అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు క్రిస్టియానో రొనాల్డో ప్రకటించాడు. సోషల్ మీడియాలో తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. దీంతో పోర్చుగల్ జాతీయ జట్టుతో రొనాల్డోకు ఉన్న 23 ఏళ్ల అనుబంధం ముగియనుంది. 2003 ఆగస్టులో పోర్చుగల్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన 41 ఏళ్ల రొనాల్డో అప్పటి నుంచి జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మైదానంలో తన ఆటతీరుతో ఎన్నో విజయాలను అందించాడు. జట్టుకు నాయకుడిగా అనేక చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. ఇప్పుడు అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతూ.. తన జెర్సీ నంబర్ 7ను తిరిగి జాతీయ జట్టుకు ఇచ్చే సమయం ఆసన్నమైందని వెల్లడించాడు. జాతీయ జట్టు తరఫున ఇకపై తన ఐకానిక్ నంబర్ 7 జెర్సీని ధరించబోనని చెప్పాడు రొనాల్డో. పోర్చుగల్ ప్రజలను ఉద్దేశించి భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశాడు. 23 ఏళ్ల పాటు ఆ జెర్సీని ధరించడం.. దేశం తరఫున మైదానంలో పోరాడటం తనకు దక్కిన గొప్ప గౌరవమన్నాడు. ఆ నంబర్ కేవలం తనది మాత్రమే కాదని.. దేశానికి చెందినదని తన సందేశంలో చెప్పుకొచ్చాడు. 2003 ఆగస్టులో మొదలైన తన ప్రయాణం ఇవాళ్టితో ముగిసిందని అన్నాడు. పోర్చుగల్ తరఫున రొనాల్డో సృష్టించిన రికార్డులు అసాధారణం. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా.. అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. ఇప్పటివరకు పోర్చుగల్ తరఫున 234 మ్యాచ్‌లు ఆడి 146 గోల్స్ సాధించాడు. 2016లో పోర్చుగల్ తొలిసారి యూరోపియన్ ఛాంపియన్‌షిప్ గెలవడంలో రొనాల్డో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 2019, 2025లో UEFA నేషన్స్ లీగ్ టైటిళ్లను కూడా అందుకున్నాడు. వ్యక్తిగతంగా ఎన్నో అవార్డులు సాధించిన అతడు.. జట్టుకు కూడా అద్భుతమైన విజయాలను అందించాడు. రొనాల్డో కెరీర్‌లో ప్రపంచకప్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. 2006 నుంచి 2026 వరకు మొత్తం ఆరు ఫిఫా ప్రపంచకప్ టోర్నీల్లో పోర్చుగల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆరు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీల్లో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే ఇంతటి గొప్ప కెరీర్ ఉన్నా.. ప్రపంచకప్ ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయాడు. 2026 ప్రపంచకప్‌లో స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఓడిపోవడంతో ఆ కల నెరవేరలేదు. రొనాల్డో టీమ్‌లోకి వచ్చిన తరువాత పోర్చుగల్ 2006 వరల్డ్ సెమీస్‌కు చేరుకుంది. ప్రపంచకప్‌లో పోర్చుగల్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. తమ దేశ ఫుట్‌బాల్‌కు రొనాల్డో చేసిన సేవలను పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య ప్రత్యేకంగా గుర్తించింది. రొనాల్డో అంతర్జాతీయ కెరీర్‌కు గ్రాండ్ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది. అభిమానులు, దేశ ప్రజలు మరోసారి అతడి సేవలను గుర్తుచేసుకునేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించింది.
3
Beranda
› 23-year association with the Portugal national team
› Cristiano Ronaldo Announces Retirement from International Football
› He shared the news on social media
› sports
› అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో
Subscribe to:
Post Comments (Atom)
