. Show all posts
మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్ వద్ద ఆయన కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత పురస్కారంతో ఆయనను సత్కరించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ఆర్థిక రంగానికి గుండెకాయలాంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేశామని చెప్పారు. దేశ ఆర్థిక రంగంలో ఆయన సరళీకృత విధానాలు తెచ్చారని గుర్తు చేశారు. భారత్‌ను సంక్షోభం నుంచి దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గట్టెక్కించారని చెప్పారు. నాడుై ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలంగాణ బిల్లుపై సంతకం చేశారని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, మాజీ ఆర్ధిక సలహాదారు మోహన్ గురుస్వామి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు.
Read More...
ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రజా పాలనలో విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు, రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పేదల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత 32 నెలల్లో ఆరోగ్యశ్రీ కోసం రూ.2,600 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఆస్పత్రుల సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నామని తెలిపారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులు పేదలకు ఎంతో ఉపయోగపడతాయని సీఎం అన్నారు. గత పాలకులు టిమ్స్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులను మర్చిపోయారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో మూడు టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాన్ని వేగంగా చేపట్టామని తెలిపారు. అదే విధంగా వరంగల్లోనూ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. 2027 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆస్పత్రులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఆరు నెలలకు ఒక ఆస్పత్రిని ప్రారంభించే దిశగా ప్రణాళిక రూపొందించామని సీఎం వెల్లడించారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తోందని తెలిపారు. ఆస్పత్రుల నిర్మాణ పనులు వేగంగా, నాణ్యతతో పూర్తయ్యేలా ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ చేపడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 100 రోజుల్లో మొత్తం రూ. 6,000 కోట్ల బకాయిలను పూర్తిగా విడుదల చేసింది. తాజాగా మరో రూ.2 వేల కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో 100 రోజుల్లోనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలు విడుదల చేసి మాట నిలబెట్టుకుంది. ఈ మేరకు రేవంత్ ప్రభుత్వం మూడు విడతల్లో ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లించింది. మొదటి విడతగా మే 29న రూ. 2,000 కోట్లు రిలీజ్ చేసింది. ఆ తర్వాత రెండో విడతగా జూన్ 30 న రూ.2,000 కోట్లు విడుదల చేయగా, తాజాగా మూడో విడతగా మరో రూ. 2,000 కోట్లను విడుదల చేసి ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఇక ఈ విడుదలతో విశ్రాంత ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలు పూర్తిగా చెల్లించబడ్డాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నల్గొండలో రూ.13వేల కోట్ల రోడ్ల నిర్మాణ పనులను సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
తెలంగాణలోని నల్గొండలో రూ.13వేల కోట్ల రోడ్ల నిర్మాణ పనులను సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో నల్గొండ తలెత్తుకునేలా చేసిన నాయకుడు కోమటిరెడ్డి. త్యాగమంటే ఎలక్షన్లు తేవడం, కలెక్షన్లు చేసుకోవడమేనా?. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో త్యాగం చేశారు. తెలంగాణ కోసం ఎంతో మంది బిడ్డలు త్యాగం చేశారు. బీఆర్ఎస్ పదేళ్లలోనే వందేళ్లకు సరిపోయే విధ్వసం చేసింది. తెలంగాణ సమాజం బీఆర్ఎస్ను క్షమించదు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను ఉప్పు పాతర వేశారు. తెలంగాణ అభివృద్ధిపై శాసన సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన దొడ్డు బియ్యం బర్రెలకు పెట్టుకునేవారు. ఏడాదికి రూ.16వేల కోట్ల వ్యయంతో సన్న బియ్యం ఇస్తున్నాం. కేసీఆర్ తింటున్న సన్న బియ్యాన్నే ఈ రోజుల పేదలు కూడా తింటున్నారు. పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు.. నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. పేదోడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మీకు కడుపు మంట ఎందుకు? అని ప్రశ్నించారు.
ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ
తెలంగాణ వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సాంకేతికత వినియోగాన్ని పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో బోనస్ అందించే ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందించడంతో పాటు రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించారు. సన్న వడ్లు పండించే రైతుల పూర్తి వివరాలను సేకరించాలని, ధాన్యం దిగుబడులపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అమలు చేస్తున్న పైలెట్ ప్రాజెక్టును మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి సూచించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పెంచాలని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వ్యవసాయ సేవల్లో ఉపయోగించాలని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించి, విత్తనాల సరఫరా నుంచి ధాన్యం కొనుగోలు వరకు వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయిస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, ఆయిల్‌ఫెడ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేయాలని, యాప్ ద్వారా బుక్ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్లకు యూరియా పంపిణీ బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఎరువుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి నిరంతరం లేఖలు రాయాలని, రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులను తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. ఈ అంశంపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని కూడా సూచించారు.
