దేశీయ మార్కెట్లో నవంబర్ 9న రియల్‌మి 17 సిరీస్‌లో హైఎండ్ మోడల్‌గా రియల్‌మి 17 ప్రో రానుంది. అయితే, రియల్‌మి ఫోన్ లాంచ్ కాకముందే సంబంధించిన స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. లీకైన వివరాల ప్రకారం రియల్‌మి 17 ప్రోలో 1.5K రిజల్యూషన్‌తో అమోల్డ్ డిస్‌ప్లే ఉండనుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా అందిస్తుంది. వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా బ్రౌజింగ్ వంటి టాస్కులు మరింత స్మూత్‌గా ఉండొచ్చ.. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో రావొచ్చు. ఈ ఫోన్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో ఫీచర్ బ్యాటరీ.. ఏకంగా 10,000mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీని అందించవచ్చునని లీకులు చెబుతున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే, ఛార్జింగ్ స్పీడ్, బ్యాటరీ బ్యాకప్‌పై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫొటోగ్రఫీ కోసం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఇవ్వవచ్చని అంచనా.. 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉండొచ్చట. సెల్ఫీల కోసం 32MP లేదా 50MP ఫ్రంట్ కెమెరా అందించే అవకాశం ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP68 లేదా IP69 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉండొచ్చు. ఆండ్రాయిడ్ 17 ఆధారిత రియల్‌మి యూఐతో ఈ ఫోన్ రావచ్చని అంచనా.
3
Beranda
› AMOLED display with 1.5K resolution and a 120Hz refresh rate
› business
› Realme 17 Pro to Launch on November 9
› technology
› నవంబర్ 9న రియల్‌మి 17 ప్రో విడుదల
Subscribe to:
Post Comments (Atom)