అహ్మదాబాద్, విశాఖ మెట్రోకు అనుమతి ఇచ్చిన కేంద్రం హైదరాబాద్‌కు వివక్ష చూపుతుంది !
తెలంగాణ సచివాలయంలో విలేకర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్, మాదాపూర్ కలిపితే ఎంత ఉంటుందో అంత ఉండే విశాఖకు కూడా మెట్రో ఇచ్చారు. కానీ హైదరాబాద్ మెట్రో విస్తరణను ఆపేశారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించడం లేదనే అంశాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్ళాయి. అహ్మదాబాద్‌తో పాటు విశాఖ మెట్రోకు అనుమతి ఇచ్చిన కేంద్రం హైదరాబాద్‌కు మాత్రం వివక్ష చూపుతోందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరుపైనా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైఖరిపై విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం విశాఖలో 46 కి.మీ. మెట్రో ప్రాజెక్టును ప్రతిపాదించింది. మూడు కారిడార్లలో 42 స్టేషన్లు, స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు డబుల్ డెక్కర్ మెట్రో ఆలోచనలు జరుగుతున్నాయి. ఇది విశాఖను భవిష్యత్ మెట్రోపాలిస్గా తీర్చిదిద్దడంలో కీలకమవుతుంది. హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమతి ఆలస్యం అవుతుండటం తెలంగాణ అభివృద్ధిని ప్రభావితం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమానంగా ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. . తెలుగు రాష్ట్రాలు ఒకరికొకరు పోటీపడకుండా, పరస్పర సహకారంతో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశం ఉన్నా, కేంద్రం మాత్రం తెలంగాణాకు సహకరించటం లేదని సీఎం అన్నారు. విశాఖ మెట్రో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తెలంగాణాపై కేంద్రం వివక్ష చూపించటం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. విశాఖ మెట్రో పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంది.
మహిళల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగా : సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉప్పల్ భగాయత్ లే అవుట్ లో రూ.1511 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగానని,కొడంగల్‌లో ఓడినా తనను మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించారని ప్రస్తావించారు. మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గం అంటే మినీ భారత్ అని అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహా దారు వి.హనుమంత రావు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్,ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, మల్రెడ్డి రంగా రెడ్డి, శ్రీ గణేశ్ హాజరయ్యారు.
తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలి !
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు అన్నారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కుప్పలుతెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారన్నారు. ఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా? ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? 20 రోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని, కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. మిగతా 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనాలన్నారు. శనగ రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు శనిలా మారాయంటూ కేంద్రాల్లో కొర్రీలు పెట్టి పూర్తిగా కొనుగోళ్లు నిలిపివేశారని, మద్దతు ధర రూ. 5,875 ఉంటే ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు మూడు, నాలుగు వేలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారని నిలదీశారు. కనీస మద్దతు ధర రూ.3371 ఉంటే ప్రైవేటు వ్యక్తులకు రూ.2500కే అమ్ముకుని రైతులు నష్టపోతున్నారన్నారు. మొక్కజొన్న రైతులపై వివక్ష ఎందుకంటూ ఎకరాకు 26.50 క్వింటాళ్లే కొంటామనే నిబంధనను సడలించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల మొక్కజొన్న పండితే మిగతా పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలి అని అడిగారు. తక్షణమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హరీష్‌రావు హెచ్చరించారు.
తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణం స్వీకారం
తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ఈరోజు ఉదయం 11.30కి . ప్రమాణ స్వీకారం చేశారు. పదవీ బాధ్యతలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ప్రమాణం చేయించారు. లోక్ భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మండలి ఛైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలూ, ఎమ్మెల్సీలూ హాజరయ్యారు.
దేశంలో మహిళలకు అత్యున్నత పదవులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ !
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ప్రజాభవన్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ మహిళలకు ఎప్పుడూ గుర్తింపు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని, దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. కీలకమైన శాఖలను మహిళా అధికారులు సమర్థంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. వెయ్యి బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారని ప్రస్తావించారు. తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్‌లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇటీవల మావోయిస్టుల లొంగుబాటులోనూ మహిళా అధికారులే కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, నిర్వహణ బాధ్యతలూ అప్పగించామని వ్యాఖ్యానించారు. దేశంలో మహిళల శ్రమకు గుర్తింపు, తగిన ఫలితం లేదన్నారు. మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. దేశంలో కుల, జెండర్ వివక్ష ఉందని తెలిపారు. అమెరికాలో కూడా వివక్ష ఉంది.. కానీ అక్కడ కష్టానికి గుర్తింపు ఉంటుందని అన్నారు. ఇక్కడ మాత్రం కష్టపడేవారికి గుర్తింపు ఉండదని చెప్పుకొచ్చారు. కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అన్ని సంస్థలపైనా ఉంటుందన్నారు. అదే ఐడియాలజీతో యుద్ధం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వెల్లడించారు. మహిళల ఆర్థిక శక్తిని పెంచాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పెంచే ప్రణాళికలను తయారు చేశామని వివరించారు. హైదరాబాద్‌ను పొల్యూషన్ ఫ్రీ నగరంగా మార్చాలని సూచించారు. చంద్రబాబు, వైఎస్సార్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని అన్నారు. రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపిస్తామని తెలిపారు. ప్రతిపక్షాల నేతలు మూసీ ప్రక్షాళన చేయాలని అంటున్నారని.. కానీ తమ ప్రభుత్వం అభివృద్ధి చేద్దామని చూస్తే మాత్రం ఎందుకు అడ్డుతగులుతున్నారని ప్రశ్నించారు. ఇటీవల ఓ అపార్ట్మెంట్ విషయంలో రాద్ధాంతం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 2026 డిసెంబర్ నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ఆటోలనూ ఎలక్ట్రిక్‌గా మార్చుతామని అన్నారు. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని మాటిచ్చారు. గాంధీ విగ్రహం కట్టడానికి రూ.500కోట్లని ప్రతిపక్షాల నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గాంధీ విగ్రహానికి రూ.70కోట్లే ఖర్చు అవుతోందని స్పష్టం చేశారు. గాంధీ విగ్రహం దగ్గర విజ్ఞాన కేంద్రానికి రూ.100కోట్లు ఖర్చు అవుతోందని తెలిపారు. మహిళలకు రక్షణ మాత్రమే కాదని.. అవకాశాలు కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో అవాస్తవాల ప్రచారంపై ఫిర్యాదులు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో కాలుష్యం, దోమలు ఎక్కువగా ఉన్నాయంటున్నారని చెప్పుకొచ్చారు. మూసీని ప్రక్షాళన చేస్తామంటే ప్రతిపక్షాల నేతలు అడ్డుపడుతున్నారని ఆగ్రహించారు. మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా..?, తొలగింపులు వద్దంటున్నారా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. కాలుష్యంతో హైదరాబాద్ నాన్ లివింగ్ సిటీగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. నదుల బఫర్ జోన్లలో ఎలాంటి కట్టడాలకు అనుమతులు లేవని తేల్చిచెప్పారు. అలాంటి చోట నిర్మాణాలు చేపట్టినా తొలగించాల్సి వస్తుందన్నారు. బఫర్ జోన్ల పరిధిలో 50మీటర్ల లోపల ఉంటే ఇళ్లకు విలువ ఉండదని తెలిపారు. ఇలాంటి అంశాల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. నష్ట పరిహారం ఇచ్చే బఫర్ జోన్‌లోని ఇళ్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని భరోసా కల్పించారు. మూసీ నిర్వాసితులకు ఏం కావాలో ప్రతిపక్షాల నేతలు చర్చిస్తే బాగుంటుందని అన్నారు. ఈనెల 13వ తేదీన మూసీ పునరుజ్జీవంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని తెలిపారు. డీపీఆర్ కూడా ప్రెజెంట్ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను 2034నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం !
మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్లైమేట్ వీక్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బాంద్రా కుర్లా జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో దేశంలోని పట్టణాలు, నగరాభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలపై ముఖ్యమంత్రి తెలంగాణ దృక్పథాన్ని వివరించారు. దేశ పట్టణాభివృద్ధికి సంబంధించిన సదస్సులో మాట్లాడడం తనకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా పంప్సెట్లు, దాదాపు 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ఈ శక్తిని బొగ్గు, సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి సోలార్, గ్రీన్ ఎనర్జీ వైపు మార్చడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్, స్థిర శక్తి ఉత్పత్తి పద్ధతులపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను 2034నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందని తెలిపారు. వచ్చే అయిదేళ్లలో కోర్ అర్బన్ రీజియన్(క్యూర్)లో దాదాపు పరిశ్రమలు ఉండవని స్పష్టం చేశారు. 2047 లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలంటే 1947నుంచి భారత అభివృద్ధి ప్రయాణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్య్రం అనంతరం తొలి నాలుగు దశాబ్దాల్లో దేశంలో ప్రధాన ప్రాధాన్యతలు విద్యా వ్యవస్థ, నీటిపారుదల రంగాలేనని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాథమిక పాఠశాలల నుంచి ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్సీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. విద్యుత్, సాగునీటికి భారీ ఆనకట్టలను నిర్మించి రైతుల పొలాలను నీటితో అనుసంధానించామని తెలిపారు. 1990 నాటికి భారత్ ఆహార కొరత నుంచి ఆహార భద్రత సాధించిందని చెప్పారు. దీంతో ప్రజల జీవిత కాలం పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలోని ఇంజినీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలతో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమంగా గుర్తింపు పొందే విధంగా అభివృద్ధి సాధించినట్లు వివరించారు. 1991 నుంచి 2020 వరకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సంస్కరణలతో భారత్ సేవా రంగంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందని సీఎం అన్నారు. టెలికం, సాఫ్ట్వేర్ విప్లవంతో పట్టణ మౌలిక సదుపాయాల విస్తరణ సాధ్యమైందన్నారు. భారత నిపుణులు సిలికాన్ వ్యాలీ వంటి ప్రపంచ కేంద్రాల్లో విజయాలు సాధించారని తెలిపారు. 1991 తర్వాత గ్లోబల్ సాఫ్ట్వేర్, టెక్ సంస్థలు తమ బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకు భారత్‌ను ఎంచుకున్నాయని తెలిపారు. అందుకే ప్రపంచంలో అత్యధిక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) మన దేశంలో ఉన్నాయన్నారు. అయితే ఈ టెక్ పురోగతిలో తయారీ రంగం ఎక్కువగా అవకాశాలు కోల్పోయినట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయన్నారు. ఏ ఆర్థిక వ్యవస్థకైనా విద్యుత్ ఉత్పాదక వనరులే అసలైన కరెన్సీ అన్నారు. విద్యుదుత్పత్తి, వినియోగం అభివృద్ధికి కొలమానంగా నిలుస్తాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర జీడీపీని 200 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం లక్ష్యమని తెలిపారు. భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, వనరులు, ఉపాధి ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయన్నారు. రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధికి తెలంగాణను 'క్యూర్', 'ప్యూర్', 'రేర్' జోన్లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 24.8% లేదా దాదాపు 25% గ్రీన్ సోర్సుల నుంచే వస్తోందని తెలిపారు. అదేవిధంగా 360 కి.మీ పొడవు గల రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం కొనసాగుతోందని, రీజినల్ రింగ్ రైల్వే ప్రణాళికలు అమలులో ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని ప్రధాన తయారీ జోన్‌గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, ముఖ్యంగా డేటా సెంటర్లు, పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీని కోరుకుంటున్నాయని తెలిపారు. వాతావరణ మార్పులు, కోవిడ్ ప్రభావాలను ప్రస్తావిస్తూ ప్రస్తుత పరిస్థితిని క్లైమేట్ ఎమర్జెన్సీగా అభివర్ణించారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి సృష్టి, ఉత్పత్తి, వినియోగం పెంపు కొనసాగుతూనే పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ 'క్యూర్' ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తొలగించడంతో దేశంలో అత్యధికంగా ఈవీల స్వీకరణ పెరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థను పర్యావరణహితంగా మార్చే దిశగా 2 లక్షలకుపైగా ఆటోరిక్షాలను రీట్రోఫిట్ చేస్తుండగా, 3,500 కంటే ఎక్కువ ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామన్నారు. హైదరాబాద్ మెట్రోను ప్రస్తుత 71 కి.మీ నుంచి 200 కి.మీ పైగా విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పరిశ్రమలను కోర్ అర్బన్ ప్రాంతం నుంచి పెరి అర్బన్ జోన్లకు తరలిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా మూసీ నది పునరుద్ధరణ, సరస్సులు, చెరువుల సంరక్షణ, వాటర్ గ్రిడ్, వనరుల నిర్వహణ ప్రణాళికలను ముఖ్యమంత్రి వివరించారు. హైడ్రా రూపంలో పర్యావరణ రక్షణకు ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో వాతావరణ ప్రమాదాలను తగ్గించి నగరాన్ని సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందే నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.
బీఆర్ఎస్ దిమ్మెలు కూలాల, అదే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి : సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో జరిగిన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎన్టీఆర్ కు అభిమానులు, చంద్రబాబుకు సహచరులు, అనుచరులు ఉన్నారని తెలిపారు. వాళ్లందరికీ తన విజ్ఞప్తి ఒక్కటేనని, తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలని చూసిన బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలన్నారు. అదే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అన్నారు. తద్వారా తమ ఉమ్మడి శత్రువును రూపుమాపేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని టీడీపీని కోరినట్లయింది. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఉండొద్దని తెలుగు దేశం పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను వంద మీటర్ల గొయ్యి తీసి పాతిబెట్టినప్పుడే ఎన్టీఆర్ కు నివాళి అని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ గద్దెలు దిగాలని, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలని, అప్పుడే నందమూరి తారకరామారావుకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్లం అవుతామన్నారు. బీఆర్ఎస్ ను బొందపెట్టల్సిన బాధ్యత మనమీద ఉందంటూ టీడీపీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి సూచించారు. మరోవైపు సొంత పార్టీ కాంగ్రెస్ ను వదిలి.. టీడీపీని, ఎన్టీఆర్ ను పొగుడుతూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి.
కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేవాడిని కాదు : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలోని నారాయణపేట జిల్లా కోస్గిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హజరైన మాట్లాడుతూ కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నూతనంగా ఎన్నికైన సర్పంచు,ఉప సర్పంచు, వార్డుసభ్యులు ప్రజల ఆశలను వమ్ముచేయకుండా పని చేయాలి. గాందీ కలలు గన్నట్టు గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధికి చిహ్నం. కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు స్దానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎన్నికలు పూర్తి అయ్యాయి ఇక రాజకీయాలు వద్దు అభివృద్ధి ద్యేయంగా పార్టీలకు అతీతంగా పని చేయాలి. చిన్నచిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టాలి గ్రామల్లో కక్షలు పెంచుకోవద్దు. నాకు వచ్చిన ఈ అవకాశం మీ అభివృద్ధికే రాష్ట్రంలోని 12706 గ్రామపంచాయితీలకు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నిదులు ఇస్తాం. చిన్న పంచాయితీలకు 5 లక్షలు పెద్దగ్రామ సర్పంచులకు 10 లక్షలు నూతన సంవత్సరంలో ఇస్తాం. సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబందించిన ప్రణాళికలు సిద్దం చేయండి. ప్రతి ఇంటికి రేషన్ కార్డులు ఇస్తాం. గ్రామాల్లో ఎవరికైన అర్హులకు సంక్షేమ పథకాలు రాకుంటే పేర్లు ఇస్తే వారికి ఇస్తాం. ఇందిరమ్మ చీరలు మేం ఇస్తున్న సారె లాంటిది. చదువే జీవితాల్లో వెలుగు తెస్తుంది పిల్లలకు మంచి విద్యను అందిస్తాం. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పహారం,నాణ్యమైన భోజనం అందిస్తాం. మార్చి 31 లోగా కేంద్రం నుంచి 3 వేల కోట్ల నిధులు గ్రామపంచాయితీలకు తీసుకోస్తా. కేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా?. పదేళ్లు బీఆర్ఎస్ తెలంగాణకు అన్యాయం చేసింది. పాలమూరుకు వలస వచ్చి కేసీఆర్ ఎంపీ అయ్యాడు. కానీ, నీళ్ల కూడా ఇవ్వకుండా ఈ ప్రాంతాన్ని ఎండగట్టాడు. బీఆర్ఎస్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. వాళ్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో పాపాలు చేశారు. లక్షా 80 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి.. కమిషన్లు దండుకున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. నన్ను జైలుకు పంపారు. నా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారు. కేసీఆర్ ఆయన పాపాలకు ఆయనే పోతాడని.. నేనేమీ అనలేదు. అధికారంలోకి వచ్చాక నేను పగ రాజకీయాలు చేయలేదు. ఒక్క కేసు కూడా పెట్టలేదు. కక్ష సాధింపులకు పాల్పడలేదు. ప్రమాణస్వీకారం చేసిన రోజునే మంచం మీద నుంచి పడి మక్కెలిరగొట్టుకున్నాడు. రెండేళ్ల నుంచి ఫాంహౌజ్నే కేసీఆర్ జైలుగా మార్చుకున్నారు. మొన్నే బయటకు వచ్చాడు. తోలు తీస్తానంటూ ఏదో మాట్లాడారు. రెండేళ్లు ఫామ్‌హౌజ్‌లో అదే పని చేశారా?. మా సర్పంచ్ల దగ్గరికి రా ఎవరి తోలు తీస్తారో చూద్దాం. చింతకమడకలో చీరి చింతకు కడతారు. నేకేసీఆర్ చేయని పాపం అంటూ లేదు. సొంతల్లుడి ఫోన్‌నే ట్యాపింగ చేయించాడు. సొంత బిడ్డకే చీర పెట్టలేనోడు.. మాపై మాట్లాడతారా?. ఇన్ని ఎన్నికలు జరుగుతున్నా.. జనం బండకేసి కొడుతున్నా. సిగ్గు రావడం లేదు. కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేవాడిని కాదు. పండక్కి చెల్లెల్ని కూడా ఇంటికి పిలవలేనోడు కేటీఆర్. తండ్రి గాలికి సంపాదించిన వాటా పంచాల్సి వస్తుందని సొంత చెల్లినే మెడలు పట్టి బయటకు పంపించావ్. సొంత చెల్లికే సమాధానాలు చెప్పలేనోడు నాకే సవాల్ విసరుతాడా?.. కేటీఆర్ నువ్వెంత.. నీ స్థాయి ఎంత..? నీలా అమాయకుల్ని నేను మోసం చేయలేదు. అలాంటిది నేను నీకు భయపడతానా?.. హరీష్‌రావు ఆరడుగులు పెరిగిండు.. కానీ తలకాయే లేదు. నీ కండలు కరిగి.. తొలు మిగిలింది. నీకా నేను భయపడేది. 2029లో 80 శాతంపైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తాం. రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా.. ఇదే నా సవాల్. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్‌ను అధికారంలోకి రానివ్వను.. ఇదే నా శపథం. తండ్రీ కొడుకులు కల్లు కాంపౌండ్ మాటలు మాట్లాడొద్దు. సోయిలేని మాటలు, స్థాయిలేని విమర్శలు. పార్టీ ఆఫీసులో కాదు.. అసెంబ్లీకి రండి. నీళ్లు, నియామకాలు.. నిధులు.. వేటిపైన అయినా అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధం. కూలిన కాళేశ్వరం.. ఫోన్ ట్యాపింగ్.. ఏ అంశంపైనా అయినా సరే చర్చిద్దాం. ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు చర్చ పెడతాం. మీరు సిద్ధమా? అని రేవంత్ అన్నారు.
కేసీఆర్ కుటుంబంలో కాసుల పంచాయితీ తప్ప, మరొకటి కాదు !
తెలంగాణలోని ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొని ప్రసంగిస్తూ కేసీఆర్ చేసిన పాపం ఊరికే పోదని విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో కాసుల పంచాయితీ తప్ప, మరొకటి లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము తిన్నవారు ఎవరూ బాగుపడే చరిత్ర లేదని హెచ్చరించారు. ఒక పెద్దాయన ఆదిలాబాద్‌కు దెయ్యంలా పట్టారని సెటైర్లు గుప్పించారు. కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిందని, వారింట్లో కాసులు కురిశాయని విమర్శించారు. ఆ ప్రాజెక్టు పేరు మారిందని, ప్లేస్ మారింది, అంచనాలు లక్ష కోట్లకు పెరిగాయని ఆరోపించారు. గత నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపారని విమర్శించారు. గత పాలకులు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలించారని ధ్వజమెత్తారు. విపక్ష నేతలను కలుపుకుని తాము ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సభల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఇచ్చారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సచివాలయానికి వెళ్తే గేట్లకు తాళం వేసి అడ్డుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఓటును ఆయుధంగా మార్చి ప్రజాపాలన తీసుకువచ్చారని తెలిపారు. రెండేళ్లలో ఏరోజూ తాను విశ్రాంతి తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే లక్ష్యమని వ్యాఖ్యానించారు. సంక్షేమం - అభివృద్ధి రెండుకళ్లుగా ముందుకు సాగుతున్నామని వివరించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రపంచంతో పోటీ పడాలంటే ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రెండూ కీలకం : సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం తన సొంత నియోజకర్గం కొడంగల్ లో పర్యటించి పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. విద్యతోనే పేదల ఇంట్లో వెలుగులు నిండుతాయన్నారు. అందుకే మీ బిడ్డలను ఉన్నత చదువులు చదివించడమే సీఎంగా తన ముందున్న టార్గెట్ అన్నారు. ప్రపంచంతో పోటీపడాలంటే ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రెండూ కీలకమని సీఎం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరికి సన్నబియ్యం ఇస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు రానన్నాయని రెండు, మూడు రోజుల్లో దానికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను ఎన్నుకోవద్దని, అభివృద్ధి చేసే వారికి అండగా నిలవాలని సీఎం రేవంత్ ప్రజలను కోరారు. కొడంగల్ లోని ప్రతి ఎకరాకు కృష్ణానది నీరు అందిస్తామని త్వరలోనే రూ.ఐదువేల కోట్లతో ఎడ్యుకేషనల్ క్యాంపస్ నిర్మించి కొడంగల్‌ను ఎడ్యుకేషనల్ హాబ్ గా మార్చుతామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు కార్యకర్తలకు అంకితం !
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ గెలుపులో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. పీసీసీ నాయకత్వ స్థాయి నుంచి కార్యకర్త స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఏకతాటిపై నిలిచి, ఐక్యంగా పని చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపును ఏ శక్తి ఆపలేదని ఈ ఫలితాలు రుజువు చేశాయని, ఈ గెలుపు కార్యకర్తలకు అంకితం అన్నారు. ఈ గెలుపు హైదరాబాద్ నగర అభివృద్ధి పట్ల, ఇక్కడ పేదల సంక్షేమం పట్ల మా బాధ్యతను మరింత పెంచిందన్నారు. రెండేళ్లుగా నగరాభివృద్ధికి సంబంధించిన మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, ఫోర్త్ సిటీ నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు వంటి మా ఆలోచన, విజన్, కార్యచరణకు ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజలు ఆమోదం తెలిపారని, వచ్చే మూడేళ్లు ఆ దిశగా నిరంతరం పని చేయడానికి ఈ ఎన్నికల ఫలితాలు మాకు సరికొత్త ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాయన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయం. వచ్చే మూడేళ్లు అభివృద్ధి, పేదల సంక్షేమమే మా మంత్రం అని పేర్కొన్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి ఇక మా బాధ్యత అని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ గురించి మాట్లాడుతూ కేటీఆర్‌కు అహంకారం, హరీశ్ రావుకు అసూయ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. అయినా బుద్ధి రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు. అప్పటికీ వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మళ్లీ బుద్ధి చెప్పారు' అంటూ కేటీఆర్, హరీష్ రావుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వరుస ఓటముల తర్వాత కూడా వారి వైఖరి మారకపోతే రాష్ట్రంలో బీఆర్ఎస్ కనిపించకుండా పోవడం ఖాయం అని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ప్రతిపక్ష నేతలకు సూచించారు.
హైదరాబాద్ రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లు పెడతాం !
ఢిల్లీలో జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు-భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సారథ్యం వహించినా పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా నిలిచారని అన్నారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖ ద్వారమని సీఎం తెలిపారు. జీసీసీలకు గ్యమస్థానంగా ఉన్న హైదరాబాద్‌లో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను నిలపడమే తన ప్రథమ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ భారత దేశంలోనే నూతన నగరంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని సీఎం అన్నారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతిని వివరించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చైనా +1 మోడల్‌కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుంది" అని అన్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను ఆహ్వానించారు. భారతదేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయని, హైదరాబాదులో ఆ ట్రెండ్ ను మార్చాలని తాము అనుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని సీఎం అన్నారు. సదస్సు ప్రారంభంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ప్రదర్శించారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి లక్ష్యం ఢిల్లీలో జరిగిన ఈ వార్షిక సమావేశంలో విశేష ఆదరణ పొందింది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల అవకాశాలు వివరించిన సీఎం ప్రసంగం, అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ పారదర్శకంగా, సాహసోపేతంగా, సాధించగలిగేలా ఉంది. ఆయన చెప్పిన ప్రాజెక్టులు, వాటి సామాజిక ప్రభావం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు మా సభ్యులలో అత్యధికులం డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరవుతామని, తెలంగాణ విజన్‌ను దగ్గరగా తెలుసుకోవాలని మేమంతా ఆసక్తిగా ఉన్నా మని యూఎస్ఐఎస్పీఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ ముఖేష్ ఆఘి అన్నారు.
తమపై కేటీఆర్ చేస్తున్న విమర్శలు సినిమాలో ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయి : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమపై కేటీఆర్ చేస్తున్న విమర్శలు సినిమాలో ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయని చెప్పారు. శ్రీలీల ఐటమ్ సాంగ్ కు..కేటీఆర్ ప్రచారానికి తేడా లేదన్నారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని అవమానించిన కేటీఆర్ మహిళలకు రక్షణ కల్పిస్తాడా అని ప్రశ్నించారు. రూ. 8లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పగించారని చెప్పారు. వాళ్ల అప్పులు తీరుస్తూ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారని ఆరోపించారు. కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్ లతో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. తాము చేసిన పనులు కేసీఆర్ చెరిపేస్తే పోయేవి కాదన్నారు. కాంగ్రెస్ ఎంత త్యాగం చేసిందో అందరికీ తెలిసిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఏర్పడిందన్నారు. అధికారంలోకి వచ్చిన పదేళ్లలో బీఆర్ఎస్ అభివృద్ధి చేయడం పక్కన పెట్టి అప్పులు చేసి పోయిందన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని, డబ్బులన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని, తమకు ఈసారి అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని వందల కోట్లతో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. 2004-2014 కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్న బ్యాడ్ బ్రదర్స్ : సీఎం రేవంత్ రెడ్డి
హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి మెట్రో విస్తరణ అపుతున్నారని ఆయన ఆరోపించారు. పీజేఆర్, శశిధర్ రెడ్డి లు హైదరాబాద్ బ్రదర్స్ అభివృద్ధి చేశారు. బ్యాడ్ బ్రదర్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేటీఆర్ నగరానికి తెచ్చిన గొప్ప వరం గంజాయి, డ్రగ్స్ అని ఆయన ఎద్దేవా చేశారు. నగరాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చాడని, కేదార్ దుబాయ్‌లో డ్రగ్స్ ఎక్కువై చనిపోలేదా..? 111 జీఓలో ఫార్మ్ హౌస్ లు కట్టుకున్నారు మీరు కాదా..? పదేళ్లలో కేసీఆర్ ఏం చేసిందో.. చర్చ చేయడానికి రెడీ అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. మేం అభివృద్ధి చేయడానికి బ్యాడ్ బ్రదర్స్ అడ్డంకిగా మారిందని, ఎంఐఎం సహకరించినందుకు.. మెట్రో పనులు జరుగుతున్నాయి.. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కొనసాగుతున్నాయి.. కంటోన్మెంట్కి 6 వేల కోట్లు ఖర్చు చేసినా.. ఒక్క ఓటు వేయండి.. మూసీని ప్రక్షాళన చేసుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు. యమునా నది ప్రక్షాళనచేయచ్చు.. గుజరాత్ లో నది ప్రక్షాళన చేయచ్చు.. కానీ మూసీ ప్రక్షాళన ఎందుకు వద్దు కిషన్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ అనే వాడు విష పురుగు. 44 చెరువులు బీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించి అమ్మేశారు.. హైడ్రా మీద విషం చిమ్మేది మీరు కాదా..? బతుకమ్మ కుంట ఆక్రమించుకున్నాడు ఎవడు..? ఎడ్ల సుధాకర్… కేసీఆర్‌కి హెలికాప్టర్‌తో పూలు చల్లాడు అని బతుకమ్మ కుంట ఆక్రమించలేదా..? కేసీఆర్ నజరానాగా ఆయనకు ఇవ్వలేదా..? చెరువు పునరుద్ధరణ చేయాలి అని నా ఆలోచన.. పేదలు ఇబ్బందిపడితే… డబుల్ బెడ్ రూమ్ ఇస్తాం అని చెప్పినా.. హైడ్రా వచ్చిన తర్వాత.. రోడ్లపై నీళ్లు పారేది తగ్గలేదా..? హైడ్రా.. ఈగల్ ఫోర్స్ మీద కేటీఆర్ పగ పట్టిండు.. హైడ్రా తప్పు చేస్తే చెప్పు కలిసి పోదాం.. నిజ నిర్ధారణ చేద్దాం.. నీ ఆలోచన ఏంది.. పార్కులు కబ్జా చేయాలి అంతేనా.. హరీష్ రావు.. కేసీఆర్‌కి అండగా ఉండే వాళ్ళను బయటకు పంపించే పనిలో ఉన్నాడు.. కాల్ సినిమాలో అజయ్ దేవ్ గన్ టైప్ హరీష్.. ఆలె నరేంద్ర నుండి.. ఈటల వరకు.. కేసీఆర్ కి నమ్మకంగా ఉండే వాళ్ళే.. కేసీఆర్ కు నమ్మకంగా ఉండే వాళ్ళను బయటకు పంపాడు.. పదేళ్లు అండగా ఉండండి.. తెలంగాణ అభివృద్ధి చూపిస్తా.. గంజాయి.. డ్రగ్స్ వాడితే.. తొక్కి నారా తీస్తా.. చెరువులు కబ్జా చేసిన వాడు పెద్దోడు ఉంటే.. పగిలి పొద్దీ.. పేదలు ఉంటే.. అండగా ఉందాం.. దీపావళి రోజు గంజాయి కొట్టే వాడు.. రౌడీనా.. గల్లీలో పేదలతో ఉండే వాడు రౌడీనా.. సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్‌లో తిరిగిన నువ్వు.. కార్మికుల గురించి ఏం చేశావు.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నా క్యాంప్ ఆఫీస్ లెక్క.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నా తాత సొమ్మా.. అద్దంలో చూసుకో హరీష్.. నా గురించి మాట్లాడే ముందు.. మీ దేవుడి మొక్కులు కూడా ప్రజల సొమ్ము తోనే తీర్చారు.. దేన్నీ వదిలారు.. కోవిడ్‌ను కూడా వదల లేదు.. ఎన్ని డొనేషన్లు మింగారు.. మన బ్యాండ్ మేళం.. మనం చెప్పిన పాటే పాడతారు..’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Subscribe to:
Posts (Atom)
